రూ. 800కే మేక్ ఇన్ ఇండియా సోలార్ పవర్ బ్యాంక్

Written By:

యూఐఎంఐ టెక్నాల‌జీస్ సంస్థ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 'యూ3' పేరిట ఓ నూత‌న ప‌వ‌ర్ బ్యాంక్‌ను విడుద‌ల చేసింది. ఈ పవర్ బ్యాంక్ రూ.799 ధ‌ర‌కే వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతోంది. యూ3 ప‌వ‌ర్ బ్యాంక్ సోలార్ ప‌వ‌ర్ ఆధారంగా ప‌నిచేస్తుంది. దాదాపు 6 నుంచి 8 గంట‌ల పాటు ఎండ‌లో చార్జింగ్ పెడితే ఈ ప‌వ‌ర్ బ్యాంక్ ఫుల్ చార్జి అవుతుంది.

గూగుల్ ఫోన్లకు ఫ్రీ ఆర్డర్లు షురూ

రూ. 800కే మేక్ ఇన్ ఇండియా సోలార్ పవర్ బ్యాంక్

చార్జింగ్ అవ‌డం కోసం ఇందులో 2.4 వాట్ల ఎల్ఈడీ ప్యానెల్ లైట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ బ్యాక‌ప్ ల‌భిస్తుంది. 5V/2A సామ‌ర్థ్యం క‌లిగి ఉండ‌డం వ‌ల్ల ఈ పవర్ బ్యాంక్ తో మీ డివైస్‌ల‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. అంతేకాదు వాట‌ర్‌, డ‌స్ట్ ప్రూఫ్‌గా ఈ ప‌వ‌ర్ బ్యాంక్‌ను తీర్చిదిద్దారు.

పడిలేచిన శాంసంగ్ : కళ్లు చెదిరే ఆఫర్లతో దిగ్గజాలకు షాక్

రూ. 800కే మేక్ ఇన్ ఇండియా సోలార్ పవర్ బ్యాంక్

ఎల్ఈడీ టార్చి లైట్ కూడా ఇందులో ఉంది. పూర్తి స్థాయిలో రబ్బ‌ర్ ఫినిషింగ్‌తో దీన్ని త‌యారు చేశారు. ప‌వ‌ర్ బ్యాంక్‌లో ఇంకా ఎంత ప‌వ‌ర్ మిగిలి ఉందో తెలుసుకునేలా ఇండికేటివ్ లైట్ల‌ను కూడా ఏర్పాటు చేశారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
UIMI U3 6000mAh waterproof power bank with Solar charging launched for Rs. 799 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot