Home
News

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ZEE5 ప్రీమియం బెనిఫిట్‌ అవుట్!! డిస్నీ + హాట్‌స్టార్ VIP ఇన్...

వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం సంస్థ ఇప్పుడు తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో Zee5 ప్రీమియం యొక్క చందాను ఇవ్వడం ఆపివేసింది. టెల్కో ఇటీవలే డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వాన్ని ఎంపిక చేసిన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందించడం ప్రారంభించింది. సాధారణంగా సంవత్సరానికి రూ.999 లేదా నెలకు రూ.99 ఖర్చు అయ్యే ZEE5 ప్రీమియం సభ్యత్వాన్ని కొంతకాలంగా Vi రూ.499 పైన గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో అందిస్తోంది. వ్యక్తిగత వినియోగదారుల కోసం Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రూ.499 ధర నుండి ప్రారంభమవుతాయి. అలాగే ఫ్యామిలీ వినియోగదారుల కోసం రూ.598 / Rs 649 నుండి ప్రారంభమవుతాయి. Vi టెల్కో ZEE5 ప్రీమియంకు బదులుగా డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ కు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ZEE5 ప్రీమియం ప్రయోజనాన్ని తొలగించిన Vi

ZEE5 ప్రీమియం ప్రయోజనాన్ని తొలగించిన Vi

వోడాఫోన్ ఐడియా యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో రూ.499 కంటే ఎక్కువ ధర వద్ద లభించే ప్లాన్ లు ZEE5 ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా ఇదివరకు అందించేవి. అయితే ఇకపై ఈ ప్రయోజనాన్ని Vi అందించడం లేదు. దీనికి బదులుగా టెల్కో తన పోస్ట్ పెయిడ్ ప్లాన్ లతో రూ.399 విలువైన డిస్నీ + హాట్స్టార్ VIP చందాను అందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ VIP మరియు Vi మూవీస్ & టివి యాప్ యొక్క OTT చందాలతో Vi RED సిరీస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Vi- ZEE5 ప్రీమియం

Vi- ZEE5 ప్రీమియం

వోడాఫోన్ ఐడియా టెల్కో యొక్క వెబ్‌సైట్‌లో ZEE5 ప్రీమియం చందా కోసం కొన్ని నిబంధనలు మరియు షరతులను అప్ డేట్ చేసింది. రూ.499 మరియు అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లపై ZEE5 ప్రీమియం చందాను అందివ్వడం ఇప్పుడు w.e.f 00:00 10 మార్చి 2021నుండి ఉపసంహరించబడింది. ZEE ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఒప్పందాన్ని పునరుద్ధరించిన తరువాత రాబోయే రోజుల్లో VEE ZEE5 ప్రీమియం చందా ప్రయోజనాన్ని తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Vi REDX పోస్ట్‌పెయిడ్

Vi REDX పోస్ట్‌పెయిడ్

రూ.1,099 ధర వద్ద లభించే Vi REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఇప్పుడు ZEE5 ప్రీమియం ప్రయోజనంను అందివ్వకపోవడం అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. గత సంవత్సరం REDX ప్లాన్ ను ప్రారంభించినప్పుడు Vi టెల్కో సాధ్యమైనంత వరకు ఉత్తమమైన ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. అలాగే రూ.499 వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ అపరిమిత వాయిస్ కాలింగ్, 200GB వరకు రోల్‌ఓవర్‌తో 75GB డేటా, నెలకు 100SMS ప్రయోజనాలతో వస్తుంది. అలాగే రూ.699 ధర గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అపరిమిత డేటా (150GB క్యాప్), నెలకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలతో లభిస్తుంది.

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ సిరీస్

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ సిరీస్

Vi ఫ్యామిలీ సిరీస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో రూ .649, రూ.799, రూ.999 మరియు రూ.1,348 ధరల వద్ద లభించే RDX ఫ్యామిలీ ప్లాన్లు కూడా Zee5 ప్రీమియం సభ్యత్వం లేకుండా ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే మరొకవైపు టెల్కోలో రూ.355, రూ.405, రూ.595, రూ.795 మరియు రూ .2,595 ధరల వద్ద లభించే ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా Zee5 ప్రీమియం చందాతో లభించడం లేదు.

Best Mobiles in India

English summary
Vi Telco Removed ZEE5 Premium OTT Subscription Benefits on Postpaid Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X