విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

Posted By:

విండోస్ ఫోన్8  మీ చేతిలో ఉంటే!!!
మైక్రోసాఫ్ట్ నుంచి ఇటీవల విడుదలైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ ఫోన్ 8' ఆధునిక మొబైలింగ్ సౌకర్యాలను విండోస్ యూజర్‌లకు పరిచయం చేస్తోంది. ఆండ్రాయిడ్‌కు ధీటుగా రూపొందించబడిన ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నోకియా, హెచ్‌టీసీ,
సామ్‌సంగ్ వంటి దిగ్గజ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థలు స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ప్రత్యేకతలను మీకు పరిచయం చేస్తున్నాం...

ఇవి కూడా చదవండి:

ఆండ్రాయిడ్ ‘సీక్రెట్ కోడ్స్'

స్నానాల గదిలో....

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

కిడ్స్ కార్నర్ (Kid's corner):

చిన్నారుల కోసం విండోస్ ఫోన్‌8‌లో ‘కిడ్స్ కార్నర్' పేరుతో ప్రత్యేక ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా చిన్నారులకు గేమ్స్, మ్యూజిక్ ఇంకా వీడియోలను ఆస్వాదించవచ్చు.

 

విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

ఎడిటింగ్ ఫోటో (Editing a photo):

విండోస్ ఫోన్8‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎడిటింగ్ టూల్స్ .. మీరు డౌన్ లోడ్ చేుసుకున్నా లేదా చిత్రీకరించిన ఫోటోలను అద్భుతంగా ఎడిట్ చేస్తాయి. క్రాప్..రొటేట్.. ఆటో-ఫిక్స్, క్రియేటివ్ స్టూడియో వంటి ప్రత్యేక ఆఫ్షన్‌లు ఉన్నాయి.

 

విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

లింకింగ్ ఈ-మెయిల్ ఇన్‌బాక్సెస్

(Linking email inboxes):

విండోస్ ఫోన్‌8‌లో ఏర్పాటు చేసిన లింకింగ్ ఈ-మెయిల్ ఇన్‌బాక్సెస్ ఫీచర్ మీ అన్ని మెయిల్ అకౌంట్ లకు సంబంధించిన ఇన్‌బాక్స్ సందేశాలను ఒకే చోటుకు తీసుకువస్తుంది. తద్వారా మెయిల్స్‌ను ఫోన్‌లోనే సులభతరంగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకు లింక్
ఇన్‌బాక్సెస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

 

విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

ట్రాన్స్‌లేటింగ్ టెక్స్ట్ (Translating text):

విండోస్ ఫోన్ 8 మీ కమ్యూనికేషన్ వ్యసవ్థను మరింత బలోపేతం చేస్తుంది. ప్రయాణాల్లో మీకు అర్థంకాని భాషను అర్థమయ్యే రీతిలో మలచి మీ ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తుంది. ‘స్కాన్ టెస్ట్' ఆప్షన్ ద్వారా ఈ ట్రాన్స్‌లేటింగ్ ప్రక్రియ సాధ్యమవుతుంది.

 

విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

పాట ఎవరిదో కనుగుంటుంది (Find out who a song is by):

డేటా కనెక్షన్ ఇంకా ఎక్స్ బాక్స్ మ్యూజిక్‌ను ఉపయోగించుకుని విండోస్ ఫోన్8 పాటలను వినటంతో పాటు ఆ పాటకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపగలదు.

 

విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

బ్యాటరీ ఆదా (Saving battery):

విండోస్ ఫోన్‌8లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘బ్యాటరీ సేవర్' ఆప్షన్ పవర్ వాడకం పట్ల యూజర్‌ను జాగృతపరుస్తూ బ్యాటరీని మరింత పొదుపు చేస్తుంది.

 

విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

లేటుగా వస్తున్నట్లు సందేశం (Send a running late message):

మీరు అపాయింట్‌మెంట్ ఇచ్చిన మిత్రులు లేదా ముఖ్య వ్యక్తులను అనుకున్న సమయంలో కలవలేకపోతున్నట్లయితే వారికి మీ విండోస్ ఫోన్‌8లోని క్యాలెండర్ అప్లికేషన్ ద్వారా లేటుగా వస్తున్నట్లు రన్నింగ్ లేట్ సందేశాన్ని పంపవచ్చు.

 

విండోస్ ఫోన్8 మీ చేతిలో ఉంటే!!!

స్కైప్ కాల్స్ నిర్వహించుకోవచ్చు (Making a Skype call):

విండోస్ మార్కెట్ ప్లేస్‌లో లభ్యమయ్యే స్కైప్ అప్లికేషన్‌ను మీ విండోస్ ఫోన్ 8లోకి ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా సౌకర్యవంతమైన వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot