Tata Sky +HD STB కొనుగోలుకు సరైన సమయం!! సగానికి సగం తగ్గిన STB ధర...
ఇండియాలోని డిటిహెచ్ రంగంలో ఒకటైన టాటా స్కై ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉండి నంబర్ వన్ డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్ గా ఆవిష్కరించబడింది. టాటా స్కై ఇటీవల తన టాటా స్కై + HD కనెక్షన్ యొక్క ధరను సగానికి సగం తగ్గించింది.

టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌ల ధరలు
టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ తన వినియోగదారుల కోసం వివిధ రకాల కనెక్షన్లు మరియు సెట్-టాప్ బాక్స్‌లను రకరకాల ధరల వద్ద అందిస్తుంది. వాటిలో చాలా ముఖ్యమైనవి టాటా స్కై యొక్క SD మరియు HD STB కనెక్షన్లు. ఇవే కాకుండా టాటా స్కై బింగే +, టాటా స్కై + హెచ్‌డి, టాటా స్కై UHD 4K STB కనెక్షన్లను కూడా అందుబాటు ధరలో అందిస్తున్నది. HD మరియు SD కనెక్షన్లు చాలా సరసమైన ధరల వద్ద లభిస్తున్నాయి. అయితే ఇతర కనెక్షన్ల యొక్క ధరలు భారీగా ఉన్నాయి. టాటా స్కై + హెచ్‌డి కనెక్షన్ యొక్క ధర ఇంతకు ముందు రూ.9,300 వద్ద ఉండగా ఇప్పుడు దాని ధరను రూ.4,999 కు తగ్గించింది.

టాటా స్కై + HD బాక్స్ తగ్గింపు ధర
టాటా స్కై యొక్క కొత్త కనెక్షన్లలో టాటా స్కై + HD సెట్-టాప్ బాక్స్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం టాటా స్కై సంస్థ ఈ కనెక్షన్ యొక్క ధరను 46% వరకు తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ‘HD PVR బిగ్ సేల్' కింద టాటా స్కై ఈ ఆఫర్‌ను లాంచ్ చేసింది. ఇంతకు ముందు కొత్త టాటా స్కై + హెచ్‌డి కనెక్షన్‌ను రూ.9,300 చెల్లించి వినియోగదారులు పొందేవారు. కానీ ఇప్పుడు దీని మీద 46% వరకు తగ్గింపు లభించడంతో దీని అసలు ధర కంటే రూ.4,301 తక్కువకు లభిస్తున్నది. అంటే దీనిని రాయితీ ధరవద్ద ఇప్పుడు కేవలం రూ.4,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

టాటా స్కై + HD బాక్స్ మల్టీ కనెక్షన్ తగ్గింపు ధర
టాటా స్కై యొక్క HD PVR బిగ్ సేల్ ఆఫర్లో భాగంగా క్రొత్త కనెక్షన్‌లపైనే కాకుండా మల్టీ టీవీ కనెక్షన్ కొనుగోలు మీద కూడా ఈ తగ్గింపును సంస్థ అందిస్తున్నది. మల్టీ టివి కనెక్షన్ మరియు టాటా స్కై + హెచ్డి కొత్త కనెక్షన్ ను కొనుగోలు చేసే వినియోగదారులందరికి కూడా 49% వరకు తగ్గింపు లభిస్తుంది. ఇంతకుముందు మల్టీ టీవీ కనెక్షన్ పొందడానికి కస్టమర్ రూ.8,900 చెల్లించవలసి ఉండేది. కానీ ఇప్పుడు దీనిని 49% తగ్గింపుతో అంటే రూ.4,401 తగ్గింపు తరువాత రూ.4,499 మాత్రమే చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

టాటా స్కై + HD బాక్స్ అప్‌గ్రేడ్ ఆఫర్
ఇప్పటికే టాటా స్కై కనెక్షన్‌ను కలిగి ఉన్న వినియోగదారులు టాటా స్కై + హెచ్‌డి కనెక్షన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి కూడా ‘HD PVR బిగ్ సేల్' కింద సంస్థ గొప్ప ప్రయోజనంను ఆందిస్తున్నది. ఇప్పుడు కస్టమర్లు వారి యొక్క బాక్స్ ను అప్‌గ్రేడ్ చేయడానికి కేవలం రూ.4,499 చెల్లింలిస్తే సరిపోతుంది. ఇది మల్టీ టీవీ కనెక్షన్‌ను పొందటానికి సమానం. ఇంతకుముందు కస్టమర్ తన కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.5,999 చెల్లించవలసి ఉండేది. కానీ ఇప్పుడు వినియోగదారులకు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.


Click it and Unblock the Notifications