Home
News

Vi టెల్కో అందించే 50GB బోనస్ డేటాను పొందడం ఎలా??

ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) ప్రతి నెల వినియోగదారుల సంఖ్యను కోల్పోతున్నది. యూజర్ యొక్క డేటా బేస్ ను కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లతో తన యొక్క ప్లాన్‌లలో మార్పులను తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే 1 సంవత్సరం చెల్లుబాటుతో లభించే అత్యంత ఖరీదైన రూ.2,595 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులకు బోనస్ డేటాను అందిస్తోంది. అయితే Vi టెల్కో యొక్క మొబైల్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసే వినియోగదారులకు ఈ ప్లాన్‌తో వచ్చే స్టాండర్డ్ ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క 50GB బోనస్ డేటా ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi 50GB బోనస్ డేటా ఆఫర్

Vi 50GB బోనస్ డేటా ఆఫర్

వోడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులు తమ యొక్క Vi మొబైల్ యాప్‌ ద్వారా రూ.2,595 ధర వద్ద లభించే ప్లాన్ తో రీఛార్జ్ చేసిన వినియోగదారులకు అదనంగా ‘ఎక్స్‌ట్రా 50GB' డేటాను అందిస్తున్నట్లు యాప్‌లో చూడవచ్చు. ఈ 50GB అదనపు డేటా ప్లాన్ యొక్క మొత్తం 365 రోజుల గడువు కాలం ముగిసే వరకు ఎప్పుడైనా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆఫర్ ఎంతకాలం వరకు అందుబాటులో ఉంటుందో అన్న దానిపై వొడాఫోన్ ఐడియా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఇది పరిమిత సమయ ఆఫర్ అని భావిస్తున్నారు. కాబట్టి మీరు ఈ ప్లాన్‌ను పొందాలని ఆలోచిస్తుంటే కనుక వెంటనే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకొని 50GB అదనపు డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు.

Vi రూ.2,595 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

Vi రూ.2,595 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.2,595 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ వినియోగదారులకు 365 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB FUP డేటాను మరియు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే అదనపు ప్రయోజనాలలో ఒక సంవత్సర చెల్లుబాటుతో ZEE5 ప్రీమియం యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాన్ని పొందుతారు.

780GB డేటాను అందించే Vi టెల్కో ప్లాన్

780GB డేటాను అందించే Vi టెల్కో ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో సాధారణంగా రూ.2,595 రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులకు మొత్తం చెల్లుబాటు కాలంలో 730GB డేటాను అందిస్తుంది. కానీ ప్రస్తుతం అందిస్తున్న బోనస్ డేటాను కలుపుకొని వినియోగదారులు 780GB డేటాను పొందుతున్నారు. టెల్కో యొక్క వెబ్‌సైట్ నుండి రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదు. ఇది Vi యాప్ యొక్క ప్రత్యేకమైన ఆఫర్ కావున యాప్ లో రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే 50GB అదనపు డేటా లభిస్తుంది.

Vi రూ.2,595 రీఛార్జ్ ప్లాన్‌లో వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్

Vi రూ.2,595 రీఛార్జ్ ప్లాన్‌లో వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్

Vi రూ.2,595 రీఛార్జ్ ప్లాన్‌లో Vi మూవీస్ & టీవీ క్లాసిక్‌లకు ఉచిత యాక్సిస్ వంటి మరిన్ని మౌలిక ప్రయోజనాలు చేర్చబడ్డాయి. ఇందులో అనేక సినిమాలను మరియు లైవ్ టీవీ ఛానెల్‌లను చూడడానికి యాక్సిస్ ను కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌ ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్‌తో కూడా కలుపుకొని లభిస్తుంది. ఈ ఆఫర్‌తో వినియోగదారులు రోజులో మిగిలిపోయిన డేటాను వారాంతంలో (శనివారం నుండి ఆదివారం వరకు) ఉపయోగించుకోవడానికి అనుమతిని ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea (Vi) Offering 50GB Bonus Data!! How to Get ??
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X