Tata Sky Broadband ల్యాండ్‌లైన్ సర్వీస్... అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు

|

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ద్వారా తన వినియోగదారులకు మరొక కొత్త సేవలను ఫ్రీగా అందిస్తున్నట్లు వెబ్‌సైట్‌లో టీజ్ చేసింది. టాటా స్కై తన వినియోగదారుల కోసం త్వరలో ల్యాండ్‌లైన్ సేవలను ప్రారంభించనున్నది. కంపెనీ యొక్క వెబ్‌సైట్ ప్రకారం టాటా స్కై యొక్క రాబోయే ల్యాండ్‌లైన్ సర్వీస్ దాని బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఉచితంగా అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది.

 

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్

టాటా స్కై లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 2015 లో స్థాపించబడింది. ఇప్పుడు దీని యొక్క సేవలు భారతదేశంలోని 20 నగరాలు మరియు పట్టణాల్లో అందించబడుతోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్, బిఎస్‌ఎన్‌ఎల్ మరియు రిలయన్స్ జియోఫైబర్ వంటి బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్లు ఇప్పటికే తమ చందాదారులకు ఉచితంగా ల్యాండ్‌లైన్ సేవలను అందిస్తున్నారు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క ల్యాండ్‌లైన్ సర్వీస్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క ల్యాండ్‌లైన్ సర్వీస్

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రస్తుతం వరుసగా 25 Mbps , 50 Mbps మరియు 100 Mbps వేగంతో మూడు అపరిమిత ప్లాన్‌లను అందిస్తోంది. వీటి యొక్క ధరలు వరుసగా రూ.900, రూ.1000 మరియు 1100రూపాయలుగా ఉన్నాయి. 60GB డేటా పరిమితితో బేస్ ప్లాన్ రూ .650 ధరతో కంపెనీ అనేక స్థిరమైన డేటా ప్లాన్‌లను అందిస్తుంది. బేస్ ప్లాన్ 25 Mbps స్పీడ్ తో డేటాను అందిస్తుండగా కంపెనీ నెలకు రూ .1000 ధరతో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క టాప్ టైర్ లిమిటెడ్ డేటా ప్లాన్ ను 100 Mbps వేగంతో 500GB వరకు డేటాను అందిస్తుంది.

బ్రాడ్‌బ్యాండ్
 

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క ల్యాండ్‌లైన్ సర్వీస్ ఈ విభాగంలో కంపెనీ యొక్క అదృష్టాన్ని మార్చగలదా లేదా అనేది చూడాలి. రిలయన్స్ జియో మరియు ఎయిర్‌టెల్‌తో సహా ఇతర సంస్థల ప్రత్యర్థులు వారి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లతో అపరిమిత కాలింగ్ సదుపాయాలను అందిస్తున్నారు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌లైన్ ధర మరియు లభ్యత

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌లైన్ ధర మరియు లభ్యత

ప్రస్తుతానికి టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్ ఎప్పుడు ప్రారంభించబడుతుంది మరియు వాటి కనెక్షన్ కోసం ఏదైనా అదనపు ఛార్జీలు ఉంటాయా అన్న దాని మీద ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. టాటా స్కై యొక్క అపరిమిత ప్రణాళికల్లో ఉన్నవారికి ఈ సర్వీస్ ఉచితంగా అందించబడుతుందని సూచించే "స్ట్రీమ్ అన్‌లిమిటెడ్, కాల్ అన్‌లిమిటెడ్" అనే కీలక పదాలతో కంపెనీ ల్యాండ్‌లైన్ సేవ కోసం ఒక టీజర్ ను విడుదల చేసింది.

వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ విభాగం ప్రొవైడర్లు

వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ విభాగం ప్రొవైడర్లు

టాటా స్కై సంస్థ తన DTH సేవలకు భిన్నంగా టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో ఒకే విధమైన ఆధిపత్యాన్ని పొందడం లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్కెట్ డేటా ప్రకారం ముగిసిన డిసెంబర్ 2019 కాలానికి టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ మొదటి ఐదు సర్వీసు ప్రొవైడర్ జాబితాలో కూడా చోటు దక్కించుకోలేదు.

బ్రాడ్‌బ్యాండ్

బ్రాడ్‌బ్యాండ్ రంగంలో బిఎస్‌ఎన్‌ఎల్ 8.39 మిలియన్ల మంది సభ్యులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానంలో ఎయిర్‌టెల్ 2.42 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉంది. అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (ACT) ఫైబర్ నెట్ 1.52 మిలియన్ల మంది సభ్యులతో మూడవ స్థానంలో ఉండగా, హాత్వే 0.90 మిలియన్లతో, రిలయన్స్ జియో 0.86 మిలియన్లతో మొదటి ఐదు జాబితాలో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Tata Sky Broadband Service Offers Landline Unlimited Free Calling

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X