Tata Sky క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందడానికి చిన్న చిట్కా

|

గత సంవత్సరం నేషనల్ టారిఫ్ ఆర్డర్ 1.0 అమలు చేసిన తరువాత డిటిహెచ్ మరియు కేబుల్ టివి ఆపరేటర్లు తమ దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లలో అదనపు చెల్లుబాటును తొలగించారు. దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లను తొలగించిన తరువాత ఆపరేటర్లు 'లాంగ్-టర్మ్ రీఛార్జెస్ (LTR)' అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చారు.

దీర్ఘకాలిక రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్

దీర్ఘకాలిక రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్

దీని యొక్క పేరుకు సూచించినట్లుగా వినియోగదారులు తమ ఛానెల్ ప్యాక్ లేదా అదే ఛానెల్‌లను సుదీర్ఘకాలం పొందవచ్చు. సర్వీసు ప్రొవైడర్లు ఈ దీర్ఘకాలిక రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ / ఉచిత సేవలను అందించడం ప్రారంభించారు. టాటా స్కై, డిష్ టివి, సన్ డైరెక్ట్ మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి వంటి నాలుగు డిటిహెచ్ ఆపరేటర్లు దాదాపు ఒకేలా LTR ఆఫర్లను కలిగి ఉన్నారు. టాటా స్కై యొక్క ఆఫర్ విషయానికి వస్తే దీనిని ‘టాటా స్కై క్యాష్‌బ్యాక్' ఆఫర్ అని పిలుస్తారు. దీనిలో భాగంగా వినియోగదారులు ఒక ఛానెల్ ప్యాక్‌ను 12 నెలల పాటు రీఛార్జ్ చేయడం ద్వారా 30 రోజుల అదనపు సేవను ఉచితంగా పొందవచ్చు.

 

 

1GB డేటాను రూ.20లకి పెంచే ఆలోచనలో Reliance Jio1GB డేటాను రూ.20లకి పెంచే ఆలోచనలో Reliance Jio

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్
 

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్

ట్రాయ్ యొక్క టారిఫ్ పాలన అమలులోకి రావడంతో వినియోగదారులు వారి స్వంత ప్రతి ఛానెల్‌ని ఎంచుకోవడానికి అనుమతి ఉంది. ప్రసారకులు మరియు డిటిహెచ్ ఆపరేటర్ల నుండి ముందే నిర్వచించబడిన అనేక ఛానల్ ప్యాక్‌లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది చందాదారులు అధిక ఖర్చులను ఆదా చేయడానికి వ్యక్తిగత ఛానెల్ ఎంపికను మాత్రమే ఎంచుకుంటున్నారు. టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్ వినియోగదారులను ఒక నెల ఛార్జీలకు సమానమైన మొత్తాన్ని క్యాష్‌బ్యాక్ రూపంలో పొందటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు మీ ఛానెల్ ప్యాక్‌కు నెలకు రూ.335 ఖర్చవుతుంది అనుకుంటే మీరు దీనిని 12 నెలలకు రీఛార్జ్ చేస్తే కనుక రీఛార్జ్ చేసిన 48 గంటల్లోనే రూ.335 క్యాష్‌బ్యాక్ మొత్తం మీ అకౌంట్ కు జమ అవుతుంది. వినియోగదారుడు సృష్టించిన ఏదైనా ఛానెల్ ప్యాక్‌తో ఈ ఆఫర్ పనిచేస్తుంది.

 

 

Realme 6, 6Pro కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!Realme 6, 6Pro కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!

టాటా స్కై ప్యాక్‌

టాటా స్కై ప్యాక్‌

టాటా స్కై ఒక సంవత్సరం ప్యాక్‌లను రీఛార్జ్ చేసిన తర్వాత ఛానెల్‌లను సవరించడానికి అనుమతించదని మీరు అనుకుంటే అది చాలా తప్పు. వినియోగదారులు తమ ఇష్టానుసారం ఛానెల్‌లను జోడించడానికి / వదలుకోవడానికి పూర్తి సౌలభ్యాన్ని కలిగి ఉన్నారని DTH ఆపరేటర్ తెలిపింది. ఇంకా వినియోగదారుడు టాటా స్కై పోర్టల్‌లో రీఛార్జ్ చేస్తే కంపెనీ రీఛార్జ్ చేసిన మొత్తానికి ఉచిత కూపన్‌లను కూడా అందిస్తుంది. మరియు ముఖ్యంగా ఈ ప్రక్రియ ప్రతి నెల మీ టాటా స్కై అకౌంట్ ను రీఛార్జ్ చేసే ఇబ్బందిని తొలగిస్తుంది.

 

 

టిక్‌టాక్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ టిక్‌టాక్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ "రెస్సో" మీరు ట్రై చేయండి!!!!

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఎలా పొందాలి?

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఎలా పొందాలి?

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను చాలా సులభంగా పొందవచ్చు. ప్రస్తుత టాటా స్కై యూజర్లు నెలవారీ రీఛార్జ్ విలువకు సమానమైన మొత్తాన్ని 12 రెట్ల ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకుంటే చాలు మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు రీఛార్జ్ చేసిన 48 గంటల తర్వాత ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని అందుకుంటారు. ప్రత్యామ్నాయంగా వినియోగదారులు టాటా స్కై యాప్ లేదా వెబ్‌సైట్‌లోని ‘రీఛార్జ్ నౌ' బటన్‌పై క్లిక్ చేసి కూడా మీ యొక్క అకౌంట్ ను రీఛార్జ్ చేయవచ్చు. టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కోసం సరైన రీఛార్జ్ మొత్తంతో ప్రాంప్ట్ చేయడం మరి మంచిది.

 

 

చిన్న పిల్లల ఆధార్ కార్డును పొందడం ఎలా?చిన్న పిల్లల ఆధార్ కార్డును పొందడం ఎలా?

టాటా స్కై తాత్కాలిక సస్పెన్షన్ ఫీచర్‌

టాటా స్కై తాత్కాలిక సస్పెన్షన్ ఫీచర్‌

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్ వినియోగదారులు ప్రస్తుతం టాటా స్కై అందిస్తున్న ప్రత్యేకమైన సేవను కూడా ఉపయోగించుకోవచ్చు. టాటా స్కై ఇప్పుడు తన చందాదారులను ఐదు రోజుల పాటు వారి అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేయడానికి అనుమతిస్తుంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ యూజర్లు కూడా ఈ ఆఫర్‌కు అర్హులు. ప్రస్తుత టాటా స్కై వినియోగదారులు తమ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయడానికి మొబైల్ యాప్ ద్వారా కూడా చేయవచ్చు లేదా ప్రత్యామ్నాయంగా వారు కస్టమర్ మద్దతు బృందానికి కాల్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Tata Sky Provide 30 Days Extra Service on Long-Term Recharge Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X