Vodafone Idea కస్టమర్లకు ఊహించని బంపర్ ఆఫర్...
ఇండియా యొక్క టెలికామ్ రంగంలోకి జియో ఆగమనంతో అంతకు ముందు ఉన్న దానితో పోలిస్తే తారుమారు అయ్యాయి. కొన్ని సంస్థలు కనుమరుగు కూడా అయ్యాయి. ఇకపోతే వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు మార్కెట్లో తమ మనుగడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

వోడాఫోన్ ఐడియా డబుల్-డేటా ఆఫర్
ఈ సంస్థ ప్రస్తుతం ఉన్న తమ కస్టమర్ల సంఖ్యను కాపాడుకోవడానికి మరియు కొత్త వారిని ఆకర్షించడానికి కూడా లాక్ డౌన్ మొదలైన కొత్తలో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను విడుదల చేసింది. అలాంటి అద్భుతమైన ఆఫర్లలో ఒకటి 'డబుల్-డేటా ఆఫర్' . ఇందులో భాగంగా వినియోగదారులు మొదట వారు పొందుతున్న డేటాకు రెండు రెట్ల ఖచ్చితమైన డేటాను తమ ప్లాన్‌లతో అందించింది. టెల్కో అందించిన ఈ ఆఫర్లను చాలా మంది కస్టమర్లు ఈ ఆఫర్‌ను నిజంగా ఇష్టపడ్డారు. వోడాఫోన్ ఐడియా సంస్థ ఇప్పుడు తమ కస్టమర్లకు మరోక అద్భుతమైన ఆఫర్‌ను ముందుకు తీసుకువచ్చింది. ‘యాప్ / వెబ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్' కింద ఈ ప్రయోజనాన్ని ఐదు ప్లాన్ లతో అందిస్తున్నాయి. ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియా అన్ని సర్కిల్‌లలో 5GB వరకు అదనపు డేటాను అందిస్తోంది.

వోడాఫోన్ - ఐడియా "App/Web Exclusive Offer" వివరాలు
వోడాఫోన్ ఐడియా సంస్థ కొత్తగా అందిస్తున్న ‘యాప్ / వెబ్ ఎక్స్‌క్లూజివ్' ఆఫర్ కింద ఎంచుకున్న కొన్ని ప్లాన్‌లపై అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నది. అంటే టెల్కో ఎంచుకున్న కొన్ని ప్లాన్‌లపై ఇప్పుడు అందిస్తున్న డేటాతో పాటుగా అదనంగా 5GB వరకు డేటాను అందిస్తున్నది. టెల్కో వెబ్‌సైట్ యొక్క సిఫార్సు విభాగంలో మీరు ఈ కొత్త ఆఫర్‌ను అందిస్తున్న ప్లాన్‌ల వివరాలను మరియు వాటి యొక్క ప్రయోజనాలను చూడవచ్చు.

వోడాఫోన్ - ఐడియా రూ.149 ప్లాన్
వోడాఫోన్ - ఐడియా యొక్క రూ.149 ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో పాటుగా 2GB నెలవారీ డేటా ప్రయోజనాలను అందించేది. కానీ ఇప్పుడు దాని అసలు డేటా యొక్క ఆఫర్‌కు అదనంగా 1GB డేటాను అందిస్తోంది. కాబట్టి మొత్తంగా వినియోగదారులకు 3GB డేటా లభిస్తుంది.

వోడాఫోన్ - ఐడియా రూ.219 ప్లాన్
వోడాఫోన్ - ఐడియా టెల్కో అధిక డేటాను అందిస్తున్న రెండవ ప్లాన్ రూ.219 ప్లాన్. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1GB డేటా ప్రయోజనాన్ని 28 రోజుల చెల్లుబాటు కాలానికి వస్తుంది. కానీ ఇప్పుడు ఇది మరొక 2GB డేటాను కూడా అదనంగా అందిస్తుంది. రోజువారి యొక్క మీ డేటా పరిమితి 1GB అయిపోయిన తర్వాత ఈ అదనపు డేటా ప్రయోజానాన్ని ఉపయోగించుకోవచ్చు.

వోడాఫోన్ - ఐడియా రూ.249 ప్లాన్
వోడాఫోన్ - ఐడియా టెల్కో 28 రోజుల చెల్లుబాటు కాలంతో 1.5GB డేటా రోజువారీ డేటా ప్రయోజనంను రూ.249 ప్లాన్ తో అందిస్తున్నది. ఇప్పుడు ఈ ప్లాన్ యొక్క వినియోగదారులకు టెల్కో 5GB డేటాను అదనంగా కూడా అందిస్తున్నది. ‘యాప్ / వెబ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్' లో భాగంగా 1.5GB రోజువారీ డేటాను అందించే మరొ రూ .399, రూ .599 ప్లాన్‌లు కూడా 5GB అదనపు డేటాను అందిస్తున్నాయి. రూ.399, రూ.599 ప్లాన్‌లలో గల తేడా ఏమిటంటే రూ.399 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో మరియు రూ.599 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్‌లన్నీ అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100SMSల ప్రయోజనాన్ని కూడా అందిస్తున్నాయి.

వోడాఫోన్ - ఐడియా ఆల్-రౌండర్ ప్యాక్‌లు
వోడాఫోన్ - ఐడియా యొక్క కొత్త ‘యాప్ / వెబ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్' ప్రయోజనంను మరోక రెండు ప్లాన్‌లు కూడా అందుకుంటున్నాయి. ఇందులో రూ.49 (ఆల్-రౌండర్ ప్యాక్) మరియు రూ .79 (ఆల్-రౌండర్ ప్యాక్) ఉన్నాయి. ఇందులో రూ.49 ప్యాక్ ముందు అందిస్తున్న డేటా కంటే అదనంగా 200MB డేటాను మరియు రూ.79 ప్యాక్ కూడా ముందు అందిస్తున్న డేటా ప్రయోజనం కంటే అదనంగా మరొక 200 MB డేటాను వినియోగదారులకు అందిస్తున్నది.


Click it and Unblock the Notifications