Airtel, Vodafone, Jio ప్రస్తుతం సరసమైన ధరలో అందిస్తున్న అధిక డేటా ప్లాన్‌లు
దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ కారణాల వలన చాలా మంది వినోదంను అధికంగా ఆస్వాదించడానికి ప్రీపెయిడ్ చందాదారులు ఇప్పుడు రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ లతో తమ అకౌంటులను రీఛార్జ్ చేసుకోవాలని చూస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రస్తుతం రోజుకు 3GB వరకు డేటాను అందిస్తున్నరు.

టెలికాం ఆపరేటర్లు
ప్రభుత్వ అద్వర్యంలోని టెల్కో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు రోజుకు 5GB డేటాను 90 రోజుల చెల్లుబాటు కాలానికి తన రూ.551 ప్రీపెయిడ్ రీఛార్జితో అందిస్తోంది. అయితే దీనికి 4G సేవలు లేకపోవడం గతంలో కంటే ప్రస్తుత పరిస్థితులలో బిఎస్‌ఎన్‌ఎల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్‌తో రోజువారీ డేటా ప్రయోజనం పెరిగేకొద్దీ ప్లాన్ యొక్క ధర కూడా పెరుగుతుంది. టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను 365 రోజుల చెల్లుబాటుతో కూడా అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌ల ధరలు రూ.199 నుండి ప్రారంభమవుతాయి. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అందిస్తున్న 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో 1.5GB డైలీ డేటా ప్లాన్స్
ప్రీపెయిడ్ విభాగంలోని డేటా ప్లాన్‌లలో రిలయన్స్ జియో ఇప్పటికీ అత్యంత సరసమైన ధరలలో అందిస్తున్నది. jio యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్ లు రూ.199 నుండి ప్రారంభమయి రూ.1,199 వరకు ఉన్నాయి. రూ.199 ధర గల ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1.5GB డేటా, జియో టు జియో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1,000 నిమిషాల నాన్-జియో ఎఫ్‌యుపి మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజులు చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

జియో యొక్క రూ.399 ప్లాన్ 1.5GB డైలీ డేటా, 56 రోజుల వాలిడిటీ కాలానికి మొత్తంగా 84 జీబీ డేటాను అందిస్తుంది. ఇది మొత్తం చెల్లుబాటు కాలానికి అపరిమిత జియో టు జియో వాయిస్ కాలింగ్, 2,000 నాన్-జియో ఎఫ్‌యుపి నిమిషాలు మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది.

తదుపరిది వరుసలో రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5GB డేటా , 3,000 నాన్-జియో ఎఫ్‌యుపి నిమిషాలు, అపరిమిత జియో టు జియో వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 84 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ జాబితాలో చివరిది రూ.1,199 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 336 రోజుల చెల్లుబాటు కాలంలో మొత్తంగా 504GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత ఆన్-నెట్ కాలింగ్, 12,000 నాన్-జియో నిమిషాలు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు ఉన్నాయి.

భారతి ఎయిర్‌టెల్ 1.5GB డైలీ డేటా ప్లాన్లు
ఎయిర్‌టెల్ యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌ల విషయానికి వస్తే అవి 249 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. ఎయిర్‌టెల్ సంస్థ రూ .249, రూ .279, రూ. 399, రూ .598 మరియు రూ .2,398 ధరల వద్ద 1.5GB డైలీ డేటా ప్లాన్లను అందిస్తున్నది. రూ.249 మరియు రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకే ఒక్క మార్పు ఉన్నప్పటికీ అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్‌లు రోజుకు 1.5GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి. అలాగే ఇవి ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి. రూ.279 ప్లాన్ అదనంగా రూ.4 లక్షల జీవిత బీమా ప్రయోజనంతో వస్తుంది. రూ.399, రూ.598, రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్లు రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS ప్రయోజనాలను వరుసగా 56, 84, 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి.

వొడాఫోన్ ఐడియా 1.5GB డైలీ డేటా ప్లాన్స్
వోడాఫోన్ ఐడియా సంస్థ ప్రస్తుతం ఎంచుకున్న సర్కిల్‌లలో తన 1.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లలో డబుల్ డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. వోడాఫోన్ ఐడియా యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు రూ.249, రూ .399 మరియు రూ.599 ధరలను కలిగి ఉండి వరుసగా 28, 56 మరియు 84 రోజుల చెల్లుబాటు కాలానికి డబుల్ డేటా ఆఫర్ లో భాగంగా రోజుకు 3GB డేటాను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ మూడు ప్లాన్‌ల యొక్క ఇతర ప్రయోజనాలలో ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు మొత్తం చెల్లుబాటు కాలానికి రోజుకు 100SMS ప్రయోజనాలు ఉన్నాయి.

వోడాఫోన్ ఐడియా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా యొక్క వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2,399 ధరను కలిగి ఉండి ఇది రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అదనంగా టెల్కోలో ఎంపిక చేసిన సర్కిల్‌లలో రూ.499 మరియు రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఇవి వరుసగా 70 మరియు 77 రోజుల చెల్లుబాటు కాలంతో అన్ని రకాల ప్రయోజనాలతో అందించబడతాయి.


Click it and Unblock the Notifications








