Signal App లో యూజర్లు మిస్ అవుతున్న వాట్సాప్ ఫీచర్లు ఇవే....

|

వాట్సాప్ కొత్తగా ప్రైవసీ విధానాన్ని ప్రకటించిన తరువాత చాలా మంది వినియోగదారులు దీనికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవడం ప్రారంబించారు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ మరియు సిగ్నల్ యాప్ లకు ఊహించని విధంగా ఆకస్మిక ఆదరణ లభించింది. ఇప్పటికే ఈ రెండు యాప్ లు ఇప్పుడు లేని విధానంగా అధికంగా డౌన్ లోడ్లను అందుకున్నాయి. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు గోప్యత దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు వాట్సాప్‌లోని అన్ని రకాల ఫీచర్లను వినియోగించిన వినియోగదారులకు మిగిలిన రెండు ప్లాట్‌ఫారమ్‌లలో వాటిని మిస్ అవ్వవచ్చు. సిగ్నల్‌లో లేని వాట్సాప్ ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

చాట్‌లో మెసేజ్లను స్టార్ చేయండి

చాట్‌లో మెసేజ్లను స్టార్ చేయండి

వాట్సాప్ యూజర్లు తమకు కావలసిన మెసేజ్ ను చాట్‌లో స్టార్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది నిర్దిష్ట మెసేజ్ లను బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే ఈ ఫీచర్ సిగ్నల్‌ యాప్ లో అందుబాటులో లేదు.

ఇతరులను జోడించడానికి QR కోడ్‌లను షేర్ చేయడం

ఇతరులను జోడించడానికి QR కోడ్‌లను షేర్ చేయడం

వాట్సాప్ యొక్క ఫీచర్లలో ఒకటైన వ్యక్తిగత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కొత్త కాంటాక్ట్ నెంబర్ ను జోడించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ QR కోడ్‌లు వాట్సాప్‌లోని సెట్టింగుల క్రింద యూజర్ పేరు పక్కన కనిపిస్తాయి. కానీ సిగ్నల్‌ యాప్ లో ఈ ఫీచర్ కూడా అందుబాటులో లేదు.

Status updates ఫీచర్
 

Status updates ఫీచర్

సిగ్నల్ యాప్ లో అందుబాటులో లేని మరో వాట్సాప్ యొక్క ఫీచర్ స్టేటస్ అప్ డేట్. ఈ ఫీచర్ వాట్సాప్ లో 24 గంటల తర్వాత ఆటొమ్యాటిక్ గా అదృశ్యమయ్యే టెక్స్ట్, ఫోటో, వీడియో మరియు GIFలను షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఫేస్బుక్ యాజమాన్యంలోని ఈ యాప్ వినియోగదారులు తమ వాట్సాప్ స్టేటస్ అప్ డేట్ లను ఫేస్బుక్ స్టోరీస్ మరియు ఇతర యాప్ లతో పంచుకునేందుకు కూడా అనుమతిస్తుంది. ఈ అప్ డేట్ లను ఎవరు చూడగలరు మరియు చూడలేరు అని వినియోగదారులు ఎంచుకోవచ్చు.

Customised wallpapers ఫీచర్స్

Customised wallpapers ఫీచర్స్

వాట్సాప్ ఇటీవల కస్టమ్ వాల్‌పేపర్స్ ఫీచర్‌ను తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. ఇది వేర్వేరు చాట్‌ల కోసం వేర్వేరు వాల్‌పేపర్‌ను సెట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ సిగ్నల్‌లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

WhatsApp Payment సర్వీస్ ఫీచర్

WhatsApp Payment సర్వీస్ ఫీచర్

వాట్సాప్ పేమెంట్ ఫీచర్ గత ఏడాది చివరి నుండి అందుబాటులోకి వచ్చింది. ఇది వాట్సాప్ వినియోగదారులను పీర్-టు-పీర్ పేమెంట్ లను చెల్లించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వాట్సాప్‌లో డబ్బును ఇతరులకు పంపించడానికి మరియు స్వీకరించడానికి వినియోగదారులు బ్యాంక్ అకౌంటును జోడించవచ్చు.

Group calling ఫీచర్

Group calling ఫీచర్

వాట్సాప్‌లో వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో గ్రూప్ కాలింగ్ ఫీచర్. ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే సారి కాల్ చేయడానికి అనుమతించే ఈ ఫీచర్ ఇప్పటికీ సిగ్నల్‌లో ఇంకా పరీక్ష దశలో ఉండడం గమనార్హం.

Live location sharing ఫీచర్

Live location sharing ఫీచర్

యాప్ ద్వారా లొకేషన్ లను షేర్ చేయడానికి సిగ్నల్ యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే వినియోగదారుల యొక్క లైవ్ లొకేషన్ ను మరొకరికి షేర్ చేయడానికి అనుమతించదు. వాట్సాప్‌లోని ఈ ఫీచర్ అధికంగా ఎక్కువ దూరం ప్రయాణం చేసే వినియోగదారులు తమ యొక్క లైవ్ లొకేషన్ ను నిర్దిష్ట సమయం వరకు తమకు నచ్చిన వారితో పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.

Best Mobiles in India

English summary
These are The WhatsApp Features That Users Miss in The Signal App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X