DTH కొత్త కనెక్షన్ కోసం చూస్తున్నారా?? అయితే ఇది మీకోసమే..

|

ఇండియాలో లాక్ డౌన్ మొదలైన తరువాత అందరూ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావడంతో వినోదం కోసం DTH యొక్క వినియోగం ఎక్కువ అయినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. కొత్తగా గృహప్రవేశం చేస్తున్న వారు లేదా కొత్త కార్యాలయంలో DTH కనెక్షన్ ను పొందడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే అటువంటి వారి కోసం ప్రస్తుతం ఇండియాలో ఉత్తమమైన డిటిహెచ్ సర్వీసు ప్రొవైడర్లు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి, టాటా స్కై, డి 2 హెచ్, డిష్ టివి

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి, టాటా స్కై, డి 2 హెచ్, డిష్ టివి

ఇండియాలోని డిటిహెచ్ సర్వీసు ప్రొవైడర్లలో ఉత్తమమైన వాటి కోసం చూస్తూ ఉంటే కనుక ఇండియా మొత్తం మీద ఎయిర్‌టెల్ డిజిటల్ టివి, టాటా స్కై, డి 2 హెచ్ మరియు డిష్ టివి వంటివి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ నాలుగు డిటిహెచ్ ఆపరేటర్లు కొత్త వారిని ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. వీటి యొక్క ఆఫర్లను సర్వీస్ యొక్క వెబ్‌సైట్ నుండి తెలుసుకోవచ్చు. ఈ నాలుగింటిలో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది రకరకాల ధరల వద్ద కొన్ని రకాల సెటప్ బాక్స్ లను అందిస్తున్నాయి. ఈ డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్‌లు అందిస్తున్న ఆఫర్ల గురించి మరిన్ని ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Also Read:Broadband Connectionలో తరచూ సమస్యలా? అయితే ఈ చిట్కాలు పాటించండి...Also Read:Broadband Connectionలో తరచూ సమస్యలా? అయితే ఈ చిట్కాలు పాటించండి...

టాటా స్కై కొత్త కనెక్షన్ ధరల వివరాలు
 

టాటా స్కై కొత్త కనెక్షన్ ధరల వివరాలు

టాటా స్కై యొక్క కొత్త కనెక్షన్ ను పొందాలని చూస్తున్న వినియోగదారులకు కొత్త STB బాక్స్ లలో SD మరియు HD STB రెండింటిని కూడా రూ.1,499 ధర వద్ద పొందవచ్చు. అలాగే టాటా స్కై యొక్క UHD 4K STBను రూ.5,900 ధర వద్ద మరియు టాటా స్కై + హెచ్‌డి ను రూ.8,900 ధర వద్ద అందిస్తున్నది. చివరిగా టాటా స్కై యొక్క బింగే + STB ను రూ.3,999 ధర వద్ద ప్రస్తుతం అందిస్తున్నది. టాటా స్కై బింగే +STB ను కొనుగోలు చేసిన వారికి 6 నెలల బింగే చందాను ఉచితంగా అందిస్తుంది. వాస్తవానికి దీన్ని మొదట రూ.5,999 వద్ద లాంచ్ చేశారు.

టాటా స్కై మల్టీ టీవీ కనెక్షన్ ధరల వివరాలు

టాటా స్కై మల్టీ టీవీ కనెక్షన్ ధరల వివరాలు

టాటా స్కై సంస్థ తన వినియోగదారులకు మల్టీ టీవీ కనెక్షన్ లను కూడా తగ్గింపు ధరల వద్ద అందిస్తున్నది. వీటి యొక్క ధరల విషయానికి వస్తే వీటి యొక్క STB లపై మీకు తగ్గింపు లభించదు. మల్టీ టివి కనెక్షన్‌లపై రూ.1,399 ధర వద్ద లభించే SD STB మరియు హెచ్‌డి ఎస్‌టిబి 1,199 రూపాయలకు వస్తుంది. టాటా స్కై సంస్థ చాలా మంచి కస్టమర్ కేర్ సేవను కలిగి ఉంది. కావున ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి మీరు DTH యాప్ తో పాటు వెబ్‌సైట్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కొత్త కనెక్షన్ ధరల వివరాలు

