శాంసంగ్‌కు కోలుకోలేని దెబ్బ

Written By:

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ చీఫ్ లీని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గ్యూన్-హైని అభిశంసన చేయడానికి కారణమైన అవినీతి కుంభకోణంలో పాత్ర ఉందన్న ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. సియోల్‌లోని డిటెన్షన్ సెంటర్‌లో ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా వన్‌ప్లస్ 3టీ

శాంసంగ్‌కు కోలుకోలేని దెబ్బ

ఆయనపై కోర్టులో రోజంతా సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే ఆ విచారణ మొత్తం రహస్యంగానే సాగింది. కంపెనీలో రెండు ప్రధాన విభాగాలను కలిపేసి, తన తండ్రి లీ కున్ హీ నుంచి పగ్గాలు తీసుకోడానికి ప్రభుత్వ మద్దతు కూడా తీసుకున్నారన్నది జే లీపై ప్రధాన ఆరోపణ.

రిలయన్స్ జియో దుమ్మురేపింది

శాంసంగ్‌కు కోలుకోలేని దెబ్బ

ఇందులో భారీ మొత్తంలో చేతులు మారాయని అంటున్నారు.లీ అరెస్టుతో శాంసంగ్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. జే లీ అరెస్టుపై కోర్టులో సవాలు చేస్తారా.. బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారా లేదా అనే విషయాలపై ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదని శాంసంగ్ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

రిలయన్స్ జియోకి భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్

శాంసంగ్‌కు కోలుకోలేని దెబ్బ

గత నెలలో ప్రాసిక్యూటర్లు ఇదే కోర్టులో జే లీ అరెస్టు కోసం దరఖాస్తు చేయగా, దాన్ని కోర్టు తిరస్కరించింది. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, లంచాలు ఇవ్వలేదని శాంసంగ్ సంస్థతో పాటు జే లీ కూడా అంటున్నారు. మరి కోర్టులోనే నిజాలు తేలాల్సి ఉంది.

English summary
Samsung Group Chief Jay Y. Lee Arrested in Corruption Probe read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot