Home
News

Chinese Apps: ఇండియా యాప్ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా యాప్‌లు ఇవే

గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా వేగంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మొబైల్ రంగంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియాలో స్మార్ట్ఫోన్లు మరియు ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.

చైనా యాప్ లు

చైనా యాప్ లు

ప్రస్తుతం దేశంలో సుమారు 1.3 బిలియన్లకు పైగా సంభావ్య వినియోగదారులు పలురకాల యాప్ లను వాడుతున్నారు. అలాగే కొన్ని యాప్లు డౌన్‌లోడ్ చేయడానికి వినియోగదారులను ఆకర్షించడంలో విజయవంతమయ్యాయి. చాలా మంది వినియోగదారులు యాప్ లను గణనీయంగా డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నందున చైనా యాప్ లు భారతీయ యాప్ మార్కెట్‌ను శాసిస్తున్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. Umang app యాప్ ద్వారా ఈ ప్రభుత్వ సేవలను కూడా పూర్తి చేయవచ్చు!!!!

2018 & 2017 భారత మార్కెట్లో చైనీస్ యాప్ లు

2018 & 2017 భారత మార్కెట్లో చైనీస్ యాప్ లు

టెక్నాలజీ న్యూస్ కు సంబందించిన కొన్ని ప్రముఖ పోర్టల్స్ ప్రకారం డిసెంబర్ 2017 లో గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ 100 యాప్ లలో కేవలం 18 చైనీస్ యాప్ లు మరియు సాఫ్ట్‌వేర్ లు మాత్రమే జాబితా చేయబడ్డాయి. కానీ 2018 చివరి నాటికి వీటి సంఖ్య గణనీయంగా పెరిగి 44 కి చేరింది. అంటే కేవలం ఒకే ఒక సంవత్సరంలో రెండింతలు పెరిగాయి. Airtel Prepaid Plans:84రోజుల వాలిడిటీతో లాక్డౌన్ సమయంలో సరైన ప్లాన్‌లు ఇవే....

ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన చైనీస్ యాప్ లు

ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన చైనీస్ యాప్ లు

** సోషల్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌ : హలో మరియు SHAREit

** ఎంటర్టైన్మెంట్ మరియు వీడియో యాప్ లు: టిక్‌టాక్, లైక్ మరియు క్వాయ్

** వెబ్ బ్రౌజర్ : UCబ్రౌజర్ మరియు UCబ్రౌజర్ మిని

** వీడియో మరియు లైవ్ స్ట్రీమింగ్ యాప్ లు: లైవ్‌మీ, బిగో లైవ్ మరియు విగో వీడియో

** యుటిలిటీ అప్లికేషన్స్: బ్యూటీప్లస్, జెండర్ మరియు కామ్ స్కానర్

** గేమింగ్ యాప్ లు మరియు సాఫ్ట్‌వేర్: PUBG, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్

** ఇ-కామర్స్ అప్లికేషన్స్ : క్లబ్ ఫ్యాక్టరీ, షీన్ మరియు రోమ్వే

 

హలో సోషల్ యాప్

హలో సోషల్ యాప్

సోషల్ నెట్‌వర్కింగ్ హలో యాప్‌ను చైనాకు చెందిన ప్రముఖ సంస్థ బైటెడాన్స్ ప్రారంభించింది. హెలో యాప్ ఇప్పుడు ఉత్తమ భారతీయ సామాజిక వేదికలలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఇందులో సుమారు 40,000,000 మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. ఈ అప్లికేషన్‌లో షోబిజ్, ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్, పేరెంటింగ్ మరియు ఫార్మింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. హలో తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, మలయాళం, బెంగాలీ, తమిళం, కన్నడ వంటి మరిన్ని భారతీయ భాషలలో కూడా ఉపయోగించవచ్చు.

పాపులర్ వీడియో యాప్

పాపులర్ వీడియో యాప్

ప్రసిద్ధ చెందిన చిన్న వీడియో యాప్‌లు టిక్‌టాక్ మరియు క్వాయ్ లను కూడా ఇప్పుడు ఇండియాలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. లైక్ యాప్‌తో పాటు ఈ రెండు యాప్‌ల సహాయంతో తమ వ్యక్తిగత వీడియోలను పంచుకోవడానికి మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వీటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం టిక్‌టాక్ ప్రపంచ వినియోగదారులలో 39 శాతం మంది భారతదేశానికి చెందినవారు ఉన్నారు. ఈ వినియోగదారులలో ఎక్కువ మంది 16 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉండడం మరొక గొప్ప విషయం.

Best Mobiles in India

English summary
Top Chinese Apps Takeover Indian App Market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X