15600 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ కేవలం రూ. 999కే
ఏక కాలంలో రెండు ఫోన్లకు చార్జింగ్ , ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టి ఉంచినా ఏమి కాదు
UIMI టెక్నాలజీస్ సంస్థ 'UIMI U8 ' పేరిట ఓ సరికొత్త పవర్ బ్యాంక్ను విడుదల చేసింది. ఇది రూ .999 ధరకు వినియోగదారులకు లభ్యమవుతోంది. ఈ పవర్ బ్యాంక్ 15600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో పాటు 5V / 2A సామర్థ్యం కలిగిన రెండు పోర్టులు దీనికి ఉన్నాయి.
ఆపిల్,గూగుల్ కంపెనీలకు రష్యా గట్టి హెచ్చరికలు

వాటి ద్వారా మీరు ఏక కాలంలో రెండు ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టి ఉంచినా ఏమి కాకుండా ఉండేందుకు ఈ పవర్ బ్యాంక్లో ఓవర్ డిశ్చార్జి అనే ఫీచర్ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 180 డిగ్రీల కోణంలో తిరిగే టార్చి లైట్ను ఇందులో అమర్చారు.
యాహూ పేరు మారింది , ఇకపై అల్టాబా ఇంక్

పవర్ ఇండికేటర్ను తెలియజేసేందుకు ఓ బ్లూ లైట్ ఉంది. అయితే ఈ పవర్ బ్యాంక్ను ఫుల్ చార్జి చేయడానికి 14 గంటల సమయం పడుతుంది.


Click it and Unblock the Notifications








