Vi యూజర్లు ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడం ఎలా?
ఇండియాలోని టెలికాం పోటీ ప్రపంచంలో ఇతరులతో పోటీ పడడానికి వోడాఫోన్ ఐడియా ఎల్లప్పుడూ ప్రత్యేకమైన ఆఫర్లతో భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు బిఎస్‌ఎన్‌ఎల్ వంటివి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తో బిజీగా ఉండగా, వోడాఫోన్ ఐడియా సంస్థ ఒక అడుగు ముందుకు వెళ్లి Zee ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఐడియా ఇప్పుడు Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మొత్తంగా ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తోంది. మరోవైపు భారతి ఎయిర్‌టెల్ కూడా రూ .289 ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్ తో అందిస్తోంది. Vi టెల్కో ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi తో ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందగలమా?
వోడాఫోన్ ఐడియా వినియోగదారులు రూ. 355, రూ.405, రూ. 595, రూ.795 మరియు రూ. 2,595 ధరల వద్ద లభించే ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ZEE5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. వాస్తవానికి టెల్కోలో ఆరు ప్లాన్‌లు ఉన్నాయి. రూ.455 ప్లాన్ వోడాఫోన్ ఐడియా యొక్క కొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ZEE5 ప్రీమియం యొక్క ప్రయోజనాన్ని ఒక సంవత్సరం పాటు కొనసాగించడానికి పైన పేర్కొన్న ఏదైనా ప్లాన్‌లతో మొదట రీఛార్జ్ చేసిన తర్వాత వినియోగదారులు కనీసం రూ.219లతో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా ZEE5 ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ZEE5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను రూ.355 ఎంట్రీ లెవల్ Vi ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వద్ద పొందవచ్చు. ఇది కేవలం 50GB డేటా ఆఫర్ తో 28 రోజుల వాలిడిటీతో కూడిన డేటా ప్లాన్. ఈ రీఛార్జ్‌లో కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు లేవు. అదే రూ.355 ప్లాన్‌ను కొత్త Vi కస్టమర్లకు రూ .455 వద్ద అందిస్తున్నారు. రూ.455 రీఛార్జ్ ప్లాన్ పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, కేరళ టెలికాం సర్కిల్‌లలో మాత్రమే లభిస్తుంది.

ఉచితంగా ZEE5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందించే జాబితాలో రెండవది రూ.405 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS మరియు 90GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. తరువాత రూ.595, రూ.795 ప్లాన్లు రోజువారి 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో వరుసగా 56 రోజులు, 84 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి. చివరగా రోజువారి 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో ఒక సంవత్సరం (365 రోజులు) చెల్లుబాటు కాలంతో రూ.2,595 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఉంది.


Click it and Unblock the Notifications








