ఇది మరో సత్యం కధ ..
జపాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ కంపెనీ తోషిబా తప్పుడు లాభాలు చూపూతూ ఏళ్ల తరబడి పెట్టుబడి దారులను ,ప్రజలను మోసం చేసినట్లు ఓ విచారణలో వెల్లడైంది. ఇది 7800 కోట్ల కుంభకోణంగా ప్రకటించారు. మీడియా సమావేశంలో అరనిమిషం పాటు తలవంచుకున్న సంస్థ చైర్మన్ తనకా రాజీనామా చేశారు.
Read More: ఆ నోకియా ఫోన్‌లు ఇప్పటికి దొరకుతున్నాయ్

ఆయనతో పాటు మరికొందరు బాద్యులు కూడా రాజీనామాలు చేశారు. ఒక న్యాయవాది విచారణలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలు నిర్దేశిస్తుండడంతో కంపెనీ అధికారులు కూడా తప్పుడు లెక్కలు చూపించారని అంటున్నారు. మన రాష్ట్రంలో సత్యం కంపెనీ తరహాలోనే ఈ కుంభకోణం జరిగిందని వెల్లడైంది.జపాన్ కంపెనీలు గొప్పవే కావచ్చు.ఎపికి వస్తున్న నేపధ్యంలో వాటి గురించి బాగా తెలుసుకుని ముందుకు వెళితే మంచిదేమో!
Read More: ఈ విల్లాను మూడు గంటల్లో కట్టేసారు!


Click it and Unblock the Notifications








