Home
News

Vodafone Idea క్యాష్‌బ్యాక్ ఆఫర్లు సూపరో సూపర్...

వొడాఫోన్ ఐడియా లాక్డౌన్ వ్యవధిలో చందాదారులను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడమే లక్ష్యంగా 'రీఛార్జ్‌ఫర్ గుడ్' అనే కొత్త ప్రోగ్రాంను ప్రారంభించింది. ఇందులో భాగంగా వోడాఫోన్ ఐడియా చందాదారులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర క్రియాశీల వోడాఫోన్ చందాదారులకు రీఛార్జ్ చేస్తే 6% వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు.

వొడాఫోన్ ఐడియా

ఏప్రిల్ 14, 2020 వరకు మొత్తం దేశం లాక్ డౌన్ లో ఉన్నందున ఆన్‌లైన్ రీఛార్జ్ సౌకర్యం లేని చాలా మంది చందాదారులు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వొడాఫోన్ ఐడియా యొక్క కొత్త ఆఫర్ అటువంటి చందాదారులకు ఉపయోగపడుతుంది. అలాగే క్యాష్‌బ్యాక్ ఫీచర్ లాక్‌డౌన్ వ్యవధిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న చందాదారులకు సహాయం చేయడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుంది.

వోడాఫోన్ ఐడియా # RechargeforGood ఎలా పనిచేస్తుంది

వోడాఫోన్ ఐడియా # RechargeforGood ఎలా పనిచేస్తుంది

వొడాఫోన్ ఐడియా #RechargeforGood ను ఒత్తిడితో కూడిన సమయంలో చందాదారులను ఒకరితో ఒకరు కనెక్ట్ చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో ప్రారంభించింది. వినియోగదారులు వోడాఫోన్ ఐడియా అందించిన క్యాష్‌బ్యాక్‌ను పొందాలనుకుంటే ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ చందాదారులు మై వొడాఫోన్ యాప్ లేదా మై ఐడియా యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. దాని తరువాత మరొక వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్ కోసం రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ పూర్తయిన తర్వాత ప్రీపెయిడ్ చందాదారులు 6% వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. చందాదారులు సంపాదించిన క్యాష్‌బ్యాక్ కూపన్ వారు చేసిన ఇతర రీఛార్జ్‌లపై ఉపయోగించవచ్చు.

రీఛార్జ్‌ఫర్‌గుడ్ ప్రోగ్రామ్‌

రీఛార్జ్‌ఫర్‌గుడ్ ప్రోగ్రామ్‌

ఎయిర్‌టెల్ మరియు జియో అడుగుజాడలను అనుసరించి వోడాఫోన్ ఐడియా కొత్త # రీఛార్జ్‌ఫర్‌గుడ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇతర ప్రీపెయిడ్ అకౌంటులను రీఛార్జ్ చేసినందుకుగాను చందాదారుని కమీషన్ సంపాదించడానికి వీలు కల్పిస్తుంది. వోడాఫోన్ ఐడియా ఇప్పటికే ఉన్న వోడాఫోన్ లేదా ఐడియా కస్టమర్ వేరొకరి కోసం చేసిన రీఛార్జిలపై 6 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ రీఛార్జిలను మైవోడాఫోన్ లేదా మైఇడియా యాప్ లను ఉపయోగించి నిర్వహించాలి. 6 శాతం వోడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ జియో మరియు ఎయిర్‌టెల్ యొక్క 4.16 శాతం కమీషన్ కంటే ఎక్కువ.

వొడాఫోన్ క్యాష్‌బ్యాక్

వొడాఫోన్ క్యాష్‌బ్యాక్

వొడాఫోన్ యొక్క జనాదరణ పొందిన రూ. 149 రీఛార్జ్, మరియు రూ. 249 రీఛార్జ్ లపై రూ. 10, రూ. 20 క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. అలాగే రీఛార్జ్ విలువ ఆధారంగా క్యాష్‌బ్యాక్ కూడా మారుతుంది మరియు వోడాఫోన్ 6 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉందని వోడాఫోన్ తెలిపింది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ "ఏఅర్న్ ఫ్రమ్ హోమ్"

ఎయిర్టెల్ "ఏఅర్న్ ఫ్రమ్ హోమ్" ప్లాన్ ను ఇప్పటికే ప్రవేశపెట్టినది. దీనిలో ఎయిర్టెల్ చందాదారుడు సూపర్ హీరోగా నమోదు చేసుకోవాలి. తరువాత ఇతర ఎయిర్టెల్ ప్రీపెయిడ్ అకౌంటులను రీఛార్జ్ చేస్తే వారికి క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎయిర్టెల్ రీఛార్జ్ మొత్తంలో తగ్గింపు కూడా ఉంటుంది. ఇందుకోసం సూపర్ హీరో చెక్అవుట్ వద్ద రీఛార్జ్ కోసం తక్కువ చెల్లించాల్సి ఉంటుంది మరియు కస్టమర్ నుండి పూర్తి మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఎయిర్‌టెల్ సూపర్ హీరో సభ్యుడు రూ. 149 రీఛార్జ్ మొత్తాన్ని కేవలం రూ.143 లకు రీఛార్జ్ చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea Offering Cashback on Prepaid Accounts Recharge
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X