ఇకపై రెండు పైసలకే 1 ఎంబీ డేటా

Written By:

డేటా వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. భవిష్యత్తులో అతి తక్కువ ధరకే డేటా సర్వీసులు అందించేందుకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పట్టణ, గ్రామస్థాయిలో వై-ఫై సేవలు విస్తరించేందుకు టెలికం సంస్థలకు పలు సూచనలు చేయనుంది.

మెసేంజర్‌లో దిస్ లైక్ బటన్ వస్తోంది

ఇకపై రెండు పైసలకే 1 ఎంబీ డేటా

ప్రస్తుతం ఒక ఎంబీ పొందేందుకు పది పైసలు చెల్లించాల్సి వస్తుండగా దీనిని 2 పైసలకు తగ్గించాలని ట్రాయ్ నిర్ణయించింది. అయితే వై-ఫై నెట్‌వర్క్ వల్ల కాలింగ్‌లో నాణ్యత, బ్రాండ్‌బ్యాండ్ వేగం తక్కువగా ఉన్నా ఆపరేటర్ల మీద ఒత్తడి తగ్గుతుందని ట్రాయ్ పేర్కొంది. ఇక లైసెన్స్, నిబంధనల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యల కోసం టెలికం శాఖకు నివేదిక పంపనున్నట్టు ట్రాయ్ వివరించింది.

వాట్సప్‌లో మరో పవర్‌పుల్ ఫీచర్ !

ఫస్ట్ టైం జియో టాప్‌లోకి దూసుకొచ్చింది..ఓ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అప్‌లోడ్ స్పీడులో

డౌన్‌లోడ్ స్పీడ్‌లో దూసుకుపోతున్న జియో అప్‌లోడ్ స్పీడులో మాత్రం ఇతర కంపెనీల కంటే కొంత వెనుకంజలోనే ఉందట.

సగటు వేగం 17.427 ఎంబీపీఎస్

2017 ఫిబ్రవరిలో జియో నెట్ వర్క్ సగటు వేగం 17.427 ఎంబీపీఎస్ ఉన్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో తర్వాతి స్థానంలో ఐడియా(12.216ఎంబీపీఎస్), ఎయిర్ టెల్(11.245ఎంబీపీఎస్), వొడాఫోన్(8.337ఎంబీపీఎస్) ఉన్నాయి.

ప్రస్తుతమున్న జియో స్పీడు తక్కువే

అయితే 2016 డిసెంబర్ లో నమోదుచేసిన 18.146ఎంబీపీఎస్ స్పీడ్ కంటే ప్రస్తుతమున్న జియో స్పీడు తక్కువేనని ట్రాయ్ తెలిపింది.

ఐడియా సెల్యులార్ స్పీడ్

ఐడియా సెల్యులార్ స్పీడ్ వరుసగా పైకి ఎగుస్తున్నట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. డిసెంబర్ నెలలో 5.943ఎంబీపీఎస్ గా ఉన్న ఐడియా సెల్యులార్ స్పీడ్, తర్వాతి నెలలో 10.301ఎంబీపీఎస్ గా, గత నెలలో 12.216ఎంబీపీఎస్ గా ఉన్నట్టు పేర్కొంది.

ఎయిర్ టెల్, వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్లు

టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్, వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్లు మాత్రం జనవరి నుంచి తక్కువవుతున్నాయని డేటా వెల్లడించింది. చాలా వేగవంతంగా 4జీ అప్ లోడ్‌లో ఐడియా ముందంజలో ఉన్నట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
TRAI Wants 2 Paisa/MB Fare Cap on WiFi Based Internet! ; But Ain’t Internet Already Cheaper? read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot