టెల్కోలను ఘోరంగా దెబ్బ కొట్టిన జియో

Written By:
రిలయన్స్‌ జియో ఉచిత సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20 శాతంమేర ఆదాయాన్ని కోల్పోయిందని ఇండియా రేటింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌-రా) పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18) టెలికాం రంగ ఔట్‌లుక్‌ను నిలకడ (స్టేబుల్‌) నుంచి ప్రతికూలానికి జియో మార్చింది.ఇదిలా ఉంటే మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల జనవరి నెలలో భారీగా పెరిగిందని టెలికం పరిశ్రమ సమాఖ్య సీవోఏఐ పేర్కొంది.
టెల్కోలను ఘోరంగా దెబ్బ కొట్టిన జియో
జనవరిలో 51.1 లక్షలు మేర పెరిగారని పేర్కొంది. దేశంలోని మొత్తం జీఎస్‌ఎం సబ్‌స్రైబర్ల సంఖ్య జనవరిలో 81.51 కోట్లకు చేరిందని పేర్కొంది. దీనికి రిలయన్స్‌ జియో యూజర్లు అదనం. ఎయిర్‌టెల్‌ యూజర్ల సంఖ్య 35.5 లక్షల పెరుగుదలతో 26.94 కోట్లకు చేరింది. 2016 డిసెంబర్‌ 31కి జియో యూజర్ల సంఖ్య 7.24 కోట్లు.

రిలయన్స్ జియో మనీ వ్యాలెట్‌ని జియో చాట్‌కి కనెక్ట్ చేసి యూజర్లు డబ్బులు పంపించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో మనీ అకౌంట్ లోకి

మీరు ముందుగా జియో మనీ అకౌంట్ లోకి వెళితే అక్కడ పేమెంట్స్ విభాగం ఉంటుంది. ఆ విభాగంలో మోర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి లింక్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఓ ఓటీపీ వస్తుంది. అది రాగానే మీ జియో మనీకి అకౌంట్ జియో చాట్ తో కనెక్ట్ అవుతుంది.

జియో చాట్ ద్వారా..

ఇప్పుడు మనీ ఎలా పంపాలంటే జియో చాట్ ద్వారా ఇతరులతో చాట్ చేసే సమయంలో ఆ చాట్ లో మీకు రూపీ అనే ఐకాన్ గుర్తు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అవతలి వారికి మనీ పంపుకోవచ్చు.

మీ వ్యాలెట్ లో తగినంత బ్యాలన్స్

అయితే మీ వ్యాలెట్ లో తగినంత బ్యాలన్స్ ఉండాలి. అంటే మీరు ఎంత పంపాలనుకుంటున్నారో అంత బ్యాలన్స్ ఉంటేనే అది అవతలి వారికి చేరుతుంది.

జియో మనీ సర్వీస్ వాడుతున్న వారు మాత్రమే

దీంతో పాటు జియో మనీ సర్వీస్ వాడుతున్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీరు మనీ పంపాలంటే అవతలి వారికి కూడా జియో చాట్ ఉండాలి.

గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్

ఇప్పటికే చాలామంది జియో సిమ్‌లు వాడుతున్న నేపథ్యంలో అందరూ జియో చాట్ డౌన్‌లోడ్ చేసుకుని ఉంటారు. లేకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని జియో సర్వీసుని ఆస్వాదించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Telecom industry lost 20 per cent revenue due to Jio giveaways: Ind-Ra read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot