ఇస్రోతో చేతులు కలిపిన తెలంగాణా రాష్ట్రం

Written By:

పరిపాలనలో టెక్నాలజీ పాత్ర పెంచడంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.ఇందులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో)తో తెలంగాణ సర్కారు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాదులో నేటి ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్ కమార్ ల సమక్షంలో ఇరు వర్గాలకు చెందిన అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరేం చేస్తున్నారో చూడండి

ఇస్రోతో చేతులు కలిపిన తెలంగాణా రాష్ట్రం

ఈ ఒప్పంద ప్రకారం... ఇకపై సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయక్టటు, కాల్వలకు సంబందించిన సమగ్ర సమాచారం కోసం డ్రోన్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ఈ తరహా వివరాల కోసం ఇస్రో సహకారం తీసుకుంటున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. జలాశయాల్లోని నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఒప్పందంలో భాగంగా జరిగే కార్యక్రమాలు మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో జరగనున్నాయి.

ఇస్రో మరో రికార్డు : ఒకేసారి 22 ఉపగగ్రహాలు నింగిలోకి

ఇస్రోతో చేతులు కలిపిన తెలంగాణా రాష్ట్రం

సరిగా తన కాళ్లపై తాను నిలబడలేని రోజుల్లో, 1960లలో భారత్‌ ఖగోళం వైపు కన్నెత్తి చూడటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పురాతన పనిముట్లతోనే పరిశ్రమలు బండి లాగిస్తున్న రోజుల్లో అందమైన చందమామను అందుకోవడం గురించి కలలు కనడంపై పెదవి విరిచారు. కానీ, అవేవీ బుడి బుడి అడుగులను అడ్డుకోలేక పోయాయి. నెహ్రూ, హోమీ బాబా, విక్రంసారాభాయ్‌ త్రయం కలల పునాదులపై ప్రారంభమైన ఆ అడుగులు ఒక్కో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు పడుతున్నాయి...పడుతూనే ఉంటాయి.. అలాంటి వెన్నెల వెలుగు ఇస్రో గురించి మనం తెలుసుకోవాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెన్నెల వెలుగు ఇస్రో

1969లో సరిగ్గా ఇండిపెండెన్స్ డే రోజున ఇస్రో పురుడుపోసుకుంది. దీనికి పురుడుపోసిన వారు విక్రం సారాభాయి

వెన్నెల వెలుగు ఇస్రో

 SLV-3 మొట్టమొదటి ఇండియా స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం. దీన్ని దివంగత మాజీ రాష్ర్టపతి ఎపిజె అబ్దుల్ కలాం సారధ్యంలో ప్రయోగించారు. కలాం ప్రాజెక్ట్ డైరక్టర్ గా ఉన్నారు.

వెన్నెల వెలుగు ఇస్రో

గత నలభై సంవత్సరాల్లో ఇస్రో పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా.. అది కేవలం నాసా ఒక్క సంవత్సరంలో ఖర్చుపెట్టిన దాంట్లో సగానికి సమానం.

వెన్నెల వెలుగు ఇస్రో

భువన్ ను ఇస్రో డెవలప్ చేస్తోంది. ఇది వెబ్ బేస్ డ్ 3డీ శాటిలైట్ పరికరం. ఇది ఇండియా ఇన్ కార్నియేషన్ ను గూగుల్ ఎర్త్ లో చూపిస్తుంది.

వెన్నెల వెలుగు ఇస్రో

ఇస్రోకి ఇండియాలో మొత్తం 13 చోట్ల కేంద్రాలు ఉన్నాయి.

వెన్నెల వెలుగు ఇస్రో

ఇస్రో నుంచి మీరు శాటిలైట్ డాటాను కొనుక్కోవచ్చు

వెన్నెల వెలుగు ఇస్రో

ఇస్రో మార్ష్ మిషన్ అత్యంత తక్కువ ఖర్చుతో నింగిలోకి దూసుకెళ్లింది. దీనికయిన ఖర్చు కేవలం రూ. 450 కోట్లు. అంటే ప్రతి కిలోమీటరకు 12 రూపాయలు

వెన్నెల వెలుగు ఇస్రో

తొలి ప్రయత్నంలోనే మార్స్ మీదకు విజయవంతంగా చేరగలిగిన దేశాల్లో ఇండియానే ప్రధమస్థానం ఆక్రమించింది.

వెన్నెల వెలుగు ఇస్రో

అత్యధిక మంది బ్యాచ్‌లర్స్ ఉన్న సైంటిస్ట్ కేంద్రాలలో ఇస్రోనే ముందుంది.

వెన్నెల వెలుగు ఇస్రో

ఫన్ పాక్ట్ : ఇది ఇస్రోకి పాత బంధువు

వెన్నెల వెలుగు ఇస్రో

1981లో ఆపిల్ శాటిలైట్ ట్రాన్స్ పోర్ట్ ఇలా జరిగింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Telangana government to sign pact with ISRO today
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot