టాటా స్కై HD మల్టీ టీవీ కనెక్షన్ పై RS.400 తగ్గింపు

|

ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై ఇప్పుడు డిష్ టివిని అధిగమించి డిటిహెచ్ మార్కెట్లో మొదటి స్థానంలో ఉంది. 2019 రెండవ త్రైమాసికంలో కంపెనీ మొత్తంగా 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకున్నది. TRAI కొత్త నియమాలను ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది DTH వినియోగదారులు తమ కనెక్షన్ ను వదులుకున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది.

TRAI
 

TRAI యొక్క కొత్త ఫ్రేమ్‌వర్క్ తర్వాత మల్టీ టీవీ వినియోగదారులు ఎక్కువగా హిట్ అయ్యారు. ఇప్పుడు టాటా స్కై మల్టీ టీవీ వినియోగదారులకు కొంత ప్రయోజనం చేకూర్చడానికి వాటి ధరలను తగ్గించింది.

HD సెట్-టాప్ బాక్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన డిష్‌టీవీHD సెట్-టాప్ బాక్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన డిష్‌టీవీ

ధర తగ్గింపు వివరాలు

ధర తగ్గింపు వివరాలు

టాటా స్కై యొక్కహెచ్‌డి మల్టీ టీవీ కనెక్షన్ గతంలో 1,399 రూపాయలకు లభించేది. అయితే ఇటీవల వీటి ధరను రూ.400లకు తగ్గించింది. ఇప్పుడు మీరు దానిని 999 రూపాయలకు కొనుగోలు చేయగలరని డ్రీమ్‌డిటిహెచ్ నివేదించింది. ఈ ధరలో ఇన్‌స్టాలేషన్ మరియు యాక్టివేషన్ ఛార్జీలు, హెచ్‌డి బాక్స్, రిమోట్ మరియు 10 మీటర్ల కేబుల్ కూడా ఉన్నాయి. వినియోగదారులు వారు చూడాలనుకుంటున్న ఛానెల్‌ల ఆధారంగా సుబ్స్క్రిప్షన్ కోసం కొంచెం అదనంగా చెల్లించాలి. SDసెట్-టాప్-బాక్స్ యొక్క మల్టీ టీవీ ఛార్జీలు ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు వీటి ధరలు 1,299 రూపాయలుగా ఉన్నాయి.

టాటా స్కై స్మార్ట్ ప్యాక్స్

టాటా స్కై స్మార్ట్ ప్యాక్స్

టాటా స్కై వినియోగదారులకు మరిన్ని ఎక్కువ ఛానెల్ లను ఇవ్వడానికి కొత్తగా స్మార్ట్ ఛానల్ ప్యాక్‌లను అందిస్తుంది. స్మార్ట్ ఛానల్ ప్యాక్‌లు వినియోగదారులకు భాషల వారీగా ఛానెల్‌లను పొందడానికి అనుమతిస్తాయి. DTH ప్రొవైడర్ యొక్క స్మార్ట్ ప్యాక్‌ల ప్రారంభ ధర 206రూపాయలు ఇది మరాఠీ స్మార్ట్ ప్లాన్. మరాఠీ చెల్లింపు ఛానెల్‌ల ధర రూ.53 మరియు NCF ఛార్జీలు అదనంగా రూ.153గా ఉన్నాయి. అంటే వినియోగదారులు మొత్తం రూ.206 చెల్లించాల్సి ఉంటుంది.

స్మార్ట్ ఛానల్
 

టాటా స్కై అందిస్తున్న కొత్త స్మార్ట్ ఛానల్ ప్యాక్లలో హిందీ స్మార్ట్ ప్లాన్ రూ.249, పంజాబీ స్మార్ట్ ప్లాన్ రూ.249, గుజరాతీ స్మార్ట్ ప్లాన్ రూ .249, బెంగాలీ స్మార్ట్ ప్లాన్ రూ.220, ఓడియా స్మార్ట్ ప్లాన్ రూ.211, మరియు తెలుగు స్మార్ట్ ప్లాన్‌ను రూ.249ల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇంకా తమిళ స్మార్ట్ ప్లాన్‌ను రూ.249, కన్నడ స్మార్ట్ ప్లాన్‌ను రూ.249, మలయాళ స్మార్ట్ ప్లాన్‌ను రూ.249 లకు కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky HD Multi TV connection price slashed: Here are the full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X