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కొత్త కనెక్షన్ ధరల వివరాలు

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి యొక్క కొత్త కనెక్షన్‌లను పొందాలనుకునే వారి కోసం DTH సంస్థ SD సెట్-టాప్ బాక్స్ ను రూ.1,100 ధర వద్ద HD సెట్-టాప్ బాక్స్ ను రూ.1,300 ధర వద్ద అందిస్తున్నది. అలాగే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను రూ.3,693 ధరను చెల్లించి పొందవచ్చు. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కొత్తగా మార్కెట్లోకి రావడంతో ఇది తన వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందిస్తున్నది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ యొక్క ఛానెల్ ప్యాక్‌ను నేరుగా STB నుండి ఎంచుకోవచ్చు. ఛానెల్ ప్యాక్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఎంచుకోవచ్చు.

డిష్ టీవీ మరియు డి 2 హెచ్ కొత్త కనెక్షన్‌ల ధరల వివరాలు

డిష్ టీవీ మరియు డి 2 హెచ్ కొత్త కనెక్షన్‌ల ధరల వివరాలు

డిష్ టీవీ యొక్క కొత్త కనెక్షన్‌లను పొందాలనుకునే వారి కోసం సంస్థ తన SD బాక్స్‌ను రూ .1,490, హెచ్‌డి బాక్స్‌ను రూ.1,590 ధర వద్ద అందిస్తున్నది. అలాగే డిష్‌ SMRT హబ్ STBను 2,499 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. డిష్ టీవీలో భాగంగా గల డి2హెచ్‌ యొక్క కొత్త కనెక్షన్‌లో డిజిటల్ SD STBను 1,499 రూపాయలకు, డిజిటల్ హెచ్‌డి ఎస్‌టిబి రూ.1,599, హెచ్‌డి RF ఎస్‌టిబి 1,799 రూపాయలకు, మ్యాజిక్‌స్టిక్‌తో సహా హెచ్‌డి ఆర్‌ఎఫ్ STBను రూ.2,198 ధర వద్ద అందిస్తున్నది. డిష్ టివి మరియు డి 2 హెచ్‌ యొక్క STB ధరలు రెండూ కూడా సారూప్య ధర నమూనాలను కలిగి ఉన్నాయి.

ఇండియాలో ఉత్తమమైన DTH సర్వీస్ ప్రొవైడర్

ఇండియాలో ఉత్తమమైన DTH సర్వీస్ ప్రొవైడర్

ప్రస్తుతం ఇండియాలో గల ఉత్తమ డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్ విషయానికి వస్తే టాటా స్కై సంస్థ అందరి కంటే ముందుంటుంది. అయితే ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క STBల ధరలు అందరితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. మరోవైపు డిష్ టివి మరియు డి 2 హెచ్ కూడా తమ అన్ని రకాల సేవలను దూకుడుగా అందిస్తున్నాయి. మా వరకు టాటా స్కై యొక్క కొత్త కనెక్షన్‌ను ఎంచుకోవడం అన్నిటికన్నా ఉత్మమం. అందరితో పోలిస్తే ఇది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్నది. మల్టీ టీవీ కనెక్షన్‌ను పొందాలని చూస్తున్నట్లయితే టాటా స్కైను ఎంచుకోకపోవడం ఉత్మమం. ఎందుకంటే ఇది ఎన్‌సిఎఫ్ ఛార్జీల పరంగా అత్యంత ఖరీదైనది.

Best Mobiles in India

English summary
Airtel Digital TV vs Tata Sky vs D2hand Dish TV: Which One is Best DTH Service Provider?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X