Home
News

Tata Sky STB ల ధరల మీద రూ.400 వరకు తగ్గింపు!! ఛాన్స్ మిస్ అవ్వకండి...

ఇండియాలోని ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై ఇప్పుడు తన అన్ని రకాల ఎస్‌టిబిల మీద రూ.400 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందులో గరిష్టంగా + హెచ్‌డి ఎస్‌టిబి తగ్గింపును అందుకుంటోంది. టాటా స్కై ప్రస్తుతం SD, HD, బింగే +, + HD PVR మరియు టాటా స్కై 4K వంటి ఐదు సెట్-టాప్ బాక్స్‌లను కలిగి ఉంది. ఈ STBల ధరలు రూ .1,499 నుండి ప్రారంభమై రూ.6,400 వరకు ఉన్నాయి.

టాటా స్కై

టాటా స్కై తమ యొక్క STBల మీద చివరిసారిగా ధర తగ్గింపును 2019 డిసెంబర్‌లో అందించింది. మార్కెట్ వాటాను పెంచడానికి సహాయపడే బింగే + సెట్-టాప్ బాక్స్ మీద డిస్కౌంట్ పొందిన తరువాత ఇప్పుడు రూ.2,999 ధర వద్ద లభిస్తుంది. STB లపై తగ్గింపు వివరాలను సంస్థ యొక్క వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ ఆఫర్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే + తగ్గింపు వివరాలు

టాటా స్కై బింగే + తగ్గింపు వివరాలు

సాధారణంగా రూ.2,999 ధర వద్ద ఆరు నెలల చెల్లుబాటుతో బింగే సర్వీసును ఉచితంగా అందించే డిటిహెచ్ ఆపరేటర్ యొక్క ఉత్తమ హైబ్రిడ్ STB బింగే + ప్రస్తుతం మార్కెట్లో తిరుగులేని ఎంపికగా ఉంది. అయితే టాటా స్కై తన బింగే + పై ఇప్పుడు రూ.200 వరకు తగ్గింపును అందిస్తూ ఆఫర్‌ను మరింత మెరుగ్గా చేస్తోంది. వినియోగదారులు ‘TSKY200' డిస్కౌంట్ కోడ్ ఉపయోగించి బింగే + STB ని రూ.2,799 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటుగా వినియోగదారులు రూ.300 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీల మీద మరో 10% క్యాష్‌బ్యాక్ రూ.50 వరకు లభిస్తుంది. పేజాప్ ద్వారా రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేసిన వారికి రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్‌ మీద తగ్గింపు వివరాలు

టాటా స్కై HD సెట్-టాప్ బాక్స్‌ మీద తగ్గింపు వివరాలు

టాటా స్కై హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కేవలం రూ.1,349 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా ఈ హెచ్‌డి STB రూ.1,599 ధర వద్ద లభించేది. అయితే కంపెనీ వెబ్‌సైట్‌లో రూ .100 తగ్గింపు వర్తించిన తరువాత దీని ధర రూ.1,499 వద్ద ఉంది. ప్రస్తుత డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డి STB ని ‘TSKY150' కోడ్‌ను ఉపయోగించి రూ.1,349 ధర వద్ద పొందవచ్చు. ఈ కూపన్ క్రొత్త కనెక్షన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మోబిక్విక్ మరియు పేజాప్ ఆఫర్లు కూడా HD STB లో వర్తిస్తాయి.

టాటా స్కై + HD సెట్-టాప్ బాక్స్‌ మీద తగ్గింపు వివరాలు

టాటా స్కై + HD సెట్-టాప్ బాక్స్‌ మీద తగ్గింపు వివరాలు

చివరగా టాటా స్కై యొక్క + HD సెట్-టాప్ బాక్స్ మీద రూ.400 వరకు తగ్గింపు లభిస్తుంది. సాధారణంగారూ.4,999 రిటైల్ ధర వద్ద లభించే ఈ STB ‘TSKY 400' కూపన్ కోడ్‌ సాయంతో రూ.4,599 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే టాటా స్కై 4K సెట్-టాప్ బాక్స్‌కు ఎటువంటి డిస్కౌంట్ లభించడం లేదు కావున దీనిని రూ.6,400 ధర వద్దనే పొందవచ్చు. మొబిక్విక్ మరియు పేజాప్ ఆఫర్లు + HD STB లో కూడా వర్తిస్తాయి.

Best Mobiles in India

English summary
Tata Sky Set-Top Boxes Price Slashed Up to Rs.400
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X