Home
News

Umang app యాప్ ద్వారా ఈ ప్రభుత్వ సేవలను కూడా పూర్తి చేయవచ్చు!!!!

ప్రపంచ మొత్తం ప్రస్తుతం స్మార్ట్ రంగం వైపు పరుగులు పెడుతున్నది. స్మార్ట్ రంగం ఎంతలా పెరిగింది అంటే కేవలం ఒక్క యాప్ లోనే అనేక రకాల పనులను పూర్తిచేయడం. భారత ప్రభుతం కూడా ప్రజల కోసం ఇటువంటి యాప్‌లను విడుదల చేసింది. ఇందులో ఉమాంగ్ యాప్‌ను అధిక మంది ఉపయోగిస్తున్నారు.

ఉమాంగ్ యాప్

ఉమాంగ్ యాప్

న్యూ-ఏజ్ గవర్నెన్స్ (ఉమాంగ్) యాప్ యొక్క యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ పౌరులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) 2017 లో ప్రారంభించిన ఈ యాప్ ఇప్పుడు 600 కు పైగా రకరకాల సేవలను అందిస్తున్నది.  WhatsApp scam:వెరిఫికేషన్ కోడ్స్ పేరుతో మెసేజ్ వచ్చిందా!!!! జర జాగ్రత్త...

గవర్నమేంట్ సర్వీసులు

గవర్నమేంట్ సర్వీసులు

వీటిలో పాన్, డిజిలాకర్, పిపిఎఫ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఆధార్ వంటి మరిన్ని సేవలు ఉన్నాయి. గ్యాస్, కరెంట్, మొబైల్ వంటి యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి కూడా ఈ యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రభుత్వం ఇటీవల ఈ ఉమాంగ్ యాప్‌కు మరికొన్ని సేవలను జోడించింది. వినియోగదారుల కోసం ప్రభుత్వం ఇటీవల జతచేసిన నాలుగు కొత్త సేవల వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Redmi 10X series: షియోమి నుంచి 5G సపోర్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు!!! ఫీచర్స్ అదుర్స్...

 

 

భారత వాతావరణ శాఖ

భారత వాతావరణ శాఖ

ఉమాంగ్ యాప్‌ ద్వారా వినియోగదారులు ఇప్పుడు తమ నగరం లేదా వారు సందర్శించబోయే ప్రదేశం యొక్క వాతావరణ సూచనలను ముందుగా తనిఖీ చేయవచ్చు లేదా పూర్తి వివరాలను ముందుగా కూడా తెలుసుకోవచ్చు. దీని సహాయంతో మరొక ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులను తెలుసుకొని ప్రయాణం చేయాలా లేక వద్దా అని తెలుసుకోవచ్చు.

Staff Selection Commission (SSC) services

Staff Selection Commission (SSC) services

దేశంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి వారు ఎక్కువగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) యొక్క ఉద్యోగాల వివరాలు, SSC ఆశావాదులు పరీక్ష తేదీలు, ఫలితాలు, ఖాళీలు, నోటిఫికెషన్స్ వంటి ఇతర తాజా వార్తలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఖచ్చితమైన వివరాలతో పొందవచ్చు. Redmi Earbuds S: తక్కువ ధరలోనే ఇయర్‌బడ్స్!!! నేటి నుంచే సేల్స్...

​Jan Aushadhi Sugam

​Jan Aushadhi Sugam

ఒక వేల మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు పొరపాటున ఏదైనా అత్యవసర మెడిషన్స్ అవసరమైతే మీకు సమీపంలోని జనౌషాధి కేంద్ర దుకాణాల్లో జనరిక్ ఔషధాల లభ్యత మరియు వాటి యొక్క ధరల వివరాలను జన్ ఔషధి సుగం యాప్ అందిస్తుంది. కానీ ఇప్పుడు ఈ యాప్ తో సంబంధం లేకుండా ఉమాంగ్ యాప్ వీటి యొక్క అన్ని వివరాలను అందిస్తుంది.

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్

ప్రస్తుతం కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు కానీ సాధారణంగా జూన్ 1 తేదీ నుండి అన్ని రకాల పాఠశాలలు ఓపెన్ చేస్తూ ఉంటారు. అలాగే కొత్త తరగతులను ప్రారంభిస్తూ ఉంటారు. దీనితో పాటుగా ప్రతి ఒక్క విద్యార్థి స్కాలర్‌షిప్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ స్కాలర్‌షిప్ పథకాల గురించి మొత్తం సమాచారాన్ని ఇప్పుడు ఉమాంగ్ యాప్ ద్వారా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Umang App Now Allows 4 New Government’s Services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X