గొప్ప క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో రిటైల్ షాపులలో వివో S1
వెనుక వైపు మూడు కెమెరాలు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, మరియు ఆకర్షించే డిజైన్‌లతో వివో S1 భారతదేశంలో విడుదల చేయబడింది. లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ వాగ్దానం చేసినట్లే సరికొత్త వివో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కొన్ని క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు బ్యాంకింగ్ డిస్కౌంట్‌లతో కొన్ని అధికారిక రిటైల్ దుకాణాల నుండి లభిస్తుంది. వివో S1 డైమండ్ బ్లాక్,స్కైలైన్ బ్లూ,కాస్మిక్ గ్రీన్ వంటి మూడు కలర్లలో లభిస్తుంది.

వివో S1 ఇప్పుడు దేశవ్యాప్తంగా వున్న రిలయన్స్ డిజిటల్, పూర్వికా, బిగ్ సి, లాట్, సంగీత, క్రోమా, మరియు విజయ్ సేల్స్ మరియు మోర్టార్ వంటి రిటైల్ దుకాణాల నుండి పొందడానికి వివో యొక్క బేస్ వేరియంట్ 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మాత్రమే అందుబాటులో ఉంది.

ధర వివరాలు:
వివో S1 యొక్క 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 17,990 రూపాయల నుండి మొదలవుతుంది. అలాగే వివో S1 యొక్క 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర 18,990 రూపాయలకు వస్తుంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ మోడల్ ధర 19,990 రూపాయలు.

లభ్యత మరియు ఆఫర్ల వివరాలు:
వివో S1 ఇప్పుడు ఇండియాలో రిలయన్స్ డిజిటల్, పూర్వికా, బిగ్ సి, లాట్, సంగీత, క్రోమా మరియు విజయ్ సేల్స్ స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 7.5 శాతం క్యాష్‌బ్యాక్ మరియు జియో చందాదారులకు 10,000 రూపాయల విలువ గల వోచర్ ఆఫర్లతో వివో S1 కొనుగోలు చేయవచ్చు.
రిటైల్ అవుట్లెట్ల నుండి వివో S1 ను కొనుగోలు చేయడానికి పేటిఎమ్ ఉపయోగిస్తున్నప్పుడు ఇన్‌స్టాకాష్‌లో అదనంగా 10 శాతం ఎక్స్చేంజ్ కూడా ఉంది. 4 జీబీ ర్యామ్ వేరియంట్ దేశంలో ఆగస్టు 14 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయించనుండగా 6 జీబీ ర్యామ్ వేరియంట్లు మాత్రం ఈ నెలాఖరులో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.

స్పెసిఫికేషన్స్:
వివో S1 స్మార్ట్‌ఫోన్ 6.38-అంగుళాల ఫుల్-HD + (1080x2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో P65 MT6768 SoC జతచేయబడి ఉంటుంది. ఇది 4 జిబి ర్యామ్ మరియు 6 జిబి ర్యామ్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. మెమొరీ విషయంలో ఇది వివిధ వేరియంట్లలో 128 జిబి వరకు గల ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది. ఫోన్ యొక్క లాక్ ఓపెన్ చేయడం కోసం డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

కెమెరాలు:
ఫోన్ యొక్క ఇమేజింగ్ హార్డ్‌వేర్‌లో వెనుకవైపు f/ 1.78 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/ 2.2 వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు f/ 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మూడవ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 సెన్సార్ లెన్స్ ద్వారా నిర్వహించబడతాయి.

కనెక్టివిటీ :
వివో S1 స్మార్ట్‌ఫోన్ లైవ్ ఫోటో, AI సూపర్ వైడ్ యాంగిల్, పోర్ట్రెయిట్ మోడ్, AR స్టిక్కర్స్ మరియు AI ఫేస్ బ్యూటీ వంటి కెమెరా ఫీచర్లను అందిస్తుంది. వివో S1 స్మార్ట్‌ఫోన్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో ఇది వై-ఫై 2.4 G + 5G, బ్లూటూత్ V5.0, GPS/ A-GPS, మరియు USB OTG మద్దతుతో మైక్రో-USB ఉన్నాయి.


Click it and Unblock the Notifications








