Home
News

3వేలు తగ్గింపు ధరను పొందిన వివో V15 ప్రో

వివో V15 ప్రో భారతదేశంలో ధర తగ్గింపును పొందింది. 6 జిబి మరియు 8 జిబి ఫోన్ వేరియంట్లు రెండూ ఇప్పుడు దేశంలో తగ్గిన ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ ఇప్పటికే వివో V15 ప్రోను సవరించిన ధరలకు విక్రయిస్తున్నాయి. 6GB మరియు 8GB వేరియంట్ రెండూ ఇప్పుడు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయని వివో ధృవీకరించింది .

vivo v15 pro price in india cut rs 23990 26990

ఫోన్ యొక్క ముఖ్య లక్షణాలు 6.39-అంగుళాల డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 675 SoC, 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, పాప్-అప్ సెల్ఫీ సెన్సార్ మరియు 3,700 మహ్ బ్యాటరీ.

ధరల తగ్గింపు వివరాలు:

ధరల తగ్గింపు వివరాలు:

ధరలు తగ్గింపు పొందిన తరువాత వివో V15 ప్రో యొక్క 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ ధర ఇప్పుడు 23,990 రూపాయలు . అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర 26,990 రూపాయలు. వివో V15 ప్రో యొక్క స్మార్ట్ ఫోన్లు మే నెలలో లాంచ్ అయినప్పుడు 8 జిబి ర్యామ్ వేరియంట్ యొక్క ధర 29,990 రూపాయలు కాగా 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 28,990 రూపాయలు. వివోV15 ప్రో 6 జిబి ర్యామ్ వేరియంట్ చివరిసారిగా ఈ ఏడాది మేలో ధర తగ్గింపును చూసింది.

లభ్యత మరియు ఆఫర్లు:

లభ్యత మరియు ఆఫర్లు:

కొత్తగా తగ్గింపు పొందిన ఈ ధరలు ఈ రోజు నుండి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో లభిస్తుంది. వివో V15 ప్రో మొబైల్ టోపాజ్ బ్లూ మరియు రూబీ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ లో నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఆఫ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ తో జాబితా చేసింది. అలాగే అమెజాన్ ఇండియాలో కూడా నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డుల మీద 5 శాతం క్యాష్‌బ్యాక్, హెచ్‌ఎస్‌బిసి కార్డుపై 5 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. వివో ఇండియా ఇ-స్టోర్ లో నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మరియు 10,000 రూపాయల విలువైన జియో ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముంబయికి చెందిన రిటైలర్ మహేష్ ఈ ధరల తగ్గింపుపై మొదట నివేదించారు.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

వివో V15 ప్రో డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ తో ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 9 తో రన్ అవుతుంది. స్పెసిఫికేషన్ పరంగా ఇది 6.39-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2340 పిక్సెల్స్) అల్ట్రా ఫుల్‌వ్యూ డిస్ప్లే మరియు సూపర్ అమోలెడ్ ప్యానెల్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 AIE SoC మరియు 6GB LPDDR4x RAM తో జతచేయబడి వస్తుంది.

కెమెరా:

కెమెరా:

ఫొటోస్ మరియు వీడియోల కోసం వివో V15 ప్రో మొబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ క్వాడ్ పిక్సెల్ సెన్సార్ తో ఎఫ్/ 1.8 లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా AI సూపర్ ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వైడ్-యాంగిల్ సెన్సార్, మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ మూడవ కెమెరా కలిగి ఉంటాయి. వెనుక కెమెరా AI బాడీ షేపింగ్ మరియు AI పోర్ట్రెయిట్ లైటింగ్ వంటి ఫీచర్స్ లకు మద్దతు ఇస్తుంది. సెల్ఫీల కోసం పాప్-అప్ కెమెరా మాడ్యూల్ ఫీచర్ తో 32 మెగాపిక్సెల్ సెన్సార్ తో కెమెరా ఉంటుంది.

కనెక్టివిటీ :

కనెక్టివిటీ :

వివోV15 ప్రోలో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మెమొరీని మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 256 జిబి వరకు విస్తరించబడుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది 4G VoLTE, వై-ఫై 802.11 ఎ / బి / జి / ఎన్, బ్లూటూత్ V5.0, GPS/ A-GPS, మైక్రో-యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, డిజిటల్ కంపాస్, గైరోస్కోప్ మరియు సామీప్య సెన్సార్ తో పాటు డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్ కూడా ఉంది. అంతేకాకుండా ఇది 3,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది డ్యూయల్-ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది 15 నిమిషాల్లో 0 నుండి 24 శాతం వరకు ఛార్జ్ చేయబడుతోంది. దీని యొక్క కొలతలు 157.25x74.71x8.21mm మరియు 185 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo v15 pro price in india cut rs 23990 26990
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X