వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేసుకోవచ్చు

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వాట్సాప్‌ను వినియోగిస్తోన్న యూజర్లు ఇక పై తమ స్మార్ట్‌ఫోన్ మెమరీ స్టోరేజ్ కెపాసిటీ గురించి ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక పై మీ వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో భద్రంగా బ్యాకప్ చేసుకోవచ్చు.

Read More :  3జీబి ర్యామ్‌తో ‘కూల్‌ప్యాడ్ నోట్ 3', రూ.8,999కే

నిత్యం వాట్సాప్ అకౌంట్‌లో వందల కొద్ది చాట్‌లతో పాటు మల్టీ మీడియా కంటెంట్ షేర్ అవుతుంది. ఈ డేటా మొత్తం నిన్నటి వరకు ఫోన్ మెమరీలోనే స్టోర్ అయ్యేది. ఫోన్ మెమరీ ఫుల్ అయిన ప్రతిసారీ వాట్సాప్ డేటాను డిలీట్ చేయాల్సి వచ్చేది. ఇక పై అలాంటి సమస్య లేకుంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.

Read More : ఆంధ్రప్రదేశ్‌లో OnePlus ఫోన్‌ల తయారీ

వాట్సాప్ వినియోగం మరింతగా పెరుగుతోన్న నేపథ్యంలో ఈ యాప్ కంటెంట్‌కు బ్యాకప్ సౌకర్యాన్ని కల్పించాలని గూగుల్ డ్రైవ్ నిర్ణయించిందని గూగుల్ డ్రైవ్ డైరక్టర్ స్కాట్ జాన్స్ టన్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

ప్రపంచపు అతిపెద్ద కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్ (విలువ 12 బిలియన్లు!), హార్లీ డేవిడ్సన్ (విలువ 14 బిలియన్ డాలర్లు!)లతో పోలిస్తే వాట్సాప్ విలువ ఎక్కువ.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ సహవ్యవస్థాపకులు జాన్ కౌమ్ ఉక్రెయిన్ నుంచి యూఎస్‌కు 16వ ఏటనే వచ్చేసారు. ఆ సమయంలో అతని కుటుంబం తిండికి చాలా ఇబ్బంది పడింది.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

జమైకా, ఐస్‌ల్యాండ్, ఉత్తర కొరియా దేశాల జీడీపీతో పోలిస్తే వాట్సాప్ జీడీపీ ఎక్కువుగా ఉంది.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 50 కోట్లు!.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ కేవలం 55 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో అత్యధిక శాతం మంది మిలియనీర్లు కాగా, ఈ యాప్ వ్యవస్థాపకులైన బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్‌లు బిలియనీర్లు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో రోజు కొత్తగా 10 లక్షల మంది జాయిన్ అవుతున్నారు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా రోజుకు 50 కోట్ల ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

నాసా వార్షిక బడ్జెట్ దాదాపు 17 బిలియన్ డాలర్లతో పోలిస్తే వాట్సాప్ కంపెనీ విలువ ఎక్కువ.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బ్రియాన్ ఆక్టన్ 2009లో ట్విట్వర్, ఫేస్‌బుక్‌లలో ఉద్యోగ తిరస్కరణకు గురయ్యారు. ఆ తరువాత ఆయన ప్రారంభించిన వాట్సాప్ మొబైలింగ్ మెసేజింగ్ విభాగంలో సరికొత్త సంచలనంగా అవతరింరచింది.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ యూజర్ తన వాట్సాప్ అకౌంట్ ద్వారా ఆడియో ఫైల్స్, ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్ ఇంకా కరెంట్ లోకేషన్‌లను షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ యూజర్ తన వాట్సాప్ అకౌంట్ ద్వారా ఆడియో ఫైల్స్, ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్ ఇంకా కరెంట్ లోకేషన్‌లను షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌ను ఉపయోగించుకునే నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 700 మిలియన్లు, వీరిలో 70శాతం ముందు ఈ యాప్‌ను రోజు వినియోగించుకుంటున్నారు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా సంవత్సరానికి 7.2 ట్రిలియన్ల మెసేజ్‌లు పంపబడుతున్నాయి.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా పంపే సందేశాల సంఖ్య రోజుకు 30 బిలియన్ల కాగా, రిసీవ్ కాబుడుతున్న సందేశాల సంఖ్య 34 బిలియన్లు.

వాట్సాప్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ ద్వారా రోజుకు 700 మిలియన్ల ఫోటోలు షేర్ కాబడుతున్నట్లు అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp offers Android users back-up in Google Drive. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot