Home
News

Rs.8,990లకే 5,000mAh బ్యాటరీ గల వివో U10 స్మార్ట్‌ఫోన్‌

వివో సంస్థ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో విడుదల చేసింది. ఇటీవలే వివో కంపెనీ వివో జెడ్ 1 ఎక్స్ మరియు వివో వి 17 ప్రో అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ రోజు మరొక వివో U10 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇది సెప్టెంబర్ 29 నుండి అమెజాన్ మరియు వివో యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

ప్రముఖ చైనా కంపెనీ వివో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూడు వేరియంట్లలో అందిస్తోంది. ఇందులో బేస్ వేరియంట్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ మోడల్ యొక్క ధర 8,990 రూపాయలు. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర 9,990 రూపాయలు. ఇందులో టాప్-ఎండ్ మోడల్ 4 జీబీ ర్యామ్ + 6 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర 10,990 రూపాయలు.

లభ్యత

లభ్యత

వివో యొక్క ఈ స్మార్ట్‌ఫోన్ వివో U10 ఇండియాలో సెప్టెంబర్ 29 నుండి విక్రయించబడుతోంది. ఈ నెల 29న అమెజాన్ లో జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్బంగా ఇది ప్రతేక ఆకర్షణగా అమ్మకానికి ఉంచింది. ఆఫర్‌ల విషయానికొస్తే ఎస్‌బిఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు ఫోన్ కొనుగోలుపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఆరు నెలల పాటు నో-కాస్ట్ EMI ఎంపికను కూడా పొందుతారు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

వివో U10 హెచ్‌డి + రిజల్యూషన్‌తో 6.35 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీని యొక్క డిస్ప్లే 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. వాటర్‌డ్రాప్ తరహా నోచ్డ్ డిస్‌ప్లే డిజైన్‌ను అందించే మరో స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌తో జత చేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC నుండి శక్తిని పొందుతుంది. మెమరీ విస్తరణ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

కెమెరా

వివో U10 స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో మొదటిది మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ తో కూడిన సెకండరీ కెమెరా ఉంటుంది. చివరిగా పోర్ట్రెయిట్ మోడ్ కోసం 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ మద్దతు గల కెమెరా కూడా జతచేయబడి ఉంటుంది.సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

కనెక్టివిటీ

వివో U10 స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ కోసం మద్దతును అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్ ఆధారంగా రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్లు, బ్లూటూత్, జిపిఎస్ మరియు 4G VoLTE వంటి సాధారణ కనెక్టివిటీ ఎంపికలు ఇందులో ఉన్నాయి. వివో U10 ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ కలర్ లలో లభిస్తుంది. వినియోగదారులకు మంచి గేమింగ్ అనుభవాన్ని అందించడానికి అల్ట్రా గేమ్ మోడ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. ఇది సిస్టమ్-వైడ్ డార్క్ మోడ్‌కు మద్దతు ఇస్తుంది. చివరగా వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Vivo U10 Smartphone Launched in India: Price, Sale Date, Specs and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X