Vi యూజర్లకు గుడ్ న్యూస్!! అపరిమిత డేటాతో ప్రత్యేకమైన ఆఫర్...
ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతం అధికంగా యూజర్లను కోల్పోతున్నది. దీనికి అడ్డుకట్ట వేయడానికి Vi టెల్కో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను అందిస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు తన యొక్క ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్తగా అపరిమిత డేటాను ప్రకటించింది. కొత్త ఆఫర్ యొక్క వివరాల విషయానికి వస్తే టెల్కో ప్రతిరోజూ అర్దరాత్రి 12AM నుండి ఉదయం 6 గంటల మధ్య ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితులు లేకుండా ప్రీపెయిడ్ వినియోగదారులకు అపరిమిత డేటాను అందిస్తుంది.

ఇది Vi నుండి వచ్చిన ఒక ప్రత్యేకమైన డేటా ఆఫర్. ఈ సమయంలో ఇతర టెల్కోలు ఎవ్వరు కూడా తమ వినియోగదారులకు ఇటువంటి ఆఫర్ ను ప్రస్తుతం అందించడం లేదు. ప్రత్యేక డేటా ఆఫర్ లో లభించే అపరిమిత డేటా వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వస్తుంది. కాకపోతే రూ.249 ప్లాన్‌తో లేదా అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్ తో రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi ప్రత్యేకమైన అపరిమిత డేటా ఆఫర్
ప్రతి రోజు అర్ధరాత్రి 12AM నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటాను అందిస్తున్నట్లు Vi తన ప్రత్యేకమైన డేటా ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ను పొందడానికి వినియోగదారులు రూ.249 ప్లాన్ తో లేదా అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమిత డేటా యొక్క ప్రయోజనాన్ని ఆస్వాదించవచ్చు. అర్హత ఉన్న వినియోగదారులకు ఇప్పటికే ‘వీకెండ్ డేటా రోల్ఓవర్' ఆఫర్ అందించబడుతున్నది. కావున ఈ కొత్త ఆఫర్ అనేది వినియోగదారులకు దొరికిన బోనస్ లాంటిది. రాత్రి సమయంలో అధికంగా డేటాను వినియోగించే వారికి ఈ వీకెండ్ డేటా రోల్ఓవర్ ఆఫర్ మరియు బోనస్ డేటా రెండు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని కారణంగా వినియోగదారులు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ను పొందనవసరం లేదు.

Vi అపరిమిత డేటా ఉపయోగం
ఇండియాలో ప్రస్తుతం ఓవర్ ది టాప్ (OTT) కంటెంట్ వినియోగం అధికం అయింది. రోజు రోజుకి దీని యొక్క డిమాండ్ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు నైట్ బింగింగ్ అనేది చాలా సాధారణమైంది. అందువల్ల వినియోగదారులకు రాత్రుల్లో సజావుగా కంటెంట్‌ను చూడటానికి సహాయపడటానికి Vi టెల్కో హై-స్పీడ్ వేగంతో అపరిమిత డేటాను అందిస్తోంది.

Vi అందించే మూడు ప్రత్యేక ఆఫర్‌లు
Vi టెల్కో కోల్పోయిన వినియోగదారులను ఆకట్టుకోవడానికి అందించే ఆఫర్‌లలో భాగంగా Vi ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు మూడు ప్రత్యేకమైన ఆఫర్‌లను అందిస్తోంది. అయితే భారతదేశంలో మరే ఇతర టెల్కో కూడా తమ వినియోగదారులకు ఇటువంటి అద్భుతమైన ప్రయోజనాలను అందించడం లేదు.
** Vi అందించే ప్రత్యేక ఆఫర్లలో మొదటిది ‘డబుల్ డేటా ఆఫర్'. ఈ ఆఫర్ కింద వినియోగదారులు పొందవలసిన దానికంటే డబుల్ డేటాను పొందుతారు.
** రెండవది ‘వీకెండ్ డేటా రోల్ఓవర్' ఆఫర్. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వీకెండ్ రోజులలో వారం రోజులలో ఉపయోగించని మొత్తం డేటాను ఉపయోగించుకోనే గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. అంటే మొత్తం వారంలో ఉపయోగించని 25GB డేటాను శని మరియు ఆదివారం రోజున ఉపయోగించవచ్చు.
** Vi అందించే ప్రత్యేక ఆఫర్లలో మూడవది నైట్ బింగింగ్ సర్వీస్. ఇందులో భాగంగా వినియోగదారులు ‘మిడ్నైట్ నుండి 6 AM వరకు' అధిక వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








