Home
News

Tata Sky అందిస్తున్న HD ఛానెల్‌లను చూస్తే ఆశ్చర్యపోతారు

భారతదేశంలో డిటిహెచ్ ఆపరేటర్లు అందరు హెచ్‌డి మరియు ఎస్‌డి ఛానెళ్లను తమ చందాదారులకు అందిస్తున్నారు. అయితే ఆపరేటర్లు అందించే HD లేదా హై డెఫినిషన్ ఛానెల్స్ ప్రస్తుతానికి చాలా వరకు పరిమితంగా SD ఛానెళ్లలో సగం కంటే తక్కువగా ఉన్నాయి. వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (VAS) అందించే విషయానికి వస్తే ఎయిర్‌టెల్ డిజిటల్ టివి అగ్రస్థానంలో ఉంది.

టాటా స్కై

టాటా స్కై ప్రస్తుతం దాని ప్లాట్‌ఫామ్‌లో తన వినియోగదారుల కోసం అధిక సంఖ్యలో HD ఛానెల్‌లను అందిస్తున్నది. హెచ్‌డి ఛానెల్‌ల విషయానికొస్తే ఇతర ఆపరేటర్ల కంటే ఎక్కువగా టాటా స్కై ప్రస్తుతం మొత్తంగా 91 HD ఛానెల్‌లని అందిస్తోంది. టాటా స్కై ప్రస్తుతం భారతదేశంలో డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్లలో మొదటి స్థానంలో ఉంది. ఇది వినియోగదారులకు ఎక్కువ ఎంపికలను ఇచ్చే కొత్త ఛానెళ్లను నిరంతరం జోడిస్తోంది.

టాటా స్కై HD ఛానెల్‌లు

టాటా స్కై HD ఛానెల్‌లు

టాటా స్కై ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి వాటిని ఓడించి ఛానల్ విభాగంలో అందరి కంటే ముందున్నది. ప్రస్తుతం టాటా స్కై 91 HD ఛానెల్‌లను మరియు 500 కి పైగా SD ఛానెల్‌లను అందిస్తోంది. SD మరియు HD ఛానెల్‌లతో పాటు టాటా స్కై కూడా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (VAS) ను అందిస్తోంది. ప్రస్తుతం 84 హెచ్‌డి ఛానెల్‌లు మరియు 525 SD ఛానెల్‌లను కలిగి ఉన్నందున ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. అయితే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మరియు ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ విషయానికి వస్తే ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ టాటా స్కైని ఓడించింది.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలో ఎయిర్‌టెల్ షార్ట్స్ టీవీ, మహాభారత్, గుడ్‌లైఫ్, ది హర్రర్ టీవీ, తెలుగు టాకీస్, స్పాట్‌లైట్, లెట్స్ డాన్స్, హాలీవుడ్ డైరీస్, మినిప్లెక్స్ మొదలైనవి ఉన్నాయి. టాటా స్కై యొక్క వాల్యూ యాడెడ్ సర్వీసెస్ విషయానికి వస్తే వాటిలో కొన్ని టాటా స్కై సీనియర్స్, టాటా స్కై ఇబాడాట్, టాటా స్కై ఆరాధన, టాటా స్కై తెలుగు సినిమా మరియు మొదలైనవి ఉన్నాయి. టాటా స్కై మొదటి పది రోజులు ఉచిత VAS సేవను కూడా అందిస్తుంది. ఆ తర్వాత వినియోగదారుల నుంచి ఛార్జీలను వసూలు చేయబడతాయి.

డిష్ టీవీ, డి 2 హెచ్ మరియు సన్ డైరెక్ట్ HD ఛానెల్‌లు

డిష్ టీవీ, డి 2 హెచ్ మరియు సన్ డైరెక్ట్ HD ఛానెల్‌లు

టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివిలతో పాటు మరో రెండు డిష్ టివి మరియు సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఆపరేటర్లు కూడా HD ఛానెల్‌లను అందిస్తున్నారు. ప్రస్తుతం డిష్ టీవీతన వినియోగదారులకు 64 హెచ్‌డి ఛానెల్‌లు మరియు 420 SD ఛానెల్‌లకు యాక్సిస్ ను అందిస్తున్నది. డిష్ టీవీ మాదిరిగానే D2h కూడా 64 HD ఛానెల్స్ మరియు 422 SD ఛానెల్‌లను అందిస్తున్నది. చివరగా సన్ డైరెక్ట్ 75 HD ఛానెళ్ళను అందిస్తూ మూడవ స్థానంలో ఉంది.

హెచ్‌డి ఛానెల్‌

ప్రస్తుతం తన ప్లాట్‌ఫామ్‌లో అందిస్తున్న మొత్తం హెచ్‌డి ఛానెల్‌ల సంఖ్యను పెంచాలని డిష్ టివి మరియు డి 2 హెచ్ యోచించడం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. డిష్ టివి మరియు సన్ డైరెక్ట్‌లకు టాటా స్కై లేదా ఎయిర్‌టెల్ డిజిటల్ టివి వంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ లు లేవు కాబట్టి వినియోగదారులు ఎక్కువగా స్టాండర్డ్ శాటిలైట్ టివి ఛానెళ్లపై ఆధారపడవలసి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Now provides 91 HD Channels
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X