Home
News

Xiaomi Valentine's Day అమ్మకంలో Mi ఉత్పత్తుల మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్...

నేడు ఫిబ్రవరి 12 కావున వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఇంక కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు అనేది చాలా మందికి ప్రత్యేకమైనదిగా ఉంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి మరింత ముఖ్యమైనదిగా ఉంది. ఈ రోజున తమకు నచ్చిన ప్రేయసికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. ప్రముఖ చైనా సంస్థ షియోమి తన యొక్క వెబ్ సైట్ లో వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన అమ్మకాన్ని భారతదేశంలో మొదలుపెట్టింది. ఈ అమ్మకంలో అనేక షియోమి ఉత్పత్తులపై అద్బుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. షియోమి ఇండియా వెబ్‌సైట్ లో ప్రస్తుతం లైవ్ లో ఉన్న అమ్మకం సమయంలో డిస్కౌంట్ ధరల వద్ద లభించే ఉత్పత్తుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు

షియోమి ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు

షియోమి వాలెంటైన్స్ డే అమ్మకంలో ప్రధానంగా స్మార్ట్ బ్యాండ్ మరియు స్మార్ట్ వాచ్, ఆడియో డివైస్ లు, స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ IoT పరికరాలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. అయితే ఈ అమ్మకంలో స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల మీద ఎటువంటి డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో లేవు.

షియోమి  Mi వాచ్ రివాల్వ్ మీద రూ.3000 తగ్గింపు ఆఫర్

షియోమి Mi వాచ్ రివాల్వ్ మీద రూ.3000 తగ్గింపు ఆఫర్

ప్రస్తుత అమ్మకంలో షియోమి సంస్థ యొక్క ఇతర ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. ఇందులో భాగంగా సాధారణంగా రూ .10,999 ధర వద్ద లభించే షియోమి Mi వాచ్ రివాల్వ్ ఇప్పుడు కేవలం రూ.7,999 ధరకే లభిస్తుంది. అలాగే రెడ్‌మి బ్యాండ్ మీద ఇప్పుడు రూ.200 తగ్గింపు పొందిన తర్వాత కేవలం రూ.1,399 ధర వద్ద పొందవచ్చు.

Mi టీవీల మీద తగ్గింపు ఆఫర్స్

Mi టీవీల మీద తగ్గింపు ఆఫర్స్

వాలెంటైన్స్ అమ్మకం మరియు Mi టివి లాంచ్ 3 సంవత్సరాల పూర్తి సందర్బంగా షియోమి టివిల అమ్మకాల మీద భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. Mi టివి 4A ప్రో (43-అంగుళాల) రూ.23, 999, Mi టివి 4X (43 అంగుళాల) రూ.27,999, Mi టివి 4X (50 అంగుళాలు) రూ.33,999 డిస్కౌంట్ ధరల వద్ద లభిస్తాయి. ఈ స్మార్ట్ టీవీలన్నింటిలో మెరుగైన మరియు ఇటీవల విడుదల అయిన Mi టివి హారిజోన్ ఎడిషన్ (32-అంగుళాల) మీద రూ.500 తగ్గింపును అందుకున్న తరువాత ఇప్పుడు 15,499 రూపాయల రిటైల్ ధర వద్ద లభిస్తుంది.

Mi ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు

Mi ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు

Mi టివి స్టిక్ మరియు Mi బాక్స్ 4K లపై కూడా డిస్కౌంట్ లను అందిస్తున్నది. వీటి ధరలు వరుసగా రూ .2,299 మరియు రూ.3,299గా ఉన్నాయి. ఆడియో విషయానికొస్తే Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 రూ.2,999 ధర వద్ద లభించగా, Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2C రూ.2,199 ధర వద్ద లభిస్తుంది. అలాగే Mi డ్యూయల్ డ్రైవర్ ఇన్-ఇయర్ ఇయర్ ఫోన్స్ రూ.699 రిటైల్ ధర వద్ద నుండి ప్రారంభం అవుతుంది. అలాగే రెడ్‌మి పవర్ బ్యాంక్‌ మీద రూ.200 ధర తగ్గింపు పొందిన తరువాత రూ.1,199 ధర వద్ద పొందవచ్చు. అదనంగా Mi స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ (ఆర్‌ఓ + యువి) మీద రూ.2,000 తగ్గింపు లభించిన తరువాత రూ.10,999 ధర వద్ద లభిస్తుంది. Mi ఎయిర్ ప్యూరిఫైయర్ 3 మీద రూ.1,000 తగ్గింపుతో రూ.9,999 ధర వద్ద మరియు Mi బార్డ్ ట్రిమ్మర్ 1C ని రూ.899 ధర వద్ద పొందవచ్చు.

Mi ఉత్పత్తుల కొనుగోలుపై ఉచిత ఆఫర్లు

Mi ఉత్పత్తుల కొనుగోలుపై ఉచిత ఆఫర్లు

షియోమి ఇండియా వెబ్‌సైట్ లో షియోమి టీవీ లేదా మి స్ట్రీమింగ్ డివైస్ కొనుగోలు చేసిన వారికి అదనంగా సోనీ LIV's వార్షిక ప్యాక్‌పై 25 శాతం, ఎరోస్ నౌ మరియు హోయిచోయిపై 50 శాతం, హంగమా ప్లేపై 50 శాతం, Epic ఆన్ ప్లాన్‌లపై 35 శాతం, మరియు డాక్యుబేపై 33 శాతం తగ్గింపును పొందవచ్చు. .

More from GizBot

Best Mobiles in India

English summary
Valentine's Day Sale Live on Xiaomi Website: Discount Offers on Mi Watch, Redmi Band and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X