డ్రైవర్ లేకుండా బస్సు 32 కిలోమీటర్లు పరిగెత్తింది

By Hazarath
|

డ్రైవర్ అవసరం లేని కార్లు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు డ్రైవర్ లేని బస్ కూడా వచ్చేసింది. అత్యాధునిక సాంకేతికతో అందివచ్చిన ఒక సౌలభ్యాన్ని పరీక్షించి విజయవంతంగా పూర్తి చేసింది చైనాలోని ఓ కంపెనీ. డ్రైవర్ లేని బస్సుల్ని రూపొందించాలన్న ప్రయత్నంలో భాగంగా.. నిర్వహించిన పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు చెబుతున్నారు.యూటాంగ్ బస్ కంపెనీ రూపొందించిన డ్రైవర్ లేకుండా నడిచే బస్సును ప్రయోగాత్మకంగా.. హెనాన్ ఫ్రావిన్స్ లో జెంగ్ ఝూ నుంచి కైఫెంగ్ సింటీ మధ్యనున్న 32.6కిలో మీటర్ల టెస్ట్ డ్రైవ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.

Read more: వేల కోట్లు దానం చేస్తున్నభారతీయులు

ఈ నేపధ్యంలో ఇంటర్ సిటీ రోడ్డుపై ఆటోమేటిక్ గా లేన్స్ మార్చుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగిపోవటం, ఎదుటి వాహనాలను ఓవర్ టేక్ చేయడం అడ్డుగా ఏదైనా వస్తే.. బ్రేకులు వేసుకోవటం వంటి పరీక్షలను పూర్తి చేసింది. కాగా, బస్సులో రెండు కెమెరాలు, నాలుగు లేజర్ రాడార్లు, మిల్లీ మీటర్ వేవ్ రాడార్ సెట్, నావిగేషన్ సిస్టంను అమర్చారు. దీంతో వీటి సాయంతో బస్సు నడుస్తుంది. యుటాంగ్ కంపెనీ మూడేళ్ళ క్రితం డ్రైవర్ రహిత బస్సును తయారుచేయడానికి పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా, ఈ బస్సును వాడుకలో తీసుకురావాలంటే సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ మద్దతు అవసరమని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.

Read more : మరో యుగాంతం రాబోతోందా..?

డ్రైవర్ లేకుండా రోడ్లు మీదకు వచ్చేసిన బస్సు

డ్రైవర్ లేకుండా రోడ్లు మీదకు వచ్చేసిన బస్సు

డ్రైవర్ లేకుండా రోడ్లు మీదకు వచ్చేసిన బస్సు 

నాదారి నాదే

నాదారి నాదే

ముందు కార్లు ఉన్నా లారీలు ఉన్నా నాదారి నాదే అంటే ముందుకు దూసుకెళుతున్న డ్రైవర్ లేని బస్సు 

అటోమేటిగ్గా దానిపాటికదే స్లో

అటోమేటిగ్గా దానిపాటికదే స్లో

సిగ్నల్ దగ్గర బ్రేక్ పడినప్పుడు అటోమేటిగ్గా దానిపాటికదే స్లో అవుతుందట

బస్సులు రాకతో డ్రైవర్ల జాబులకు కష్టకాలమే

బస్సులు రాకతో డ్రైవర్ల జాబులకు కష్టకాలమే

స్టీరింగ్ అయితే డ్రైవర్ కూడా అలా తిప్పలేడు.ఇక ఈ బస్సులు రాకతో డ్రైవర్ల జాబులకు కష్టకాలమే 

ఆటోమేటిక్ టర్నింగ్

ఆటోమేటిక్ టర్నింగ్

ఇక సందులు టర్నింగ్ పాయింట్లు ఎన్ని ఉన్నా వాటిని సునాయాసంగా చేధించింది ఈ బస్సు 

బస్సుకు అమర్చిన కెమెరా

బస్సుకు అమర్చిన కెమెరా

బస్సుకు అమర్చిన కెమెరా 

భయం లేకుండా ప్రయాణికులు ప్రయాణం

భయం లేకుండా ప్రయాణికులు ప్రయాణం

బస్సులో ఎటువంటి భయం లేకుండా ప్రయాణికులు ప్రయాణించారు.డ్రైవర్ సంగతే మరచిపోయారు.

బస్సుకు సంబంధించిన వీడియో

ఈ బస్సు ఎలా 32 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా ప్రయాణించిందో తెలిపే వీడియో

Best Mobiles in India

English summary
A Chinese firm has announced that it has successfully completed the trial of an unmanned passenger bus

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X