ఇండియాలో లాంచ్ అయిన వివో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌

|

వివో ఉహించిన విధంగా ఎంట్రీ లెవల్ వివో Y90 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. వివో Y90 'మేక్ ఇన్ ఇండియా' పట్ల తమ నిబద్ధతను అనుసరిస్తోందని అందుకోసం వివో Y90 స్మార్ట్‌ఫోన్‌ను వివో సంస్థ గ్రేటర్ నోయిడాలో తయారు చేయబడిందని కంపెనీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో గురువారం తన వివో Y90 స్మార్ట్‌ఫోన్‌ను పాకిస్తాన్‌లో విడుదల చేసింది.

ఇండియాలో లాంచ్ అయిన వివో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌

 

అయితే ఒక రోజు తరువాత వివో ఈ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. వివో Y90 అనేది వివో సంస్థ నుండి వస్తున్న ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్. ఇది వాటర్‌డ్రాప్ స్టైల్ తో వస్తుంది. ఇండియాలో వివోZ1 ప్రో లాంచ్ అయిన తర్వాత ఈ నెలలో విడుదల చేసిన రెండవ స్మార్ట్‌ఫోన్ వివోY90 కావడం గమనార్హం.

ఇండియాలో లాంచ్ అయిన వివో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌

వివో యొక్క Y సిరీస్ బడ్జెట్ శీర్షికలతో ప్రారంభమైందని మరియు ఎంట్రీ లెవల్ ఫోన్‌లను కలిగి ఉందని ఇప్పుడు తెలిసింది. ఈ ధోరణికి అనుగుణంగా ఉండి వివోY90 అత్యంత సరసమైన వివో ఫోన్‌లలో ఒకటిగా అవతరిస్తుంది.

ధర మరియు లభ్యత:

ధర మరియు లభ్యత:

వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపున్ మరియా పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ పెద్ద బ్యాటరీ మరియు పెద్ద డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్న వినియోగదారులకు వివో Y90 స్మార్ట్‌ఫోన్ మంచి సరసమైన ధర పాయింట్ వద్ద అందిస్తుంది.

వివో Y90 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 2GB ర్యామ్+ 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర 6,990రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 27 శనివారం నుండి అన్ని ఆఫ్‌లైన్ దుకాణాలలో మరియు ప్రధాన ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

స్పెసిఫికేషన్స్:
 

స్పెసిఫికేషన్స్:

ఫోన్ 16GB ఇంటర్నల్ స్టోరేజీతో ప్రారంభమవుతుంది అయినప్పటికీ వినియోగదారులకు అదనపు మెమరీ అవసరమని భావిస్తే వారు 256GB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీను అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ ఫోన్‌ 4030 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది మరియు మరియు ఇది 10W మైక్రో-యుఎస్బి ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. ఇందులో ఎఫ్‌ఎం రేడియో కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.0 మరియు జిపిఎస్ ఉన్నాయి. USB-OTG, 3.5mm ఆడియో జాక్ మరియు మైక్రో- USB 2.0 పోర్ట్‌కు కూడా మద్దతు ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క కొలతలు 55.11 × 75.09 × 8.28 మిమీ, మరియు దీని బరువు 163.5 గ్రాములు. ఆప్టిక్స్ పరంగా వివో Y90 వెనుకవైపు 8 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాను అందిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

ఫీచర్స్:

ఫీచర్స్:

వివో Y90 ఆశ్చర్యకరంగా సరికొత్త ఆండ్రాయిడ్ 9 పై కు బదులుగా ఆండ్రాయిడ్ 8.1 ఓరియోలో వివో యొక్క స్వంత అనుకూలీకరణలతో ఫంటౌచ్ ఓఎస్ 4.5తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.22-అంగుళాల HD + డిస్ప్లేని 720 × 1520 పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 88.6% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాడ్-కోర్ మీడియాటెక్ హెలియో A22 SoC చేత శక్తిని కలిగి ఉండి 2GB RAM తో జతచేయబడి ఉంటుంది. కెమెరా విషయంలో వివోY90 స్మార్ట్‌ఫోన్‌ f/ 2.0 ఎపర్చరు మరియు ఎల్ఇడి ఫ్లాష్ తో 8MP సింగిల్ రియర్ కెమెరా సెన్సార్ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
vivo y90 entry level smartphone launched in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X