రూ.4,999కే ఐబాల్ స్లైడ్ ఐ701 టాబ్లెట్

Posted By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ ఇంకా టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఐబాల్ ‘స్లైడ్ ఐ701' (Slide i701) పేరుతో ప్రపంచపు అతిచవకైన విండోస్ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఐబాల్, స్లైడ్ సిరీస్ నుంచి విడుదలైన ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ ధర రూ.4,999. ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ పై స్పందించే ఈ టాబ్లెట్‌‌తో పాటు ఒక సంవత్సరం మైక్రోసాఫ్ట్ ఉచిత లైసెన్స్‌ అలానే 1 టీబీ ఉచిత వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్‌ను కంపెనీ అందిస్తోంది.

(చదవండి: స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్‌నైక్... ఆ రోజుల్లో)

రూ.4,999కే ఐబాల్ స్లైడ్ ఐ701 టాబ్లెట్

ఐబాల్ ‘స్లైడ్ ఐ701' స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10), క్వాడ్-కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్టీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ వయా డాంగిల్, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రో హెచ్‌డిఎమ్ఐ, మైక్రో యూఎస్బీ), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

(చదవండి: మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు)

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లతో పాటు అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల వద్ద ఈ టాబ్లెట్ లభ్యమవుతోంది. డివైస్ కొనుగోలు పై  
ఉచిత బ్యాక్ కవర్‌తో పాటు రూ. 699 విలువ చేసే హెచ్‌డిఎమ్ఐ కేబుల్ అలానే రూ.5,999 విలువ చేసే మూడు ఇంటర్‌చేంజబుల్ ప్రొటెక్టివ్ కవర్లను ఉచితంగా పొందవచ్చు.

(చదవండి: సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5: 10 హాటెస్ట్ కాన్సెప్ట్స్)

English summary
World's Cheapest iBall Slide i701 Tablet with 7-inch Display, Intel Atom CPU Launched at Rs 4,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot