Home
News

Vodafone Idea: రోజువారీ 4GB డబుల్ డేటా బెనిఫిట్ తో మరో కొత్త ఆఫర్...

వోడాఫోన్ ఐడియా గత కొన్ని రోజుల ముందు 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లలో 'డబుల్ డేటా' ఆఫర్‌ను తన వినియోగదారులకు అందించింది. కానీ టెల్కో ఇటీవలే రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌పై డబుల్ డేటా బెనిఫిట్ ఇవ్వడం ఆపివేసింది. అయితే ఇప్పుడు అదే ఆఫర్ను మరో మూడు ప్లాన్‌లతో అందిస్తోంది.

వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా యొక్క రూ.299, రూ.449 మరియు రూ .699 ప్లాన్‌లు 2GB రోజువారీ డేటాను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్లాన్‌లు మూడు డబుల్ డేటా ప్రయోజనంను అందిస్తున్నాయి. అంటే అవి ఇప్పుడు మొత్తం చెల్లుబాటు కాలానికి రోజుకు 4GB డేటాను అందిస్తున్నాయి. ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా టెల్కో 168 జీబీ వరకు అదనపు డేటాను అందిస్తోంది. మొత్తం మీద వోడాఫోన్ ఐడియా ఇప్పుడు ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై డబుల్ డేటాను అందిస్తోంది. కాకపోతే ఈ ఆఫర్ ప్రస్తుతం తొమ్మిది టెలికాం సర్కిల్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది.

వొడాఫోన్ ఐడియా డేటా ప్లాన్‌లు

వొడాఫోన్ ఐడియా డేటా ప్లాన్‌లు

ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌ల విషయానికి వస్తే వోడాఫోన్ ఐడియా టెలికాం ఆపరేటర్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. టెల్కో ప్రస్తుతం అత్యధికంగా 1.5 జీబీ రోజువారీ డేటా ప్లాన్‌లను రూ .249, రూ.399, రూ.499, రూ .555, రూ .599, రూ .2,399 ధరల వద్ద అందిస్తోంది. ఈ టెల్కో ఇండియాలో లాక్‌డౌన్ ప్రారంభమయ్యే ముందు, వోడాఫోన్ ఐడియా రూ .249, రూ .399 మరియు రూ .599 అనే మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ‘డబుల్ డేటా' ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ మూడు ప్లాన్‌లు ఆఫర్‌లో భాగంగా రోజుకు 3GB రోజువారీ డేటాను అందించాయి.

వొడాఫోన్ ఐడియా డబుల్ డేటా ప్లాన్‌లు

వొడాఫోన్ ఐడియా డబుల్ డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా ఇప్పుడు డబుల్ డేటా ఆఫర్కులో భాగంగా మరో మూడు ప్లాన్‌లను కూడా జోడించింది. టెల్కో యొక్క రూ .299, రూ.449 మరియు రూ.699 ధర గల డేటా ప్లాన్‌లు ముందు 2GB రోజువారీ డేటాను అందించేవి. అయితే ఇప్పుడు ఈ ప్లాన్‌లు తన వినియోగదారులకు 4 జిబి డేటాను వరుసగా 28, 56 మరియు 84 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే చెందింది కాబట్టి 2GB రోజువారీ డేటా ప్లాన్‌లలో 168GB వరకు డబుల్ డేటా ప్రయోజనాన్ని పొందడానికి మీరు దీన్ని ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు.

డబుల్ డేటా ఆఫర్ లభించే సర్కిల్‌లు

డబుల్ డేటా ఆఫర్ లభించే సర్కిల్‌లు

వోడాఫోన్ ఐడియా యొక్క ఈ డబుల్ డేటా ఆఫర్ ప్రస్తుతం డిల్లీ, మధ్యప్రదేశ్, ముంబై, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్ మరియు జమ్మూ కాశ్మీర్లలో తొమ్మిది సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్‌సైట్‌లోని మేము గుర్తించిన సమాచారం ప్రకారం ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ టెలికాం సర్కిల్‌లో (రూ. 699 ప్లాన్ మినహా) చెల్లుతుంది.

వోడాఫోన్ ఐడియా 1.5GB డైలీ డేటా ప్లాన్‌లలో డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ ఐడియా 1.5GB డైలీ డేటా ప్లాన్‌లలో డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై డబుల్ డేటా బెనిఫిట్‌ను అందిస్తోంది. ఇందులో మూడు కొత్త ప్లాన్‌లు ఉన్నాయి మరియు రెండు పాత ప్లాన్‌లైన రూ. 399 & రూ .599 ఆఫర్‌లో భాగంగా కొనసాగుతున్నాయి. రూ .399 మరియు రూ .599 ప్లాన్లు రోజుకు 3 జీబీ డేటాను వరుసగా 56 మరియు 84 రోజుల వరకు వస్తాయి. ఈ ఆఫర్ యొక్క టెల్కో భాగం నుండి వచ్చిన మొత్తం ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ చేయడానికి మరియు సంబంధిత చెల్లుబాటు కాలానికి రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపడానికి అనుమతిస్తాయి.

వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా మొదట అన్ని టెలికాం సర్కిల్‌లలో డబుల్ డేటా ఆఫర్‌ను ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఇది కేవలం తొమ్మిది సర్కిల్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది. డేటా వినియోగం తక్కువగా ఉన్న సర్కిల్‌లలో మాత్రమే టెల్కో డబుల్ డేటాను అందిస్తోంది. భారతదేశంలో లాక్డౌన్ దశలో మొబైల్ నెట్‌వర్క్‌లలో డేటా వినియోగం వేగంగా పెరుగుతున్నందున వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఈ డబుల్ డేటా ఆఫర్‌ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea 2GB Data Plans now Offers Double Data Benefit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X