Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలు పెరిగాయి!! వివరాలు ఇవిగో...
ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా(Vi) ఇప్పుడు దేశం అంతటా పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఈ సంస్థ కొన్ని నెలల క్రితం కొన్ని సర్కిల్‌లలో తన యొక్క ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. అయితే ఇప్పుడు టెల్కో దేశవ్యాప్తంగా ఇదే ప్లాన్‌లను రూపొందించింది. ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను రూ.598 నుంచి రూ.649 కు మరియు రూ.699 నుంచి రూ.799 కు పెంచారు. Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ కోసం చూస్తున్న కొత్త వినియోగదారులు రూ.649, రూ.799, రూ.999, రూ.948 లేదా రూ.1,348 ధరల వద్ద లభించే ప్లాన్‌లను పొందవచ్చు. Vi ధరల పెరుగుదల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరల పెరుగుదల వివరాలు
Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచిన తరువాత ఇప్పుడు వినియోగదారులు తమ ఫ్యామిలీ ప్లాన్‌లను నెలకు రూ.649 మరియు రూ.799 ప్రారంభ ధరల వద్ద పొందవచ్చు. ఈ ప్లాన్‌ల ప్రయోజనాల విషయానికొస్తే రూ.649 ధర వద్ద లభించే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రెండు కనెక్షన్‌లను (ఒక ప్రాధమిక మరియు ఒక యాడ్-ఆన్ కనెక్షన్) ను అందిస్తుంది. ఇది 80GB డేటా (మొదటి కనెక్షన్ కోసం 50GB మరియు సెకండరీ కనెక్షన్ కోసం 30GB) తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు నెలకు 100 SMS లను అందిస్తుంది. అలాగే రూ.799 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మూడు (ఒక ప్రాధమిక మరియు రెండు యాడ్-ఆన్) కనెక్షన్లను అందిస్తుంది. ఇది మొత్తంగా 120GB డేటా (ప్రైమరీకి 60GB మరియు సెకండరీ కనెక్షన్‌లకు 30GB) డేటా ప్రయోజనంతో వస్తుంది. అలాగే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కూడా అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 100SMS లు మరియు ఉచిత OTT చందాలు కూడా ఉన్నాయి.

Vi రూ.948, రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పెరుగుదల వివరాలు
Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మిగిలినవి రూ.948, రూ.999, రూ.1,349 ధరల వద్ద లభిస్తాయి. వీటిలో రూ.948 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రెండు కనెక్షన్లకు ప్రయోజనాలతో లభిస్తుంది. అంటే ప్రాథమికంగా రూ.649 వ్యక్తిగత ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్లాన్ మరియు రూ .249 విలువైన ఒక యాడ్-ఆన్ కనెక్షన్ తో లభిస్తుంది. ప్రాధమిక కనెక్షన్ వినియోగదారులు (నెలకు 150GB చొప్పున, సెకండరీ కనెక్షన్ హోల్డర్లకు నెలకు 30GB) అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. రూ.948 ప్లాన్‌తో నెలకు రూ .249 విలువైన మొత్తం ఐదు యాడ్-ఆన్ కనెక్షన్‌లను వినియోగదారులు పొందవచ్చు. అలాగే రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ప్రస్తుతం ఐదు కనెక్షన్‌లతో లభించే ఉత్తమమైన ఎంపిక. ఈ ప్లాన్ అందించే మొత్తం డేటా ప్రయోజనం 200GB (మొదటి కనెక్షన్ కు 80GB మరియు సెకండరీకి 30GB).

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ధరలు పెరిగిన వాటిలో చివరిది రూ.1,348 ధర వద్ద లభిస్తుంది. ఇది మళ్ళీ వ్యక్తిగత వినియోగదారుల కోసం REDX ప్లాన్ రూ.1,099 ధర వద్ద లభిస్తుంది మరియు రూ.249 యాడ్-ఆన్ కనెక్షన్ కూడా. ప్రాథమిక కనెక్షన్ హోల్డర్లు అపరిమిత డేటా ప్రయోజనాన్ని పొందుతారు అయితే ద్వితీయ కనెక్షన్ హోల్డర్లు 30GB వరకు హై-స్పీడ్ డేటాను బ్రౌజ్ చేయవచ్చు.

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ఉచిత OTT సబ్స్క్రిప్షన్
Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ యొక్క అన్ని ప్లాన్‌లు ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాకు మరియు అమెజాన్ ప్రైమ్ చందాను అందిస్తాయి. వీటితో పాటుగా Vi మూవీస్ & టివి సభ్యత్వానికి కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. రూ.1,348 RDX ఫ్యామిలీ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌కు ఒక సంవత్సరం పాటు ఉచిత యాక్సెస్ ను అందించడంతో పాటుగా విమానాశ్రయాలలో ఉచిత లాంజ్ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. అన్ని ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ప్రాథమిక కనెక్షన్‌ల కోసం 200GB డేటా రోల్‌ఓవర్ సదుపాయంతో మరియు ద్వితీయ కనెక్షన్‌ల కోసం 50GB వరకు రోల్‌ఓవర్‌తో ఉంటాయి.


Click it and Unblock the Notifications








