Vivo Y12s బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!! ఫీచర్స్ బ్రహ్మాండం...

|

ఇండియాలో ప్రస్తుతం 'మేక్ ఇన్ ఇండియా' చొరవ విపరీతంగా పెరిగింది. ఎంతలా అంటే విదేశి సంస్థలు కూడా ఇండియాలోనే తమ యొక్క బ్రాండ్లను తయారుచేస్తున్నాయి. ఇందులో భాగంగా వివో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ తన యొక్క Y-సిరీస్‌లో బడ్జెట్ ధరలో కొత్త వివో Y12s స్మార్ట్‌ఫోన్ ను నేడు భారత్‌లో విడుదల చేసింది. 5,000mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా వంటి అద్బుతమైన హైలైటింగ్ ఫీచర్లతో లభించే వివో కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో Y12s స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రూ.9,990 బడ్జెట్ ధర ట్యాగ్ వద్ద ఫాంటమ్ బ్లాక్ మరియు గ్లాసియర్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల అయింది. ఈ ఫోన్ ఇప్పుడు వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటిఎమ్, టాటాక్లిక్ మరియు ఇతర భాగస్వామి రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫోన్ ఇటీవల లాంచ్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ M02, షియోమి రెడ్‌మి 9 ప్రైమ్, మరియు రియల్‌మి C15 వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వనున్నది.

వివో Y12s మీడియాటెక్ హెలియో P35 ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్

వివో Y12s మీడియాటెక్ హెలియో P35 ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్

వివో Y12s స్మార్ట్‌ఫోన్ 6.51-అంగుళాల హాలో ఫుల్ వ్యూ LCD IPS వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే HD + స్క్రీన్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో P35 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది.

వివో Y12s డ్యూయల్ కెమెరా సెటప్ ఫీచర్స్

వివో Y12s డ్యూయల్ కెమెరా సెటప్ ఫీచర్స్

వివో Y12s స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు రేట్ చేయబడ్డాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరా మోడ్ లలో పోర్ట్రెయిట్, ఫోటో, వీడియో, పనో, లైవ్ ఫోటో, స్లో-మోషన్, టైమ్-లాప్స్, ప్రో, మరియు డిఓసి వంటి వివిధ కెమెరా ఫీచర్లను కలిగి ఉన్నాయి.

వివో Y12s ఫన్ టచ్ OS11 ఫీచర్స్

వివో Y12s ఫన్ టచ్ OS11 ఫీచర్స్

వివో Y12s స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఫన్ టచ్ OS11 ఆధారంగా రన్ అవుతూ 10W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS, గ్లోనాస్, ఒటిజి, మైక్రో- USB 2.0, ఎఫ్ఎమ్ రేడియో వంటి వివిధ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ అదనంగా కూడా అందిస్తున్నది.

Best Mobiles in India

English summary
Vivo Y12s New Budget Smartphone Released in India: Price, Specs, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X