కార్పొరేట్ మహిళా‘మణులు’

Posted By:
  X

  అవనిలో సగం.. ఆకాశంలో సగం..అంతరిక్షంలో ఘనం ఇవన్ని మహిళల గొప్పదనాన్ని తెలిపే మాటలు. తగిన అవకాశాలు కల్పిస్తే మగవారితో సమానంగా అన్ని రంగాల్లో పోటీపగలమని చాలకాలం క్రితమే మన భారతీయ మహిళలు రజువు చేశారు. ఆలోచనాత్మకంగా వ్యవహరించి సమస్యను నిశితంగా శోధించి పరిష్కార మార్గాలను కనుగొనటంలో మహిళలు ఎప్పుడూ ముందుంటారు.

  ఇంకా చదవండి:

  తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

  మీ పాత ఐఫోన్‌ను విక్రయించేందుకు 7 బెస్ట్ వెబ్‌సైట్‌లు

  ఆధునిక యుగంలో నేటి తరం మహిళామణులు కార్యనిర్వహణాధికార పదువులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నపలువురు మహిళా సీఈఓలు జాతీయ, అంతర్జాతీయ విభాగాల్లో అత్యుత్తమ పురస్కారాలను అందుకోవటం మనం చూస్తున్నాం. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ వాణిజ్య విభాగంలో దిగ్గజ హోదాలో కొనసాగుతున్న 9 మంది మహిళామణులను మీకు పరిచయం చేస్తున్నాం....

  భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  పద్మశ్రీ వారియర్ (Padmasree Warrior):

  ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన సిస్కో సిస్టమ్స్కు పద్మశ్రీ వారియర్ చీఫ్ టెక్నాలజీ ఇంకా స్ట్రాటజి అధికారిగా సేవలందిస్తున్నారు. ఈమె గతంలో మోటరోలా సంస్థకు సీటీవోగా వ్యవహరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో పుట్టిపెరిగిన పద్మశ్రీ ఢిల్లీ ఐఐటి నుంచి 1982లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. అమెరికాలో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన తరువాత 1984లో మోటరోలాతో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. పలు అవార్డులను ఈమె అందుకున్నారు.

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  రోషిణి నాడార్ (Roshni Nadar):

  హెచ్‌సీఎల్ సంస్థలకు వ్యవస్థాపకులైన షివ్ నాడార్ కూమార్తె అయిన రోషణి నాడర్ హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంకా సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  కీర్తిగా రెడ్డి (Kirthiga Reddy):

  కీర్తిగారెడ్డి ఫేస్‌బుక్ ఇండియా ఆన్‌లైన్ ఆపరేషన్‌లకు సంబంధించి ముఖ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఈమె గతంలో ఫోనెక్స్ టెక్నాలజీస్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  నీలం ధావన్ (Neelam Dhawan):

  ప్రముఖ టెక్ సంస్థల్లో ఒకటైన హెవ్లెట్ - ప్యాకర్డ్ (హెచ్‌పి) ఇండియాకు నీలం ధావన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె గతంలో అంటే 2005 నుంచి 2008 వరకు మైక్రోసాఫ్ట్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు.

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  అరుణా జయంతీ (Aruna Jayanthi):

  కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ ఇంకా టెక్నాలజీ సర్వీసులనందించే కాప్జెమిని ఇండియా (Capgemini India)కు అరుణా జయంతీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  దిబ్జాని ఘోష్ (Debjani Ghosh):

  ఈమె ఇంటెల్ దక్షిణ ఆసియా మార్కెటింగ్ గ్రూప్‌‍కు సంబంధించి సేల్స్ ఇంకా మార్కెటింగ్ విభాగాలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  రేఖా ఎం. మీనన్ (Rekha M. Menon):

  ఈమె యాక్సెంచర్ ఇండియాలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

   

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  రూపా కుడ్వ (Roopa Kudva):

  ఈమె CRISIL సంస్తలకు సీఈవో ఇంకా మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

  కార్పొరేట్ మహిళా‘మణులు’

  వనితా నారాయణన్ (Vanitha Narayanan):

  ఐబీఎమ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను వనితా నారాయణన్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బాంగ్లాదేశ్, నేపాల్, శీలంకలకు గాను ఐబీఎమ్ ప్రాంతీయ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more