పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల జాబితాలో పాత ధరలను చేర్చిన వోడాఫోన్

|

టెలికామ్ రంగంలో ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా పోస్ట్‌పెయిడ్ విభాగంలో భారతీ ఎయిర్‌టెల్‌తో వొడాఫోన్ గట్టి పోటీని ఎదురుకుంటున్నది. వోడాఫోన్ REDX ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను ప్రారంభించడంతో UK ఆధారిత టెల్కోకు పరిశ్రమలో పైచేయి లభించింది.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌

ప్రస్తుతం వొడాఫోన్ మూడు రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అవి ఒకే యూజర్ కోసం, మొత్తం కుటంబం కోసం మరియు 999 రూపాయల ప్రీమియం ప్లాన్‌లు.వొడాఫోన్ కంపెనీకి చెందిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఐఫోన్ ఫరెవర్ సబ్‌స్క్రిప్షన్‌తో ఇప్పుడు అందించబడుతున్నాయి. ఈ ఫీచర్ ఆపిల్ ఐఫోన్‌ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వొడాఫోన్ రెడ్ ఫ్యామిలీ ప్లాన్స్ కేవలం రూ.598 నుండి ప్రారంభమవుతాయి. అయితే ఒక యూసర్ కోసం పోస్ట్ పెయిడ్ ప్లాన్లు రూ.399 నుండి ప్రారంభమయి రూ.999 వరకు ఉంటాయి.

 

రైల్వే టికెట్ కోసం రైల్వే టికెట్ కోసం "బుక్ నౌ పే లేటర్" ఫీచర్ ను మొదలెట్టిన IRCTC

 ఫ్యామిలీ ప్లాన్

ప్రస్తుతం ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్ కూడా మంచి ఆఫర్ ధర వద్ద లభిస్తుంది. దీని ధర రూ.999 నుండి మొదలవుతుంది. వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఒక సంవత్సరానికి ఉచిత నెట్‌ఫ్లిక్స్ చందా, ఉచిత అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం, Zee 5 చందా మొదలైన వాటిని కూడా ఎక్కువ కాలం యాక్సిస్ ను అందిస్తాయి.

 

Jio VS BSNL న్యూ ఇయర్ ప్లాన్స్... ఈ ఆఫర్ల పోటీలో గెలుపు ఎవరిదీ?Jio VS BSNL న్యూ ఇయర్ ప్లాన్స్... ఈ ఆఫర్ల పోటీలో గెలుపు ఎవరిదీ?

యూజర్ కోసం వోడాఫోన్ RED పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

యూజర్ కోసం వోడాఫోన్ RED పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

కొన్ని నెలల క్రితం వోడాఫోన్ మెజారిటీ సర్కిల్‌లలో ఉన్న రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. అయితే టెల్కో ఈ ప్లాన్‌ను ఇప్పుడు మళ్ళి తిరిగి తీసుకువచ్చింది. ప్రస్తుతం వోడాఫోన్ (వోడాఫోన్ REDX) యూజర్స్ కోసం రూ.399, రూ.499, రూ.649 మరియు రూ.999 అనే నాలుగు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. వోడాఫోన్ యొక్క రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, నెలకు 40 జీబీ డేటా 200 జీబీ వరకు డేటా సౌకర్యం, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. కొత్త కస్టమర్ల కోసం రూ.399 ప్లాన్ ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే అదనపు 150 జీబీ డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో వోడాఫోన్ ప్లే, మొబైల్ షీల్డ్ మరియు అదనపు ఖర్చు లేకుండా రూ.999 విలువైన ZEE5 చందాను ఉచితంగా అందిస్తుంది.

 

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్లను 2020లో ఆశించవచ్చువాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్లను 2020లో ఆశించవచ్చు

RED పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌

వోడాఫోన్ RED పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో తదుపరి ప్లాన్‌ విషయానికి వస్తే రూ.499 రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఆఫర్ కింద ఇది 75 జిబి డేటాతో పాటు 200 జిబి డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. దీనితో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఒక సంవత్సరానికి రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ చందా,వొడాఫోన్ ప్లే, Zee5 చందాకు కూడా ఈ ప్లాన్‌తో యాక్సిస్ లభిస్తుంది.

Rs.649 ప్లాన్

చివరగా Rs.649 ప్లాన్ 90 జీబీ డేటాతో పాటు 200 జీబీ రోల్‌ఓవర్ సౌకర్యంను అందిస్తుంది.అలాగే ఇది రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ చందాను, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ ఐఫోన్ ఫరెవర్ చందాతో వస్తుంది.

వొడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వొడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వొడాఫోన్ గత నెలలో తన రూ .999 REDX ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌తో ధరను పెంచింది. REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత డేటా (నెలకు 150GB చొప్పున), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 50% వేగవంతమైన డేటా వేగం, 5,988 రూపాయల విలువైన ఒక సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ చందా, రూ.2,999 విలువైన ఏడు రోజుల ఐరోమ్ ప్యాక్, 999 రూపాయల విలువైన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం మరియు అంతర్జాతీయ విమానాశ్రయాలలో లాంజ్ లకు కూడా ఉచిత ప్రవేశం కల్పిస్తుంది. ఏదైనా మొబైల్ ఆపరేటర్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇది.

Best Mobiles in India

English summary
Vodafone Included Old Prices in the List of New Postpaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X