Home
News

Vodafone నుంచి మరో కొత్త ప్లాన్!! 84 వాలిడిటీతో 2GB రోజువారి డేటా ప్రయోజనం

వోడాఫోన్ ఐడియా సంస్థ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరియు తమ యూజర్ బేస్ ను పెంచుకోవడానికి అనుక్షణం తపిస్తున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. వోడాఫోన్ ఐడియా యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ.819 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 2GB రోజువారి హై స్పీడ్‌ డేటాను 84 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఇది రూ.699 ప్లాన్ యొక్క అదే డేటా ప్రయోజనాలను అందిస్తుంది. కానీ అదనంగా 1సంవత్సరం పొడిగించిన వారంటీని కూడా అందిస్తుంది.

వోడాఫోన్ రూ .819 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ రూ .819 ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 1.5GB కంటే కొంచెం ఎక్కువ డేటాను కోరుకునే కస్టమర్ల కోసం టెల్కో యొక్క రూ .819 ప్రీపెయిడ్ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలతో పాటు OTT ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తుంది. ఇందులో ఒక సంవత్సరానికి 499 రూపాయల విలువైన వోడాఫోన్ ప్లే మరియు రూ.999 విలువైన ZEE ప్రీమియం చందా ఉన్నాయి. అలాగే 1ఇయర్ మొబైల్ షీల్డ్ వంటి మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

వోడాఫోన్ రూ .819 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ రూ .819 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ ఇండియా వెబ్‌సైట్‌లోని ప్రీపెయిడ్ ప్లాన్ జాబితాల ప్రకారం రూ.819 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100SMSలు మరియు అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే ఇది ZEE5 ప్రీమియం మరియు వొడాఫోన్ ప్లే సభ్యత్వానికి కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది. అలాగే 1 సంవత్సరం పొడిగించిన వారంటీని కూడా అదనంగా అందిస్తుంది.

వొడాఫోన్ ఐడియా ఇతర రోజువారి 2GB డేటా ప్లాన్‌లు

వొడాఫోన్ ఐడియా ఇతర రోజువారి 2GB డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా ఇప్పుడు డబుల్ డేటా ఆఫర్కులో భాగంగా మూడు ప్లాన్‌లను అందిస్తున్నది. టెల్కో యొక్క రూ .299, రూ.449 మరియు రూ.699 ధర గల డేటా ప్లాన్‌లు ముందు 2GB రోజువారీ డేటాను అందించేవి. అయితే ఇప్పుడు ఈ ప్లాన్‌లు తన వినియోగదారులకు 4 జిబి డేటాను వరుసగా 28, 56 మరియు 84 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే చెందింది కాబట్టి 2GB రోజువారీ డేటా ప్లాన్‌లలో 168GB వరకు డబుల్ డేటా ప్రయోజనాన్ని పొందడానికి మీరు దీన్ని ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు.

వొడాఫోన్ యొక్క కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వొడాఫోన్ యొక్క కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ కొత్తగా తన వినియోగదారుల కోసం రెండు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నది. రూ .899 ధర గల ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అయిన వోడాఫోన్ RED టుగెదర్ M ప్లాన్ 4 కనెక్షన్ల ప్రయోజనంతో వస్తుంది. ఇది వినియోగదారులకు ప్రతి నెలా 160GB డేటాను ఆఫర్ చేస్తుంది. ఇందులో మొదటి వినియోగదారుడికి 70GB డేటా రోల్ఓవర్ మరియు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ యొక్క రెండవ వినియోగదారులందరికీ 50GB డేటా రోల్‌ఓవర్‌తో 30GB లభిస్తుంది. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత టాక్‌టైమ్ ప్రయోజనంను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone-Idea Launched New Prepaid Plan With 2GB Daily Data and 84 Days Validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X