సెల్ఫీ పోస్ట్‌తో కొంప కొల్లేరయింది

Written By:

సెల్ఫీ పోస్ట్‌తో కొంప కొల్లేరయింది. అవును సెల్పీదిగి దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు..ఆ పోస్ట్ చేసిన 'సెల్ఫీ' కారణంగా ఓ మహిళ తాను గుర్రపు పందెంలో గెలుచుకున్న సొమ్మును అనవసరంగా పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియాలోని పెర్త్ అస్కట్ రేస్‌కోర్స్‌లో మెల్‌బోర్న్ కప్ పోటీలను వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై చాంటెలె అనే మహిళ 20 డాలర్లు పందెం కాసింది.

Read more: జవాబులు చెప్పండి మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టండి

సెల్ఫీ పోస్ట్‌తో కొంప కొల్లేరయింది

అయితే అనూహ్యంగా ఆమె ఈ పందెంలో గెలిచింది. దీంతో ఆమెకు 825 డాలర్లు వచ్చాయి. ఈ ఆనందాన్ని పట్టలేని చాంటెలె సదరు రేస్‌కు సంబంధించిన టికెట్‌ను చూపిస్తూ సెల్ఫీ దిగి దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇంకే ముంది, ఆ టికెట్‌లో ఉన్న బార్‌కోడ్‌ను చూసిన కొందరు వ్యక్తులు దాన్ని ప్రింట్ తీసుకుని సొమ్ము మొత్తాన్ని డ్రా చేసుకున్నారు.

Read more: రానున్నది పాస్‌వర్డ్ లేని ప్రపంచమే..

సెల్ఫీ పోస్ట్‌తో కొంప కొల్లేరయింది

ఇది తెలియని చాంటెలె తనకు సొమ్ము ఇవ్వాలని నిర్వాహకులను సంప్రదించగా అప్పటికే డబ్బులు డ్రా అయ్యాయని వారు తాపీగా సెలవిచ్చారు. దీంతో అవాక్కవడం చాంటెలె వంతైంది. అయితే తన ఫేస్‌బుక్ పోస్ట్‌ను చూసిన స్నేహితులే ఈ పనిచేశారని, రేస్‌లో గెలుచుకున్న సొమ్ము మొత్తాన్ని అవసరంగా పోగొట్టుకున్నందుకు చాంటెలె మరో పోస్టుతో తన విచారం వ్యక్తం చేసింది.

Read more about:
English summary
Here Write women loses money for posting selfie in facebook
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot