Vivo Days Sale: గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో వివో ఫోన్‌ల కొనుగోలుకు సరైన సమయం ఇదే!!!!
ఇండియా యొక్క స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో వివో స్మార్ట్‌ఫోన్‌కు అధికంగా డిమాండ్ ఉంది. వివో సంస్థ వివిధ రకాల సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లలో వివో సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. వివో స్మార్ట్‌ఫోన్‌లను కొనదలచిన వారి కోసం సంస్థ ఆన్‌లైన్ ద్వారా కొన్ని ప్రత్యేకమైన సేల్స్ ఏటా నిర్వహిస్తూ ఉన్నటుంది.

వివో డేస్ సేల్స్
ఆన్‌లైన్ షాపింగ్ కోసం అధిక మంది ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ను చూస్తూ ఉంటారు. అన్ని రకాల వస్తువులను కొనడానికి వీలుగా ఉన్న ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు వివో సంస్థ తన వివో డేస్ సేల్స్ ను మళ్లీ నిర్వహిస్తోంది. ఈ సేల్స్ సమయంలో వివో సంస్థ తన చాలా రకాల స్మార్ట్‌ఫోన్‌ల మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తున్నది. మీరు వివో స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ఉంటే కనుక దాన్ని పొందడానికి ఇదే ఉత్తమ సమయం. వివో డేస్ సేల్స్ ఈ రోజు అంటే మే 27 నుండి మే 29 వరకు మాత్రమే జరగనున్నాయి. Amazon India లో ఉద్యోగ అవకాశం!!! 50,000 జాబ్స్...

సేల్స్ ఆఫర్స్
వివో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో నిర్వహిస్తున్న వివో సేల్స్ లో కొన్ని గొప్ప డిస్కౌంట్ ఒప్పందాలను అందిస్తోంది. ఇందులో హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్‌లను ఎటువంటి అదనపు ఖర్చు లేని నో-కాస్ట్ EMI పద్దతి ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. Rs.10,000 ధర లోపు ఆన్‌లైన్ సేల్స్ లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

Vivo Z1X
వివో సంస్థ గత సంవత్సరం లాంచ్ చేసిన వివో Z1X ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుత సేల్స్ సమయంలో గొప్ప తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఇప్పుడు 6GB ర్యామ్ / 64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.15,990 ధర వద్ద, 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ .16,990 ధర మరియు 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. YouTube Premium ను 6 నెలల పాటు ఉచితంగా పొందడం ఎలాగో తెలుసా?

Vivo V19
వివో సంస్థ కెమెరా-ఫ్రీక్స్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన తాజా V-సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కూడా ప్రస్తుతం సేల్స్ సమయంలో డిస్కౌంట్ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. వెనుక వైపు క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉండి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కలిగి ఉన్న వివో V19 యొక్క 8GB ర్యామ్ / 128GB వేరియంట్‌ను రూ.27,990 ధర వద్ద మరియు హై-ఎండ్ వేరియంట్ 8GB ర్యామ్ / 256GB స్టోరేజ్ మోడల్ ను రూ.31,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఇతర స్మార్ట్‌ఫోన్‌లు
వివో సంస్థ తన వివో సేల్స్ సమయంలో తన కొత్త ఫోన్ల మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యొక్క వివో డేస్ సేల్స్ సమయంలో తన పాత ఫోన్ వివో V17 ను రూ.24,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే దీనిని 18 నెలల వరకు ఎటువంటి ఖర్చు లేని EMI ఎంపికతో కూడా కొనుగోలు చేయవచ్చు.

వివో Y19, Y12,Y15
వివో సంస్థ యొక్క ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో వివో Y19 ను రూ.14,990 ధర వద్ద 9 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికతో కొనుగోలు చేయవచ్చు. వివో Y12 ను రూ.10,990 ధర వద్ద 6 నెలల వరకు ఎటువంటి ఖర్చు లేని నో-కాస్ట్ EMI ఎంపికతో కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా వివో Y15 ను కూడా రూ.12,990 ధర వద్ద 6 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐతో లభిస్తుంది.

వివో S1 ప్రో
వివో సేల్స్ సమయంలో వివో S యొక్క 4GB ర్యామ్ / 128GB వేరియంట్‌ను రూ.16,990 ధర వద్ద 9 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికతో పొందవచ్చు. అలాగే వివో S1 ప్రో యొక్క 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.20,990 ధర వద్ద 18 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికతో కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి ఉన్న వినియోగదారులు అమ్మకం సమయంలో మరిన్ని వివో స్మార్ట్‌ఫోన్‌ల మీద గల ఆఫర్‌లను తనిఖీ చేయడానికి ఫిప్‌కార్ట్ యొక్క వెబ్‌సైట్ కు వెళ్ళవచ్చు.


Click it and Unblock the Notifications








