Redmi Earbuds S: తక్కువ ధరలోనే ఇయర్‌బడ్స్!!! నేటి నుంచే సేల్స్...

|

స్మార్ట్ ఫోన్లను వాడుతున్న ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఇయర్‌ఫోన్స్ కు బదులుగా ఇయర్‌బడ్స్ లను వాడుతున్నారు. చాలా సంస్థలు ఇప్పటికే తమ తమ ఇయర్‌బడ్స్లను విడుదల చేసారు. ఆపిల్,సాంసంగ్ వంటివి అధిక ధర వద్ద తమ ఇయర్‌బడ్స్ లను విడుదల చేసాయి.

 

ఇయర్‌బడ్స్S

ఇవి అధిక ధరను కలిగి ఉండడం వలన సామాన్యులు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. అటువంటి వారి కోసం షియోమి సంస్థ తక్కువ ధర వద్ద రెడ్‌మి ఇయర్‌బడ్స్S ను విడుదల చేసింది. Jio,Airtel ‘వర్క్ @ హోమ్' 4G వోచర్ ప్లాన్ లలో సరికొత్త మార్పులు...

షియోమి రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్‌

షియోమి రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్‌

ప్రముఖ షియోమి సంస్థలో భాగమైన రెడ్‌మి ప్రస్తుతం తన రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్‌ను తన వర్చువల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఇండియాలో విడుదల చేసింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 12 గంటల ప్లేబ్యాక్ సామర్థ్యంను కలిగి ఉంటుంది. అలాగే ఈ రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ తక్కువ లాటెన్సీ గేమింగ్ మోడ్‌ను కలిగి ఉండడమే కాకుండా చెమట మరియు స్ప్లాష్ నిరోధకతను కలిగి ఉంటుంది.

ఇయర్‌బడ్స్
 

ఇయర్‌బడ్స్

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్‌లోని మల్టీ-ఫంక్షనల్ బటన్‌ వాయిస్ అసిస్టెంట్లగా కూడా పనిచేస్తుంది. ఇది వినియోగదారులకు వాయిస్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడానికి లేదా తిరస్కరించడానికి వీలు కల్పిస్తుంది. రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ యొక్క మొదటి అమ్మకం నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మి.కామ్, మి హోమ్ మరియు అమెజాన్‌లో మొదలుకానున్నది.

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ ధరల వివరాలు

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ ధరల వివరాలు

షియోమి సంస్థ యొక్క రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ యొక్క చైనీస్ వేరియంట్ ధర సుమారు 1100 రూపాయలు కాగా ఇండియాలో దేని యొక్క ధర రూ.1799 గా ఉంది. దీని యొక్క మొదటి సేల్ నేడు అంటే మే 27 నుంచి Mi.com మరియు అమెజాన్‌లో షెడ్యూల్ చేయబడింది. ఇది బ్లాక్, గ్రీన్,వైట్,రెడ్ కలర్లలో లభిస్తుంది. BSNL New Prepaid Plan: 600 రోజుల వాలిడిటీతో గల ఏకైక లాంగ్ -టర్మ్ ప్లాన్

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ అల్ట్రా లైట్‌వెయిట్ డిజైన్

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ అల్ట్రా లైట్‌వెయిట్ డిజైన్

షియోమి సంస్థ యొక్క రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ "అల్ట్రా లైట్‌వెయిట్" మరియు "కాంపాక్ట్ మరియు స్టైలిష్ డిజైన్" ను కలిగి ఉండి హైలైట్ గా ఉంది. ఈ ఇయర్‌బడ్‌లు 4.1 గ్రాముల బరువును కలిగి ఉండి 10 మీటర్ల వైర్‌లెస్ పరిధి వరకు ఫోన్ కాల్స్ ను స్వీకరించడానికి కూడా అనుమతిని ఇస్తాయి. రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ బ్లూటూత్ 5.0 ను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు కాల్ అనుభవాలను మెరుగుపరిచే "పంచీర్ సౌండ్ మరియు DSP సౌండ్ తగ్గింపు" ని అందిస్తుందని సంస్థ ప్రతేకంగా చెప్పింది.

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ ఫీచర్స్

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ ఫీచర్స్

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ రెండింటిలోనూ వాయిస్ అసిస్టెంట్లకు మద్దతు ఇస్తుంది. రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ కేవలం మూడు సెకన్లలోనే స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేయగలదని కంపెనీ తెలిపింది. ఇందులో గల గేమింగ్ మోడ్ "ప్రో గేమింగ్ కోసం" పనితీరును జాప్యాన్ని 122ms కు తగ్గిస్తుంది. రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ ఒక ఛార్జ్ మీద మొత్తంగా 12 గంటల ప్లేబ్యాక్ ను అందిస్తుంది. అలాగే ఇందులో గల ఛార్జింగ్ కేసును ఉపయోగించి మరొక నాలుగు గంటల అదనపు ఛార్జీను కూడా పొందవచ్చు. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడం కోసం 2 గంటల సమయం పడుతుంది.

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ Vs రియల్‌మి బడ్స్ ఎయిర్ నియో

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ Vs రియల్‌మి బడ్స్ ఎయిర్ నియో

రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ ఈ విభాగంలో అనేక పరికరాలతో పోటీ పడనుంది. ఇది సోమవారం రూ.2999 ధర వద్ద విడుదల అయిన రియల్‌మే బడ్స్ ఎయిర్ నియోతో పోటీ పడనున్నది. రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ యొక్క బ్లాక్ కలర్ లోనే కాకుండా వైట్, గ్రీన్ మరియు రెడ్ వంటి మరో మూడు కలర్ లలో లభిస్తుంది. ఇంకా రియల్‌మి బడ్స్ ఎయిర్ నియో 119.2 మీటర్ల జాప్యాన్ని కలిగి ఉంది. అలాగే ఇది రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ మాదిరిగానే ఇది కూడా 4.1 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. అయితే దీని యొక్క మొత్తం ప్లేబ్యాక్ సమయం 17 గంటలుగా ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Earbuds S First Sale Start Today at 12PM via Amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X