సెల్‌ఫోన్ లేని ఊరు
స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే క్షణమొక యుగంలా గడపాల్సిన పరిస్థితి. టెక్నాలజీతా అంతతా మమేకమవుతోన్న ఈ రోజుల్లో, ఓ ఊరి ప్రజలు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకుండా ఆనందంగా జీవిస్తుందన్నవిషయం మీకు తెలుసా..?
Read More: విమానం నుంచి జారిపడ్డ ఫోన్ దొరికింది
వెస్ట్ వర్జీనియాలో గ్రీన్ బ్యాంక్ అనే పట్టణం ఉంది. 13,000 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉన్న ఈ పట్టణం 1958లో ఏర్పడింది. యూఎస్ నేషనల్ రేడియో క్వైట్ జోన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో మైక్రోవేవ్ ఓవెన్, సెల్‌ఫోన్, వై-ఫై వంటి సేవలను వినియోగించుకోకూడదన్న నిషేధం అమల్లో ఉంది. ఇక్కడ నివసించే ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోమంటూ అగ్రిమెంట్ పై సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీకి దూరంగా ఉంటున్న ఇక్కడి స్థానికులు ఆనందంగా తమ కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్నారు.
Read More: ఇక స్మార్ట్‌ఫోన్లు గోవిందా... గోవిందా..

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
బోలెడంత ఒత్తిడి నుంచి బయపడినట్లే

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
రకరకాల యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలన్న ఆలోచనే మనకు రాదు.

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
గంటల తరబడి ఆన్‌లైన్‌లో గడపాల్సిన అవసరమే ఉండదు

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి చాటింగ్ వెబ్‌సైట్‌లలో కబుర్లు చెప్పుకోవల్సిన అవసరమే ఉండదు.

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
మాట్లాడుకునేందుకు, సందేశాలు పంపుకునేందుకు వీలున్న ఫీచర్ ఫోన్‌లను చూసి తెగ మురిసిపోతాం.

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
రకరకాల లావాదేవీలతో సతమతమవుతూ గజిబిజి గందరగోళ జీవితాన్నిఅనుభవించాల్సిన అవసరమే ఉండదు

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
కెమెరాను ఒక విలువైన వస్తువుగా చూడటం మొదలు పెడతాం.

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
బోలేడంత డబ్బు ఆదా అవుతుంది.

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
చీటికి మాటికి డబ్బులను వెచ్చించి కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలన్న ఆలోచనే రాదు.

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?
స్మార్ట్‌ఫోన్ అనేదే లేకపోయినట్లయితే మనిషి జీవితం చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








