Airtel, Vodafone Idea యూజర్లకు తీయటి కబురు...

|

టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల యొక్క ప్రీపెయిడ్ అకౌంట్ చెల్లుబాటును మే 3 వరకు పొడిగించినట్లు ప్రకటించాయి. దేశంలో ప్రస్తుతం కొరోనావైరస్ కేసులు పెరగడం ప్రారంభించడంతో భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది.

ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా

అంతకుముందు ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా రెండూ ఏప్రిల్ 17 వరకు రూ.10 టాక్ టైమ్ మరియు ప్రీపెయిడ్ అకౌంట్ వాలిడిటీ పొడిగింపును ఇచ్చాయి. అయితే కొత్త లాక్డౌన్ వ్యవధి పొడగించినందున రెండు టెల్కోలు ప్రీపెయిడ్ వినియోగదారుల అకౌంట్ వాలిడిటీను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొడిగిస్తున్నాయి.ఇది తన యొక్క 90 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులకు వర్తిస్తుందని వోడాఫోన్ ఐడియా మరియు ఎయిర్టెల్ సంస్థలు తెలిపాయి.

భారతి ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఉచిత ఇన్‌కమింగ్ కాలింగ్

భారతి ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఉచిత ఇన్‌కమింగ్ కాలింగ్

ప్రైవేట్ టెల్కోస్‌ కనీస రీఛార్జ్ విధానాన్ని ఎప్పటినుంచో అమలుచేస్తున్నాయి. అందులో భాగంగా మీరు వాడుతున్న ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత వినియోగదారులు ఇన్‌కమింగ్ వాయిస్ కాల్‌లను స్వీకరించడం మానేస్తారు. ఈ లాక్డౌన్ వ్యవధిలో 30 మిలియన్ల మంది చందాదారులు తమ మొబైల్ నంబర్లను రీఛార్జ్ చేయలేకపోతున్నందున ఈ ఉచిత ఇన్‌కమింగ్ కాలింగ్ సదుపాయాన్ని ఇస్తున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. ప్రస్తుతం కస్టమర్లందరూ వారి ఎయిర్టెల్ మొబైల్ నంబర్లలో వారి ప్లాన్ యొక్క చెల్లుబాటు అయిపోయిన తర్వాత కూడా ఇన్కమింగ్ కాల్స్ అందుకోగలుగుతారు అని భారతీ ఎయిర్టెల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. రెండవ దశ లాక్డౌన్ మే 3, 2020 తో ముగుస్తుంది.

వోడాఫోన్ వినియోగదారులకు ఉచిత ఇన్‌కమింగ్ కాలింగ్

వోడాఫోన్ వినియోగదారులకు ఉచిత ఇన్‌కమింగ్ కాలింగ్

మొదటి దశ లాక్డౌన్ సమయంలో టెలికాం ఆపరేటర్లు ప్రీపెయిడ్ వినియోగదారులకు 2020 ఏప్రిల్ 17 వరకు అదనపు ఖర్చు లేకుండా అకౌంట్ చెల్లుబాటును పొడిగించడంతో పాటు రూ .10 టాక్ టైమ్ ప్రయోజనాన్ని కూడా అందించారు. ఇప్పుడు 2019 మే 3 వరకు ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్న వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఇన్కమింగ్ సేవలను తన 90 మిలియన్ల వినియోగదారులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.

ఇన్కమింగ్ వాలిడిటీ ఎక్స్‌టెన్షన్

ఇన్కమింగ్ వాలిడిటీ ఎక్స్‌టెన్షన్

ఇన్కమింగ్ వాలిడిటీ ఎక్స్‌టెన్షన్ అర్హత కలిగిన వినియోగదారులందరి అకౌంట్ లలో జమ అవుతోందని టెల్కో తెలిపింది. "తక్కువ-ఆదాయ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక చొరవతో వోడాఫోన్ ఐడియా కస్టమర్లు ఇప్పుడు తమ ప్రియమైన వారితో పూర్తిగా కనెక్ట్ అవ్వడం కొనసాగించవచ్చు.

SMS ద్వారా రీఛార్జ్ పొందే విధానం

SMS ద్వారా రీఛార్జ్ పొందే విధానం

SMS ద్వారా రీఛార్జ్ పొందడానికి మొదటగా మీరు SBI, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మరియు ఇండస్లండ్ బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉందని గమనించండి. ఎటిఎం రీఛార్జ్ సౌకర్యం కోసం కంపెనీ తొమ్మిది వేర్వేరు బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అయితే ఎస్ఎంఎస్ రీఛార్జ్ సౌకర్యం ప్రస్తుతం ఐదు బ్యాంకులతో మాత్రమే అందుబాటులో ఉంది. రీఛార్జ్ పొందటానికి ప్రతి బ్యాంకుకు వేరే SMS టెక్స్ట్ ఫార్మాట్ ఉంటుంది.

ATM ద్వారా రీఛార్జ్ చేయడం

ATM ద్వారా రీఛార్జ్ చేయడం

ఇండియాలో భారతి ఎయిర్‌టెల్‌ సుమారు 100 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉన్నారు. లాక్డౌన్ వ్యవధిలో తమ చందాదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతి ఎయిర్‌టెల్ తన చందాదారులకు రీఛార్జ్ సదుపాయాన్ని కల్పించడానికి హెచ్‌డిఎఫ్‌సి మరియు ఐసిఐసిఐ బ్యాంక్‌లతో జతకట్టింది. ఇది మాత్రమే కాదు లాక్డౌన్ కాలంలో పనిచేస్తున్న అపోలో ఫార్మసీలతో పాటు టెల్కో దిగ్గజం బిగ్ బజార్ కిరాణా దుకాణాలతో జతకట్టింది.

 

 

Best Mobiles in India

English summary
Airtel and Vodafone Idea Extend Incoming Call Facility

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X