ఇంటర్నెట్‌ను ముంచే డీల్ కుదిరింది

Posted By:

అంతర్జాతీయంగా ఇంటర్నెట్ స్వేచ్ఛకు తీవ్ర ముప్పుగా భావిస్తున్న ద ట్రాన్స్ ఫసిపిక్ పార్టనర్ షిప్ ఒప్పందం కుదిరింది.ఐదేండ్ల సుదీర్ఘ చర్చలు సంప్రదింపులు అనంతరం ఈ ఒప్పందంపై మంగళవారం సంతకాలు పూర్తయ్యాయి.40 శాతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కవర్ చేయనున్న ఈ ఒప్పందం ఉద్దేశం ఏకీకృత ఆర్థిక బ్లాకును ఏర్పాటు చేయడం. దీని ద్వారా కంపెనీలు,వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని సులువుగా నిర్వహించుకోవచ్చు. అయితే ఈఒప్పందం ఇంటర్నెట్ ఫ్రధాన సూత్రాలను నీరుగార్చే అవకాశం ఉందని ఈ డీల్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more: విధ్వంసం సృష్టించే ఆయుధాలు

కార్పోరేట్ అక్రమాలను కంప్యూటర్ సిస్థం ద్వారా వెలుగులోకి తీసుకురావడం నేరమవుతుందని ఈ ఒప్పందంలో ఉన్న ఓ వివాదాస్పద నిబంధనపై ప్రధానంగాఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నిబంధనలోని పదజాలం అస్పష్టంగా ఉందని దీనివల్ల విజిల్ బ్లోయర్లు ఏదైనా సమాచారం ఆన్ లైన్ ద్వారా వెల్లడి చేస్తే అందుకు జరిమానా గురయ్యే అవకాశం ఉందని అంతే కాకుండా పాత్రికేయులు కూడా ఈ సమాచారాన్ని ప్రచురించడడానికి ముందుకు రాకపోవచ్చచని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాలో మాదిరి ఒక చిన్న ఫిర్యాదు వచ్చినా ఆ సమాచారాన్ని యూట్యూబ్ ,ఫేస్ బుక్ వంటి ఆన్ లైన్ కంటెంట్ ప్రొవైడర్ తొలగించాల్సి ఉంటుంది. అసలు టీపీపీ అంటే ఏంటీ ..దాని వల్ల నష్టం ఏంటీ. మిగితా కథనం స్లైడర్ లో..

Read more: కన్ను మూసి తెరిచే లోపు సర్వనాశనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆరుసంవత్సరాల సుదీర్ఘచర్చల అనంతరం

ఆరుసంవత్సరాల సుదీర్ఘచర్చల అనంతరం పసిఫిక్‌ తీరప్రాంత 12దేశాల వాణిజ్యమంత్రుల మధ్య ఫ్లోరిడాలో జరిగిన సమావేశంలో అక్టోబర్‌ 5, 2015 న టీపీపీ (ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌) వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపారు.

టీపీపీ అంటే ఏంటి... ? దీనివల్ల జరిగే నష్టం ఏంటి...?

ట్రాన్స్‌ -ఫసిఫిక్ పార్టనర్‌షిప్ సంక్షిప్త రూపమే టీపీపీ. ఈ టీపీపీ అమలులోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా 40 శాతానికి పైగా ఆర్ధిక వ్యవస్థ ఏకీకృతమైపోతుంది. దీనిద్వారా కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని సులువుగా నిర్వహించుకోవచ్చు.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకునే కుట్ర

టీపీపీ పరిధిలో ఉన్న దేశాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకునే కుట్రలు చేస్తాయ్... అమెరికా, ఆస్ట్రేలియా, బ్రునై, కెనడా, చిలీ, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూ జిలాండ్, పెరు, సింగపూర్‌, వియత్నా. ఈ దేశాలు టీపీపీకి అనుకూలంగా సంతకాలు చేశాయ్.

అంతర్జాతీయంగా ఇంటర్నెట్ స్వేచ్ఛకు సంకెళ్లు

ట్రాన్స్- ఫసిఫిక్ పార్టనర్‌షిప్ ద్వారా మరో ముప్పుకూడా పొంచి ఉంది. అంతర్జాతీయంగా ఇంటర్నెట్ స్వేచ్ఛకు సంకెళ్లు వేసే సీక్రెట్‌ డీల్ దీని వెనుక దాగి ఉంది. ఇంటర్నెట్ ప్రధాన సూత్రాలను నీరుగార్చే ప్రమాదం టీపీపీతో ఉందని ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోన్న ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీపీపీ మొత్తం కార్పోరేట్ వర్గాలకు అనుకూలంగా ఉంటుంది.

ప్రపంచ ప్రజలను ముంచబోతున్నాయ్.

టీపీపీ అనే ఈ మూడు అక్షరాలే ప్రపంచ ప్రజలను ముంచబోతున్నాయ్. అగ్రరాజ్యం అమెరికాతో సహా పది కీలక దేశాలు అత్యంత రహస్యంగా టీపీపీని ప్రపంచం మీద రుద్దబోతున్నాయ్. ఐదేళ్లుగా జరుగుతున్న సుధీర్ఘ చర్చలు కొలిక్కిరావడంతో టీపీపీని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయ్.

కార్పోరేట్ అక్రమాలను ..

కార్పోరేట్ అక్రమాలను కంప్యూటర్ ద్వారా వెలుగులోకి తేవడాన్ని కూడా భవిష్యత్తులో నేరంగా పరిగణిస్తారు. విజిల్ బ్లోయర్లు ఏదైనా సమాచారం ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడిచేస్తే.. అందుకు జరిమానా కూడా విధిస్తారు. టీపీపీ అమలులో ఉన్న దేశాల నుంచి ఫిర్యాదు అందితే..ఇంటర్నెట్ నుంచి సంబంధిత కంటెంట్‌ను డిలీట్ చేయాల్సిందే.

