మీ ఫోన్ మీరే విరగ్గొట్టాలి: థాయ్ నేవి శిక్ష

Posted By:

మీ ఫోన్ మీరే పగులగొట్టాలి..వేరెవరూ పగలకొట్టడానికి వీలు లేదు..అదేమిటి అనిఅనుకుంటున్నారా..అయితే థాయ్ లాండ్ స్టోరి చూడాల్సిందే. నిబంధనలను మీరి వీధుల్లోకి మొబైల్ పోన్లను తీసుకువచ్చిన ట్రైనీలకు థాయ్ లాండ్ నేవీ అధికారులు వెరైటీ శిక్షను విధించారు. తామెంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్లను చేతికి రాళ్లిచ్చి విరగ్గొట్టమని ఆదేశించారు.

Read more: స్మార్ట్‌ఫోన్ వెలుతురు అత్యంత ప్రమాదకరమా..?

మీ ఫోన్ మీరే విరగ్గొట్టాలి: థాయ్ నేవి శిక్ష

దీంతో మరో దారి లేక థాయ్ నౌకాదళంలో కొత్తగా చేరినవారు తమ తమ సెల్ ఫోన్లను నేలపై పెట్టి రాళ్లు తీసుకుని తమ చేతులతోనే నాశనం చేశారు. దీన్ని మరో సైనికుడు వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టారు. ఈ వెరైటీ పనిష్మంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

Read more: కమిట్ మాయ: ఫోన్ నీటిలో..మీరు ఇంటిలో

చిన్న తప్పు చేస్తే ఒక్కసారైనా క్షమించకుండా ఇలాంటి శిక్ష విధించడం ఏంటని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే దీనిపై అక్కడి అధికారులు స్పందించారు. తాము కొన్ని నిబంధనలు పెట్టుకున్నామని వీటి గురించి ట్రైనీలకు ముందుగానే చెప్పామని రూలు అతిక్రమిస్తే శిక్ష ఇలానే ఉంటుందని వారు సమాధానం ఇచ్చారు.

English summary
here write Video of Thai navy cadets smashing phones stirs criticism
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting