Tata Sky నుంచి ఊహించని ఆఫర్స్.... 12 ఛానెల్‌లు ఫ్రీగా
COVID-19 లాక్‌డౌన్ వ్యవధిలో తన 12 రకాల సేవలను వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నట్లు టాటా స్కై ప్రకటించింది. టాటా స్కై ఇప్పటికే ఫిట్‌నెస్ సర్వీస్ ఛానెల్‌ను ఒక నెల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.

కోవిడ్ -19 పరిస్థితిని పరిష్కరించడానికి టాటా సన్స్ సంస్థ 1000 కోట్ల రూపాయలకు కట్టుబడిందని తెలిపారు. టాటా ట్రస్ట్స్ ద్వారా దాని చైర్మన్ రతన్ టాటా 500 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇండియాలోని ప్రముఖ డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) సర్వీసులలో టాటా స్కై 600 పైగా ఛానెల్స్ అందిస్తున్నది. ఇది ఇప్పుడు 18 మిలియన్లకు పైగా వినియోగదారుల కనెక్షన్ లను కలిగి ఉంది.

టాటా స్కై యొక్క ఫ్రీ సర్వీసులు
COVID-19 లాక్‌డౌన్ సమయంలో టాటా స్కై డాన్స్ స్టూడియో, ఫన్ లెర్న్ ప్రీస్కూల్, ఫన్ లెర్న్ జూనియర్, కుకింగ్ మరియు క్లాస్ రూమ్ వంటి ఛానెళ్లను ఆఫర్‌లో భాగంగా ఉచితంగా అందిస్తున్నది. అదనంగా కంపెనీ ఫిట్‌నెస్, స్మార్ట్ మేనేజర్, జావేద్ అక్తర్, బ్యూటీ, వేద గణిత ఛానెళ్లను హిందీ, ఇంగ్లీషు, భాషలతో పాటు తెలుగులో కూడా అందిస్తోంది.

టాటా స్కై సేవలు
ఈ రోజు నుంచి టాటా స్కై చందాదారులందరికీ 12-14 రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నాము అని టాటా స్కై సిఇఒ హరిత్ నాగ్‌పాల్ ట్విట్టర్‌లో తెలిపారు. బ్యూటీ, డాన్స్ స్టూడియో మరియు ఫన్ లెర్న్‌తో సహా పైన పేర్కొన్న మెజారిటీ టాటా స్కై సేవలు నెలకు రూ.59 వద్ద లభిస్తాయి. టాటా స్కై కుకింగ్ ఛానల్ వినియోగదారులకు నెలకు రూ.60 వద్ద లభిస్తుంది. కోర్సు వ్యవధి 91 రోజులు కావడంతో వేద గణిత సభ్యత్వం రోజుకు రూ.10 చొప్పున వినియోగదారులకు అందుబాటులో ఉంది.

టాటా స్కై COVID-19 ప్లాన్ లు
టాటా స్కై ప్రారంభంలో టాటా స్కై ఫిట్‌నెస్ సర్వీస్ ఛానెల్‌ను ఉచితంగా అందించింది. ఇప్పుడు ప్రస్తుత సమయంలో రీఛార్జ్ అయిపోతున్న చందాదారులకు వారి యొక్క అకౌంటులో మరొక ఏడు రోజులపాటు క్రెడిట్‌ను కూడా ఇచ్చింది. COVID-19 లాక్డౌన్ కారణంగా వారి అకౌంటులను రీఛార్జ్ చేయలేని చందాదారుల కోసం దీనిని ప్రవేశపెట్టారు. దీనిని పొందడానికి ఆసక్తిగల చందాదారులు 080-61999922 కు మిస్డ్ కాల్ ఇవ్వవలసి ఉంటుంది. టాటా స్కై వినియోగదారులకు ఏడు రోజుల క్రెడిట్‌ను అందిస్తుంది మరియు మిగిలిన మొత్తాన్ని ఎనిమిదవ రోజున తీసివేయబడుతుంది.

టాటా స్కై ఫిట్‌నెస్ ఆఫర్
ఫిట్ ఇండియా మరియు టాటా స్కై మధ్య సంయుక్త చొరవలో భాగంగా టాటా స్కై ఫిట్‌నెస్ ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. బాలీవుడ్ తారలు అలియా, కత్రినా, హృతిక్, షాహిద్, కరీనాకు శిక్షణ ఇచ్చిన వారి నుండి నిపుణుల మార్గదర్శకత్వం ఈ సేవ అందిస్తుందని చెప్పబడింది. టాటా స్కై ఫిట్‌నెస్ ఆఫర్ ఏప్రిల్ 24 వరకు చెల్లుతుంది.


Click it and Unblock the Notifications