ప్రజలకు తెలియకుండా రహస్యంగా ..

టీపీపీ ఒప్పందంలో ఏముందో ఇప్పటి వరకూ ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులు డ్రాఫ్ట్‌ను బయటపెట్టడంతో టీపీపీ కుట్ర బయటపడింది.

చట్టాలను కూడా టీపీపీ అపహాస్యం చేసే ప్రమాదం

దేశాల సార్వభౌమాధికారాన్ని, చట్టాలను కూడా టీపీపీ అపహాస్యం చేసే ప్రమాదం ఉంది. వివిధ దేశాల్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్న కార్పోరేట్ సామ్రాజ్యాలు తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యవహారాలను టీపీపీ పరిధిలోని ట్రిబ్యునల్స్‌కు తీసుకువెళ్తాయ్.

ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులే చట్టమవుతాయ్

ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులే చట్టమవుతాయ్. అమెరికా కాంగ్రెస్‌లో టీపీపీపై ఓటింగ్ జరగాల్సి ఉన్నా... ఒప్పంద పత్రాలను బయటపెట్టకపోవడం వెనుక కూడా కుట్ర ఉందనే వాదన ఉంది.

బరాక్‌ ఒబామా వ్యూహరచనలో భాగం

చైనా ఆర్ధికవ్యవస్థనూ, వాణిజ్యాభివృద్ధిని అడ్డుకోటానికి బరాక్‌ ఒబామా వ్యూహరచనలో భాగంగా ఆసియా పివోట్‌ అంతర్భాగమే ఈ ఒడంబడిక నిర్దేశం. దీనినే టీపీపీ అంటారు. తొలుత చైనాను ఆహ్వానించక పోయినప్పటికీ తర్వాత చైనాకు ఆహ్వానం అందినా ఈ సమావేశాల్లో చైనా పాల్గొనలేదు.

కార్పొరేషన్‌ కంపెనీలకు అనూహ్యమైన మార్కెట్‌ను చైనా పొందిఉండటమే

ఆహ్వానానికి గల ప్రధానకారణం కార్పొరేషన్‌ కంపెనీలకు అనూహ్యమైన మార్కెట్‌ను చైనా పొందిఉండటమే. కార్పొరేషన్‌ కంపెనీల ఒత్తిడికి ఒబామా తలొగ్గక తప్పలేదు. అయినప్పటికీ చైనా బ్రిక్స్‌ దేశాల కలయికకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.

యూరప్‌దేశాల భద్రత బలహీనపరచడానికే

మరొకవైపు ''టీపీపీ యూరప్‌దేశాల భద్రత బలహీనపరచడానికే అమెరికా వ్యూహమని'' యూరోపియన్‌ పార్లమెంటేరియన్‌ షాప్‌ హౌజర్‌ అంటున్నారు. భవిష్యత్తులో టీపీపీలో దక్షిణకొరియా, ఫిలిప్పైన్స్‌, తైవాన్‌ దేశాలు చేరే అవకాశాలు ఉన్నాయి. చైనాకూడా కలిసివస్తుందనే ఆశతో ఉన్నారు.

ధనిక దేశాలు ఇంకా ధనికదేశాలై

మరోవైపు ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం, అమెరికా ఈయు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, టీపీపీ ఈయుల మధ్య స్వేఛ్చా వాణిజ్యాన్ని కలిపితే కార్మికహక్కులకు భంగం వాటిల్లడమే కాకుండా, ధనిక దేశాలు ఇంకా ధనికదేశాలై పెరిఫరీ దేశాలు మరింత వ్యత్యాసంతో వెనకడుగు వేయాల్సి వస్తుందేమోనని ఆర్ధిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఒప్పందంపై సంతకం చేసేందుకు..

ఒప్పందంపై సంతకం చేసేందుకు న్యూజిలాండ్‌ తన పాడిపరిశ్రమకు పెద్దపీట వేయాలనీ అమెరికా, కెనడాల్లో తగిన స్థానం కల్పిస్తేనే సంతకం చేస్తానంటుంది.

అమెరికా వస్తు ఉత్పత్తులకు వివిధ దేశాల్లో 18వేల రకాల పన్నులు

అమెరికా వస్తు ఉత్పత్తులకు వివిధ దేశాల్లో 18వేల రకాల పన్నులు వేయబడుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా అమెరికా ఉత్పత్తులకు పన్నుల రాయితీ కల్పించి తొలుత చౌకగా వస్తువులు లభ్యమైనప్పటికీ తదుపరి కాలక్రమంలో స్వదేశీ పరిశ్రమలూ, ఉత్పత్తులూ మూలనపడి పెరిఫరీ దేశాల ఆర్ధికవ్యవస్థలు ఛిన్నాభిన్నమైపోయే ప్రమాదం పొంచిఉంది.

కొనుగోలు శక్తి దిగజారే ప్రమాదం

తద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయి తక్కువ ధరలకు ముడిసరుకులు విక్రయించుట ద్వారా కొనుగోలు శక్తి దిగజారే ప్రమాదం ఉంది. వాణిజ్య ద్రవ్య సంస్థల ఒప్పందాల వల్ల అంతిమంగా ప్రయోజనాలు పొందుతున్నవి బహుళజాతికంపెనీలు,ఐఎమ్‌ఎఫ్‌, ప్రపంచబ్యాంకులు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Trans-Pacific Partnership deal, the biggest threat to internet, signed
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot