టాప్ - 10 ‘3జీ డేటా ప్లాన్స్’

Posted By:

దేశంలో 4జీ నెట్‌వర్క్ విస్తరిస్తుండటంతో ప్రముఖ టెలికాం కంపెనీలు 3జీ డేటా‌ప్లాన్‌లకు సంబంధించిన ధరలను తగ్గించాయి. ఎయిర్‌టెల్, ఐడియా, టాటా డొకొమో, ఎయిర్‌సెల్, రిలయన్స్, వొడాఫోన్ వంటి ప్రముఖ ఆపరేటర్లు 3జీ ధరలను తగ్గించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. 3జీ కనెక్టువిటీ సేవలను ఉపయోగించకోవటం ద్వారా మీ పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ నుంచి వేగంతమైన ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన డేటా‌ప్లాన్‌లకు సంబంధించిన వివరాలను స్లైడ్‌షో రూపంలో క్లుప్తంగా మీకు అందిస్తున్నాం.

‘విప్రో'ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ - 10 ‘3జీ డేటా ప్లాన్స్’

వొడాఫోన్ (పే యాజ్ యూ గో), vodafone (pay as you go):

వొడాఫోన్, ‘పే యాజ్ యూ గో' పేరుతో బృహత్తరమైన 3జీ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా వొడాఫోన్ వినియోగదారు రూ.102 చెల్లించి 300ఎంబి 3జీ డేటాను ఒకనెల వాలిడిటీతో ఉపయోగించుకోవచ్చు. రూ.251 చెల్లించి 1జీబి డేటాను, రూ.451 చెల్లించి 2జీబి డేటాను ఒక నెల వాలిడిటీతో వాడుకోవచ్చు. ఇదే ప్లాన్‌లో భాగంగా రూ.850 చెల్లించి 3జీబి డేటాను రెండు నెలల వాలిడిటీతో ఉపయోగించుకోవచ్చు. వొడాఫోన్ ఆఫర్ చేస్తున్న ఈ ప్లాన్ ఇతర ఆపరేటర్‌లతో పోలిస్తే మరింత చవకగా ఉంది.

టాప్ - 10 ‘3జీ డేటా ప్లాన్స్’

రిలయన్స్ - మై బెస్ట్ ప్లాన్ (Reliance - My Best Plan):

ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ 3జీ వేగంతో కూడిన 6జీబి డేటాను నెల రోజుల వాలిడిటీతో ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ 6జీబి డేటాను 30 రోజులకు ముందుగానే ఉపయోగించేకున్నట్లయితే చింతించాల్సిన అవసరం లేదు. తక్కువ స్పీడ్‌లో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను మిగిలి ఉన్న రోజుల్లో ఆస్వాదించవచ్చు.

టాప్ - 10 ‘3జీ డేటా ప్లాన్స్’

టాటా డొకొమో 3జీ ప్లాన్ (Tata docomo 3G plan):

టాటా డొకొమో ఆఫర్ చేస్తున్న ఈ ఫ్లాన్‌లో భాగంగా యూజర్ రూ.5 చెల్లించి ఒక రోజంతా 50 ఎంబి 3జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రూ.22 చెల్లించి 150ఎంబి 3జీ డేటాను రోజంతా ఉపయోగించుకోవచ్చు.

 

టాప్ - 10 ‘3జీ డేటా ప్లాన్స్’

ఎయిర్‌టెల్ 3జీ డేటా ప్లాన్ (Airtel 3G data plan):

ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న 3జీ డేటా ప్లాన్‌లో భాగంగా రూ.45చెల్లించి 150ఎంబి 3జీ డేటాను 7 రోజులు పాటు వినియోగించుకోవచ్చు. మరో ప్లాన్‌లో భాగంగా రూ.100 చెల్లించి 300ఎంబి 3జీ డేటాను 30రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు.

టాప్ - 10 ‘3జీ డేటా ప్లాన్స్’

ఎయిర్‌సెల్ 3జీ డేటా ప్లాన్స్ ఫర్ యూఎస్బీ డేటా కార్డ్ (Aircel 3G Data Plans for USB Data Card):

ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌సెల్ డేటా‌కార్డ్ యూజర్‌లు రూ.1250 చెల్లించి నెల రోజుల పాటు 3జీబి డేటాను 3.6ఎంబీపీఎస్ వేగంతో పొందవచ్చు.

 

టాప్ - 10 ‘3జీ డేటా ప్లాన్స్’

ఐడియా 3జీ నెట్ సెట్టర్ (Idea 3G net setter):

ఐడియా ప్రవేశపెట్టిన 3జీ నెట్ సెట్టర్ ఆఫర్‌లో భాగంగా 4జీబి వరకు 3జీ డేటాను 21.1ఎంబీపీఎస్ వేగంతో వినియోగించుకోవచ్చు. వాలిడిటీ నెల రోజులు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot