రోజుకు 4GB డేటాను అందిస్తున్న వోడాఫోన్- ఐడియా ప్లాన్‌లు ఇవే....

|

కరోనా వైరస్ మహమ్మారి విజృంభన ప్రస్తుతం ఇండియాలో రోజురోజుకి అధికం అవుతున్న కారణంగా అన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగుల యొక్క ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకొని ఇంటి వద్ద నుండి పనిచేయడాన్ని మరికొన్ని రోజుల పాటు పెంచింది. టెలికామ్ సంస్థలలో ప్రస్తుతం పోటీ విపరీతంగా పెరిగింది. టెల్కోలు అన్ని కూడా తమ వినియోగదారుల బేస్ ను కాపాడుకోవడానికి మరియు కొత్త వారిని ఆకట్టుకోవడానికి రకరకాల కొత్త ఆఫర్లను అందిస్తున్నాయి. వోడాఫోన్- ఐడియా సంస్థ తమ వినియోగదారుల కోసం డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా రోజుకు 4GB డేటాను అందిస్తున్నది.

వొడాఫోన్ ఐడియా 4GB డైలీ డేటా ప్లాన్‌లు
 

వొడాఫోన్ ఐడియా 4GB డైలీ డేటా ప్లాన్‌లు

ఎయిర్టెల్, జియో మరియు BSNL వంటి సంస్థలకు పోటీగా వొడాఫోన్ ఐడియా టెల్కో తమ వినియోగదారులకు 4GB రోజువారీ డేటా గల ప్లాన్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటివద్ద ఉండి అధిక డేటా కోసం ఎదురుచూస్తున్న యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్లను అందిస్తున్నది. రోజువారి 1GB మరియు 1.5GB డేటా ప్లాన్లతో పాటు 2GB డేటా ప్లాన్ లను కూడా అందిస్తున్నది. కానీ ప్రస్తుతం 2GB డైలీ డేటా ప్లాన్ ల మీద డబుల్ డేటా ఆఫర్లను అందిస్తున్నది. ఈ ఆఫర్లు ఎంతకాలం అందుబాటులో ఉంటాయో తెలీదు కావున మీరు వోడాఫోన్ కస్టమర్ అయితే కనుక వెంటనే రీఛార్జ్ చేసుకోండి.

వొడాఫోన్ ఐడియా డబుల్ డేటా ప్లాన్‌లు

వొడాఫోన్ ఐడియా డబుల్ డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా ఇప్పుడు డబుల్ డేటా ఆఫర్కులో భాగంగా మూడు ప్లాన్‌లను అందిస్తున్నది. టెల్కో యొక్క రూ .299, రూ.449 మరియు రూ.699 ధర గల డేటా ప్లాన్‌లు ముందు 2GB రోజువారీ డేటాను అందించేవి. అయితే ఇప్పుడు ఈ ప్లాన్‌లు తన వినియోగదారులకు 4 జిబి డేటాను వరుసగా 28, 56 మరియు 84 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే చెందింది కాబట్టి 2GB రోజువారీ డేటా ప్లాన్‌లలో 168GB వరకు డబుల్ డేటా ప్రయోజనాన్ని పొందడానికి మీరు దీన్ని ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు.

వోడాఫోన్ రూ.229 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

వోడాఫోన్ రూ.229 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

వోడాఫోన్ - ఐడియా యొక్క రూ.229 ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో పాటుగా 4GB డైలీ డేటా ప్రయోజనాలను అందిస్తున్నది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 28 రోజులు.

వోడాఫోన్ రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
 

వోడాఫోన్ రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

డబుల్ డేటాను అందిస్తున్న మరొక ప్లాన్ రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 56 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. కావున వినియోగదారులు దీనిని ఎంచుకోవడం ఉత్తమం. వోడాఫోన్ యొక్క రూ.399 ప్లాన్ రోజుకు 1.5GB డేటాతో 56 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. కావున కేవలం రూ.50 తేడాతో అదనంగా మరొక 2.5GB డేటాను పొందవచ్చు. ఇది అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తుంది.

వోడాఫోన్ రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

వోడాఫోన్ రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా అధిక వాలిడిటీతో లభిస్తున్న మరొక ప్లాన్ రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 84రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. కావున అధిక డేటా వినియోగం ఉన్న వారు దీనిని ఎంచుకోవచ్చు. మళ్ళి టెల్కో ఇటువంటి ఆఫర్లను ఎప్పుడు అందిస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. ఈ ప్లాన్ రోజుకు 4GB డేటా ప్రయోజనాలతో పాటుగా అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone-Idea 4GB Daily Data Prepaid Plans Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X