Home
News

Vodafone డబుల్ డేటా ఆఫర్ ఈ సర్కిల్‌లలో ఇక లభించదు...

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ యొక్క 14 సర్కిల్‌లలో ప్రకటించిన డబుల్ డేటా ఆఫర్ ప్రస్తుతం ఎనిమిది సర్కిల్‌లలో ఇకపై చెల్లదని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కేరళ, నార్త్ ఈస్ట్, పంజాబ్, యుపి, మహారాష్ట్ర, గోవా సర్కిల్‌లలో ఈ డబుల్ డేటా ఆఫర్ ఇకపై చెల్లదని వోడాఫోన్ సంస్థ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ సంస్థ తన డబుల్ డేటా ఆఫర్ ను వినియోగదారులకు మూడు ప్లాన్‌లపై అందించింది. ఈ డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా రూ.249 ప్లాన్‌తో 3GB హై స్పీడ్ డేటాను బ్రౌజ్ చేయడానికి అనుమతించింది. ఈ ఎనిమిది సర్కిల్‌లలోని వోడాఫోన్ వినియోగదారులు ఇప్పుడు ఈ మూడు ప్లాన్‌లపై కేవలం 1.5GB హై స్పీడ్ డేటాను మాత్రమే బ్రౌజ్ చేయగలరు.

వోడాఫోన్ డబుల్ డేటాను ఆఫర్ చేసిన మూడు ప్లాన్‌లు

వోడాఫోన్ డబుల్ డేటాను ఆఫర్ చేసిన మూడు ప్లాన్‌లు

వోడాఫోన్ సంస్థ వినియోగదారులకు డబుల్ డేటా ఆఫర్ కింద రూ .249 ప్లాన్, రూ. 399 ప్లాన్, రూ .599 మూడు ప్లాన్‌లపై ముందు అందిస్తున్న 1.5GB డేటాకు అదనంగా మరొక 1.5GB అదనపు హైస్పీడ్ డేటాను అందించింది. అంటే ఈ ప్లాన్‌లపై వినియోగదారులు ఒక రోజుకు 3GB డేటాను అధిక వేగంతో పొందారు. అస్సాం, తమిళనాడు మరియు కర్ణాటక వంటి ఇతర సర్కిల్‌లలోని వొడాఫోన్ వినియోగదారులు ఈ ఆఫర్‌ను ఇప్పటికీ సంస్థ అందిస్తున్నది.

మూడు ప్లాన్‌ల ప్రయోజనాలు

మూడు ప్లాన్‌ల ప్రయోజనాలు

రూ .249, రూ .399, రూ .599 వంటి మూడు ప్లాన్‌లు వినియోగదారులకు అపరిమిత కాల్స్ మరియు 100 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను వరుసగా 28 రోజులు, 56 రోజులు మరియు 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందించాయి. అదనంగా ఈ మూడు ప్లాన్‌లు వోడాఫోన్ ప్లే మరియు Zee5 స్ట్రీమింగ్ వంటి సేవలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి.

3GB డేటాను అందిస్తున్న వోడాఫోన్ ప్లాన్‌లు

3GB డేటాను అందిస్తున్న వోడాఫోన్ ప్లాన్‌లు

వోడాఫోన్ సంస్థ ప్రస్తుతం ఎనిమిది సర్కిల్‌లలో తన డబుల్ డేటా ఆఫర్‌ను తీసివేసినప్పటికీ వోడాఫోన్ తన అన్ని సర్కిల్‌లలో రెండు అధిక ధరల ప్లాన్‌లపై 3GB హై స్పీడ్ డేటాను అందిస్తున్నది. వోడాఫోన్ యొక్క రూ.398 ధర గల ప్లాన్‌ రోజుకు 3GB హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు 100SMSల ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి. అదనంగా ఈ ప్లాన్ వొడాఫోన్ ప్లే మరియు Zee5 లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నది. అదేవిధంగా కంపెనీ 398 రూపాయల సారూప్య ప్రయోజనాలతో రూ.588 ధర గల ప్లాన్‌ 56 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. మహారాష్ట్ర మరియు గోవా సర్కిల్‌లోని సంస్థ రూ .299, రూ .449, రూ .699 మూడు ప్లాన్‌లపై రోజుకు గరిష్టంగా 2GB డేటాను అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Double Data Offer is no Longer Available in These Circles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X